సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లు, పేరంటాలు, వేడు కల్లో ఆహారం వృథా అవుతోందన్న అంశాన్ని వివరిస్తూ ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కాస్త.. చూసి వడ్డించండి’ అనే కథనంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ఉపరాష్ట్రపతి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘సాక్షి’ కథనాన్ని ప్రస్తావించారు. ‘ఆహార భద్రతపై చర్చ జరుగుతున్న సమయంలో.. వివా హాది శుభకార్యాల్లో పరబ్రహ్మ స్వరూపమైన అన్నం 20 నుంచి 25 శాతం చెత్తకుప్పల పాలవుతోందంటూ కేంద్ర ప్రభుత్వ తాజా సర్వేలను ఉటంకిస్తూ ‘సాక్షి’పత్రికలో సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి రాసిన కథనాన్ని అందరూ చదివి ఆలోచించాల్సిన తరుణమిది’ అని వెంకయ్య ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ‘మన సంప్రదాయ పద్ధతిలో అతిథులకు స్వయంగా వడ్డించినప్పుడు తక్కువ మొత్తంలో.. బఫే పద్ధతిలో ఎక్కువగా వృథా జరుగుతోందనే విషయాన్ని మనం గమనించాలి. ఈ మధ్య అలంకరణలతో పాటు విందుల్లో ఆడంబరాలు ఎక్కువవుతున్నాయి. ఈ దుబారా, ఆడంబరాలపై అందరం ఆలోచించి వీటిని అరికట్టేందుకు ఉపక్రమించాలి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. (చదవండి: కాస్త.. చూసి వడ్డించండి)
ఆహార భద్రతపై చర్చ జరుగుతున్న సమయంలో.. వివాహాది శుభకార్యాల్లో పరబ్రహ్మ స్వరూపమైన అన్నం 20-25% చెత్తకుప్పల పాలవుతోందంటూ కేంద్ర ప్రభుత్వ తాజా సర్వేలను ఉటంకిస్తూ ‘సాక్షి’ పత్రికలో శ్రీ సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి రాసిన కథనాన్ని అందరూ చదివి ఆలోచించాల్సిన తరుణమిది.
— Vice President of India (@VPSecretariat) December 1, 2019
Comments
Please login to add a commentAdd a comment