scholor ship
-
సాధన చేశారు.. సాధించారు..
నిజామాబాద్: సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపాధ్యా యుల ప్రోత్సాహంతో అందిపుచ్చుకుంటున్నారు. ఇటీవల ప్రకటించిన జాతీయ ప్రతిభా ఉపకార వేత నాల(ఎన్ఎంఎంఎస్) ఫలితాలే అందుకు నిదర్శ నం. ఈ స్కాలర్షిప్కు ఉమ్మడి జిల్లాలో 205 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సాహించాలని కేంద్ర ప్రభు త్వం మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ అందజేస్తుంది. ఎనిమిది, తొమ్మది తరగతి విద్యార్థులకు పరీక్ష పెట్టి ఎంపికైన ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇంటర్ వరకు ఉపకారం వేతనం అందజేస్తోంది. ఈ ఏడాది నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటి 205 మంది ఉపకార వేతనానికి ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా నుంచి 130 మంది, కామారెడ్డి జిల్లా నుంచి 75 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. చొరవ చూపితే మరింత ప్రయోజనం ఉమ్మడి జిల్లాలో కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాడనికే పరిమితం కాకుండా విద్యార్థులు పరీక్షలో విజయం సాధించే విధంగా శిక్షణనిస్తున్నారు. దీంతో ఆయా పాఠశాల విద్యార్థులు స్కాలర్షిప్కు ఎంపికవుతున్నారు. కానీ చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు దీనిపై చొరవ చూపడం లేదు. కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నా.. ఉపాధ్యాయుల అలసత్వంతో ఉమ్మడి జిల్లాలో అనేకమంది విద్యార్థులు ఉపకార వేతనానికి దూరమవుతున్నారు. ఆయా ప్రభుత్వ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులతో దరఖాస్తులు చేయించి పరీక్ష రాయించాల్సి ఉన్నా.. కొందరు మాత్రమే చొరవ తీసుకొని దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఉపాధ్యాయులు చొరవ చూపి విద్యార్థులను పరీక్షకు సిద్ధం చేస్తే మరింత మందికి ప్రయోజనం కలుగుతుంది. ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు అందేలా టీచర్లు ప్రోత్సహించాలి. దీంతో విద్యార్థులు లబ్ధి పొందుతారు. అన్ని పాఠశాలల్లో టీచర్లు ఈ విధంగా కృషి చేయాలి. – దుర్గాప్రసాద్, డీఈవో ఈ చిత్రంలో కనిపిస్తున్న వేల్పూర్ మండలం మోతె ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ ప్రతిభా ఉపకార వేతనాని(ఎన్ఎంఎంఎస్)కి ఎంపికయ్యారు. ఈ పాఠశాల ఉపాధ్యాయులు చొరవ చూపి విద్యార్థులతో దర ఖాస్తులు చేయించి పరీక్షలో విజయం సాధించే విధంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో ప్రతిసారి ఈ పాఠశాల నుంచి విద్యార్థులు స్కాలర్షిప్కు ఎంపిక అవుతున్నారు. -
స్కాలర్షిప్లు అందిస్తోన్న ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ
రాబోయే విద్యాసంవత్సరానికి సంబందించి తమ సంస్థలో చదువుకోదల్చిన అంతర్జాతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తామని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ (ఎఫ్ఏయూ) ప్రకటించింది. ఈ స్కాలర్షిప్ నాలుగేళ్లు లేదా ఎనిమిది సెమిస్టర్ల పాటు అందుతుంది. ఒక్కో విద్యార్థికి గరిష్టంగా కోర్సు పూర్తయ్యేలోపు 24 వేల డాలర్ల స్కాలర్షిప్ అందుతుంది. ఈ ఉపకార వేతనం అందడం ద్వారా విద్యార్థులకు చదుకు కోసం అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఎఫ్ఏయూ స్కాలర్షిప్ పొందాలంటే.. విద్యార్థులు తప్పనిసరిగా మే 1 నాటికి దరఖాస్తు పూర్తి చేసి ఉండాలి. - జీపీఏ స్కోర్ యూఎస్ గ్రేడింగ్ స్కేల్ పై కనీసం 3.5 నుంచి 4.0 వరకు ఉండాలి. అప్లికేషన్ మెటీరియల్స్ అన్నీ స్వీకరించిన తరువాత, అది సమగ్రంగా ఉందని యూనివర్సిటీ భావించిన తరువాత, నాలుగు వారాల్లోగా స్కాలర్ షిప్ సెలెక్షన్స్ తెలియజేస్తామని యూనవర్సిటీ ప్రతినిధులు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు పొందే భారతీయ విద్యార్థులు ఇతర అంతర్జాతీయ స్కాలర్ షిప్స్ కూడా పొందే అవకాశం ఉంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల్లో 170కిపైగా డిగ్రీలతో ఉన్న ఎఫ్ఎయూతో స్టడీ గ్రూప్ భాగస్వామ్యం భారతీయ విద్యార్థుల విద్య, కెరీర్ ఆకాంక్షలను మరింత బలోపేతం చేస్తుందని స్టడీ గ్రూప్ రీజనల్ డైరెక్టర్ ఇండియా శ్రీ కరణ్ లలిత్ -
తెలుగు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించిన తానా
డల్లాస్: తానా ఫౌండేషన్, డల్లాస్ ఆధ్వర్యంలో తెలుగు విద్యార్ధులకు స్కాలర్ షిప్‌లు అందించారు. గత పదిహేనేళ్లుగా తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తానా ఫౌండేషన చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ మాట్లాడుతూ.. తానా చేపడుతున్న అనేక కార్యక్రమాల వల్ల సమాజంలో ఎంతో మందికి లబ్ధి కలుగుతుందన్నారు. సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తానాలాంటి స్వచ్చందసంస్థకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన దాతలు కార్యకర్తలకు తానాఫౌండేషన్ బృందం ధన్యవాదాలు తెలిపింది. రాబోయే కాలంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తానా ఫౌండేషన్ తెలిపింది. -
మెకానిక్ కొడుకు.. అమెరికన్ స్కూల్ టాపర్
లక్నో: కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉండాలేగాని పేదరికం మనల్ని ఏం చేయలేదు అనేది పెద్దల మాట. ఈ మాటల్ని రుజువు చేసే ఘటనలు మన ముందు కొకొల్లలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో చోటు చేసుకుంది. అమెరికన్ స్కాలర్షిప్ పొంది హై స్కూల్ విద్య కోసం ఆ దేశం వెల్లడమే కాక తన ప్రతిభతో అక్కడ కూడా టాపర్‌గా నిలిచాడు ఓ మెకానిక్ కొడుకు. ఆ వివరాలు.. అలీఘర్కు చెందిన ఓ మోటార్ మెకానిక్ కొడుకు మహ్మద్ షాదాబ్ చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుకుగా ఉండేవాడు. ఈ క్రమంలో గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ‘కెన్నడి లూగర్ యూత్ ఎక్స్చేంజ్ స్కాలర్షిప్’కు ఎంపికయ్యాడు. దీని ద్వారా షాదాబ్‌కు రూ. 20లక్షలు వచ్చాయి. దాంతో హై స్కూల్ చదువుల నిమిత్తం షాదాబ్ అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో ఈ ఏడాది అక్కడి హై స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. అంతేకాక దాదాపు 800 వందల మంది చదువుతున్న ఈ అమెరికన్ హై స్కూల్లో గత నెల షాదాబ్ ‘స్టూడెంట్ ఆఫ్ ది మంత్’గా నిలిచాడు. ఈ క్రమంలో షాదాబ్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా గొప్ప విజయం. అమెరికన్ స్కాలర్‌షిప్‌తో ఇక్కడ చదువుకోడానికి వచ్చిన నేను టాపర్‌గా నిలిచాను. అయితే దీని కోసం ఎంతో శ్రమించాను. ఇంటి దగ్గర పరిస్థితి ఏం బాగుండేది కాదు. నేను నా కుటుంబానికి మద్దతుగా నిలవాలనుకుంటున్నాను. వారిని గర్వపడేలా చేస్తాను’ అని తెలిపాడు. అంతేకాక విదేశాల్లో భారత జెండా ఎగరవేసే అవకాశం తనకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.(చాలా సార్లు విన్నా: మేరీ ట్రంప్) షాదాబ్ తండ్రి గత 25 సంవత్సరాలుగా మోటార్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. కొడుకు గురించి అతడు ఎంతో గర్వపడుతున్నాడు. తన కొడుకు కలెక్టర్ అయ్యి దేశానికి సేవ చేయాలని ఆశిస్తున్నాడు. కానీ షాదాబ్ మాత్రం ఐక్యరాజ్యసమితిలో మానవహక్కుల అధికారిగా పని చేయాలని ఉందని తెలిపాడు. -
విద్యార్ధులకు భారీ నజరానా
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఐదేళ్లలో మైనారిటీ వర్గాలకు చెందిన ఐదు కోట్ల మంది విద్యార్ధులకు స్కాలర్షిప్లు అందచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ప్రీ మెట్రిక్, మెట్రిక్ అనంతర, వృత్తి, సాంకేతిక విద్యను అభ్యసించే మైనారిటీ విద్యార్ధులకు ప్రభుత్వం స్కాలర్షిప్లను అందిస్తుందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వెల్లడించారు. మైనారిటీ విద్యార్ధినీ, విద్యార్ధుల్లో సామాజికార్ధిక, విద్యా సాధికారత కోసం పలు స్కాలర్షిప్లను ప్రభుత్వం వారికి అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధినులకు పది లక్షల బేగం హజరత్ మహల్ బాలికా స్కాలర్షిప్లను ఇస్తామని తెలిపారు. సమ్మిళిత వృద్ధిని సాధించే క్రమంలో మైనారిటీ విద్యార్దినీ విద్యార్ధులకు భారీస్ధాయిలో ఉపకార వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. -
అమ్మాయి చదువుకు సమస్య పరిష్కారం
పార్వతీపురం: ‘అమ్మాయి చదువుకు ఆన్లైన్ కష్టాలు’ శీర్షికన సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కథనం ప్రచురితమైన 24గంటలు గడవక ముందే సంబంధిత అధికారులు స్పందించారు. ఈ నెల 25న తనకు రేషన్‌కార్డు ఆన్లైన్ సమస్య వుందని, ఈ కారణంగా తనకు స్కాలర్షిప్ మంజూరు కాలేదని, ఐటీడీఏ పీఓ డా.జి.లక్ష్మీశకు కురుపాం మండలం ఈతమానుగూడకు చెందిన పాలక మౌళిక విన్నవించుకుంది. తన సమస్యను పరిష్కరించాలని వేడుకుంది. లేకుంటే తన చదువు నిలిచిపోతుందని ప్రాధేయపడింది. ఇదే విషయాన్ని సాక్షి ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన కురుపాం తహసీల్దార్ సూర్యకళ వెనువెంటనే ఆన్లైన్ సమస్యను పరిష్కరించారు. అప్పటి వరకు ఆన్లైన్లో కేవలం మౌళికకు చెందిన వివరాలు మాత్రమే నమోదై ఉన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ సమస్య పరిష్కరించిన తరువాత కుటుంబ సభ్యుల అందరి వివరాలు ఆన్లైన్లో నమోదయ్యాయి. ఈ విషయాన్ని విద్యార్ధిని మౌళికకు సాక్షి ప్రతినిధి ఫోన్ ద్వారా సమాచారం అందించగా ఆమె సాక్షికి ధన్యవాదాలు తెలియజేసింది. సాక్షి ప్రయత్నం ద్వారా నా సమస్య పరిష్కారం కావడంతో పాటు చదువుకు ఆటంకం తొలగినందుకు రుణ పడి వుంటానని పేర్కొంది. అమ్మాయి చదువుకు ఆన్లైన్ కష్టాలు -
ఆవోపా ఉపకార వేతనాల పంపిణీ
హుజూర్నగర్ : పట్టణంలోని వాసవీ భవన్లో ఆదివారం ఆవోపా ఆధ్వర్యంలో ఆర్యవైశ్య విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యలో రాణిస్తున్న పలువురు విద్యార్థులకు ప్రోత్సహకాలు, నోటుపుస్తకాలు, పెన్నులు, డ్రస్‌లతో పాటు నిరుపేద ఆర్యవైశ్య మహిళలకు పింఛన్లను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంది స్వరాజ్యబాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆవోపా పట్టణ అధ్యక్షుడు వంగవీటి హనుమంతరావు, తహసీల్దార్ శ్రీదేవి, రాష్ట్ర ఆవోపా ఉపాధ్యక్షులు సామా నారాయణ, నాగేశ్వరరావు, కృష్ణమూర్తి, బూర్లె లక్ష్మీనారాయణ, గుండా భద్రయ్య, గెల్లి అప్పారావు, రామ్మోహన్రావు, ప్రభాకర్‌రావు, శ్రీనివాసరావు, ఆనంద్, మల్లికార్జున్‌రావు, పి.శ్రీనివాస్, కె.రామారావు, పి.వెంకటేశ్వర్లు, వి.న రేష్ పాల్గొన్నారు.