
డల్లాస్: తానా ఫౌండేషన్, డల్లాస్ ఆధ్వర్యంలో తెలుగు విద్యార్ధులకు స్కాలర్ షిప్‌లు అందించారు. గత పదిహేనేళ్లుగా తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తానా ఫౌండేషన చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ మాట్లాడుతూ.. తానా చేపడుతున్న అనేక కార్యక్రమాల వల్ల సమాజంలో ఎంతో మందికి లబ్ధి కలుగుతుందన్నారు.
సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తానాలాంటి స్వచ్చందసంస్థకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన దాతలు కార్యకర్తలకు తానాఫౌండేషన్ బృందం ధన్యవాదాలు తెలిపింది. రాబోయే కాలంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తానా ఫౌండేషన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment