minority educational institutions
-
సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో మైనారిటీ విద్యా సంస్థలకు తీవ్ర అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, వారి విద్యా సంస్థలకు మైనారిటీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి పేద విద్యార్థులను ఆదుకుంటామన్నారు. సోమ వారం ఫెడరేషన్ ఆఫ్ మైనారిటీ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజాం క్లబ్ మైనారిటీ ప్రొఫెషనల్ స్కూల్స్, కాలేజీస్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉత్తమ్‌కు విద్యా సంస్థల ప్రతినిధులు తమ డిమాండ్లను విన్నవించారు. కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీ విద్యా సంస్థలకు మైనారిటీ హోదా ఇవ్వకుండా వేధిస్తోందని, తమ డిమాండ్లను కాంగ్రెస్ పరిష్కరిస్తే అండగా ఉంటామని చెప్పారు. మైనారిటీ విద్యా సంస్థలను అధ్వానం చేశారని, దాదాపు 85 శాతం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూతబడ్డాయని చెప్పారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. మైనారిటీ విద్యా సంస్థల్లో 70 శాతం మైనారిటీలు, 30 శాతం నాన్ మైనారిటీలు ఉండటంతో చాలా కాలేజీల్లో విద్యార్థుల్లేక నష్టపోతున్నారన్నారు. మైనారిటీలు లేని విద్యా సంస్థల్లో నాన్ మైనా రిటీలను చేర్చుకునేలా అవకాశం కల్పిస్తామన్నారు. ఎన్నికల ముందు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న టీఆర్ఎస్.. కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా జోషి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ముషీరాబాద్‌కు చెందిన జాయ్ జోషిని నియమిస్తూ మైనారిటీ విభాగం చైర్మన్ ఫక్రుద్దీన్ సోమవారం నియమాక పత్రం విడుదల చేశారు. రాబోయే ఎన్నికల్లో మైనారిటీలు కాంగ్రెస్‌కు అండగా ఉండి గెలిపించాలని కోరారు. మాకూ సీట్లివ్వండి: ఆర్య వైశ్య మహాసభ రాష్ట్రంలో 7 శాతం (28.60 లక్షలు) ఉన్న ఆర్య వైశ్యులకు తగినన్ని సీట్లు కేటాయించాలని ఆర్య వైశ్య మహాసభ ప్రతినిధులు ఉత్తమ్, భట్టి విక్రమార్కలను కోరారు. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి కాలువ సుజాత ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్య వైశ్య మహాసభ నేతలు మల్లికార్జున్ ఉత్తమ్, భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. తాండూరు, మెదక్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో తమకు ఎక్కువ బలం ఉన్నందున ఆ స్థానాలు కేటాయించాలని కోరారు. రూ. 1,000 కోట్లతో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. -
ప్రవేశాలివ్వనప్పుడు కాలేజీలెందుకు?
- మైనారిటీ విద్యా సంస్థలనుద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: మైనారిటీ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వలేనప్పుడు కాలేజీలు మూసివేసుకోవడం మంచిదని మైనారిటీ విద్యా సంస్థలను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానిం చింది. మైనారిటీల కోసమంటూ ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది కాలేజీలు ఏర్పాటు చేస్తున్న మైనారిటీ విద్యాసంస్థలు చివరకు మైనారిటీయేతరులతో సీట్లు భర్తీ చేస్తుండటం తమకు విస్మయం కలిగిస్తోందని హైకోర్టు తెలి పింది. ఇలా చేయడం మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేయడమేనని స్పష్టం చేసింది. ఈ కేసులో ఎంబీఏ కన్వీనర్ వాదనలు విన్న తరువాతనే ఉత్తర్వులిస్తామంటూ కన్వీనర్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక చీఫ్ జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరానికి తమకు ఎంబీఏ కోర్సుకు జేఎన్టీయూ, హైదరాబాద్ అనుమతిని ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ ఖాదర్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించింది. -
అర్హులకే ఆర్టీఈ
= సర్కార్ యోచన.. = తప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో సీట్లు అక్రమార్కుల పాలు = ఇక ప్రవేశానికి బీపీఎల్ కార్డుతో లింక్ = సీఎంతో చర్చించి తుది నిర్ణయం: మంత్రి కిమ్మనె రత్నాకర్ సాక్షి, బెంగళూరు : విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేటు పాఠశాలల్లో చేరదలచిన విద్యార్థుల కుటుంబాలకు విధిగా బీపీఎల్ కార్డు ఉండాలన్న షరతు విధించాలని యోచిస్తున్నట్లు పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తెలిపారు. ఇక్కడి కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో కొందరు తమ పిల్లలకు ఆర్టీఈ కింద సీటు సంపాదిస్తుండటం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీనిని నివారించడానికి, నిజమైన పేదలకు న్యాయం జరగడానికి బీపీఎల్ కార్డు నిబంధన విధించాలనుకుంటున్నామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీఈ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇతర విద్యార్థుల ఫీజులు పెంచినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై చర్యలు చేపడతామన్నారు. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, మైనారిటీ విద్యా సంస్థలు ఆర్టీఈ కింద విధిగా 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలన్నారు. అలా కేటాయించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి జూన్ 1నే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారం, సైకిళ్లను అందజేస్తామన్నారు. దీనిపై వాయిదాలు ఉండబోవని ఆయన భరోసా ఇచ్చారు.