తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం | CM KCR Inaugurated 9 Medical Colleges | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం

Published Fri, Sep 15 2023 12:27 PM | Last Updated on Fri, Sep 15 2023 5:14 PM

CM KCR Inaugurated 9 Medical Colleges  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఈ రోజు మరుపురానిదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారని అన్నారు. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, భూపాలపల్లి, కుమరంభీమ్, సిరిసిల్ల,నిర్మల్, వికారాబాద్, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ కలను సాధిస్తున్నామని అన్నారు. 

బోధన కాలేజీలే కాకుండా అనుబంధ ఆస్పత్రులను కూడా నెలకొల్పినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో 50 వేల పడకల్ని ఆక్సిజన్ బెడ్‌లుగా తయారు చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 500 టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణను ఎగతాళి చేసినవాళ్లకు ఇదో మంచి ఉదాహరణ అని అన్నారు. దేశంలో వైద్య రంగంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో మరణాల రేటు కూడా తగ్గించామని చెప్పారు.  

 కొత్తగా ప్రారంభించిన వాటితో  కలిపి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య నాలుగు రెట్లకు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 21కి చేరింది. కొత్త కాలేజీలతో కలిపి తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య 8,515కు పెరిగింది.

ఇదీ చదవండి: తెలంగాణలో ప్రారంభమైన టెట్‌ పరీక్ష

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement