inaugurated
-
నెల్లూరులో సందడి చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (ఫోటోలు)
-
లులు మాల్లో ఫ్లవర్ ఫెస్టివల్ ప్రారంభించిన బిగ్ బాస్ దివి (ఫోటోలు)
-
కాకినాడలో పెన్సిలిన్–జీ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెన్సిలిన్–జి ఉత్పత్తి కోసం కాకినాడలో నెలకొల్పిన ప్లాంటును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించినట్లు ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మాలో భాగమైన లిఫియస్ ఫార్మా వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది.ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద రూ. 2,500 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులతో ఈ ప్లాంటు ఏర్పాటైంది. ఈ ప్లాంటు వార్షికోత్పత్తి సామర్ధ్యం 15,000 మెట్రిక్ టన్నులుగా (ఎంటీ) ఉంటుందని సంస్థ డైరెక్టర్ ఎంవీ రామకృష్ణ తెలిపారు.భారత్‌ను ఫార్మా తయారీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో స్వయంసమృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో కంపెనీ తన వంతు తోడ్పాటును అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నాంది పడింది. -
యాక్టర్ ఆలీ చేతులమీదగా అతియాస్ కిచెన్ గొప్ప ప్రారంభం (ఫొటోలు)
-
Kolkata: అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని
కలకత్తా: దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు లైన్‌ను పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలో బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త లైన్‌పై రైలుకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మెట్రో రైలులో మోదీ ప్రయాణించారు. ప్రయాణంలో భాగంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. రైలు బయట స్టేషన్లలో వేచిచూస్తున్న వారికి కిటికీల్లో నుంచి అభివాదం చేశారు. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi welcomed by a huge crowd gathered at Esplanade metro station, in Kolkata PM Modi inaugurated India's first underwater metro rail service, a short while ago. pic.twitter.com/5rMfUWHQ0f — ANI (@ANI) March 6, 2024 అండర్ వాటర్ మెట్రోతో పాటు పాటు మొత్తం రూ.15 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కలకత్తాలోని హౌరామైదాన్-ఎస్ప్లాండే సెక్షన్‌లోని 4.8కిలోమీటర్ల మెట్రో ఈస్ట్ వెస్ట్ కారిడార్‌లో హూగ్లీ నదిపై అండర్‌వాటర్ మెట్రోను నిర్మించారు. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi interacts with school students as they travel in India's first underwater metro train, in Kolkata. pic.twitter.com/lQye0OnuqP — ANI (@ANI) March 6, 2024 భూమికి 30 మీటర్ల దిగువన మెట్రో రైల్ స్టేషన్ ఉంటుంది. ఈ కారిడార్ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఐటీ హబ్ సాల్ట్ లేక్ సెక్టార్‌తో అనుసంధానిస్తుంది. బుధవారం ఈ కారిడార్‌ను ప్రధాని అధికారికంగా ప్రారంభించినప్పటికీ ప్రయాణికులకు కొద్దిరోజుల తర్వాత అండర్ వాటర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. అండర్ వాటర్ మెట్రో ప్రారంభోత్సవంలో మోదీ వెంట బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్, అసెంబ్లీలో ప్రతిపక్షనేత సువేందు అధికారి తదితరులు పాల్గొన్నారు. ఐదురోజుల్లో పశ్చిమబెంగాల్లో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇదీ చదవండి.. ప్రధాని పర్యటన వేళ.. బీజేపీపై ‘దీదీ’ ఫైర్ -
మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్(ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు భారతి ప్రవీణ్ పవార్, ప్రహ్లాద్ జోషి, మంత్రి విడదల రజని, ఎంపీ జీవీఎల్ నరసింహరావు పాల్గొన్నారు. రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌తో పాటు రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభించారు. అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌లో భాగంగా రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిలో ప్రధానంగా వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో రూ.23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్ కేర్ బ్లాకుల్ని నిర్మించనున్నారు. మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌తో పాటు రాజ్‌కోట్ (గుజరాత్), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్), బఠిండా (పంజాబ్), కల్యాణి (పశ్చిమబెంగాల్) నగరాల్లో ఎయిమ్స్ ఆస్పత్రులను కూడా ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఇదీ చదవండి: అసలు ముద్రగడ, పవన్ మధ్య ఏం జరిగింది? -
Mumbai Trans Harbour Link: పొడవైన సముద్రవంతెన.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం!
ముంబయి: భారత్‌లోనే అతిపొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జనవరి 12)న ప్రారంభించనున్నారు. భారత్‌లోనే అతిపెద్ద సముద్ర వంతెన రవాణా వినియోగానికి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై రాకపోకలకు పలు ఆంక్షలు విధించారు. వంతెనపై గరిష్ఠ వేగం గంటకు 100కిలోమీటర్ల దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. మోటార్‌బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలుకు అనుమతిని నిరాకరించారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికిల్స్, మిని బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వంతెన ఎక్కేప్పుడు, దిగేప్పుడు వాహనాల వేగం 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు. రూ. 18,000 కోట్ల వ్యయంతో నిర్మించిన అటల్ బ్రిడ్జ్.. ముంబైలోని సెవ్రీ నుండి ప్రారంభం అవుతుంది. రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్ తాలూకాలోని న్హవా షెవాలో ముగుస్తుంది. అటల్ వంతెన అనేది 6-లేన్ సముద్రం లింక్. ఇది సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.5 కి.మీ. ఉంటుంది. ఈ వంతెనతో వాహనదారులు ముంబయి, నవీ ముంబయి మధ్య దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో అధిగమించగలరు. ఈ వంతెన లేకపోతే 2 గంటల సమయం పడుతుంది. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
సబ్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
గ్లోబల్ టూరిజం హబ్‌గా భారత్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే కంటైనర్ టెర్మినల్ విస్తరణ ఫేజ్–2ను జాతికి అంకితం చేశారు. ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్–2023కు ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ టూరిజం హబ్‌గా భారతదేశం ఎదిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, చెన్నైలో మోడ్రన్ క్రూయిజ్ హబ్‌లు తీసుకువచ్చామన్నారు. ముంబైలో కూడా త్వరలో ఇంటర్నేషనల్ క్రూయిజ్ హబ్ రాబోతోందని తెలిపారు. అలాగే రూ.655 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టు చేపట్టిన ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6, 7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.633 కోట్లతో పూర్తి చేసిన విశాఖ కంటైనర్ టెర్మినల్ రెండో విడత విస్తరణ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి పోర్టు ట్రస్ట్ చీఫ్ ఇంజనీరింగ్ విభాగం సలహాదారు వేణు ప్రసాద్, వీసీటీపీఎల్ ప్రతినిధి కెప్టెన్ జాలీ, జేఎం.బక్షి, బోత్రా తదితరులు పాల్గొన్నారు. పలు సంస్థలతో ఒప్పందాలు గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో విశాఖ పోర్టు పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్‌కుమార్ దూబే.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఎం.కె.వాతోర్, నేవీ అడ్మిరల్ నెల్సన్ డిసౌజా, ట్రయాన్ సంస్థ తరఫున రజనీష్ మహాజన్ ఈ ఎంవోయూలపై సంతకాలు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఉన్న 4 లేన్ల రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం పోర్టు రూ.501 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే ఔటర్ హార్బర్లో పలు అభివృద్ధి పనులు చేసేందుకు భారత నౌకాదళంతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రయాన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా.. విశాఖ పోర్టు సాలగ్రామపురంలోని భూమిని ట్రయాన్ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనుంది. ఈ ఒప్పందం విలువ రూ.900 కోట్లు. ఒప్పందంలో భాగంగా కన్వెన్షన్ సెంటర్లు, ఐటీ టవర్లు నిర్మించనున్నారు. కాగా, గ్లోబల్ మారిటైం సమ్మిట్‌లో విశాఖ పోర్టు ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంది. విశాఖ పోర్టు అథారిటీ ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన స్టేట్ సెషన్లో పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
-
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం
-
తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ రోజు మరుపురానిదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఒకే రోజు 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారని అన్నారు. ప్రగతి భవన్ వేదికగా ఆన్లైన్లో ఈ కార్యక్రమం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, భూపాలపల్లి, కుమరంభీమ్, సిరిసిల్ల,నిర్మల్, వికారాబాద్, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ కలను సాధిస్తున్నామని అన్నారు. బోధన కాలేజీలే కాకుండా అనుబంధ ఆస్పత్రులను కూడా నెలకొల్పినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో 50 వేల పడకల్ని ఆక్సిజన్ బెడ్లుగా తయారు చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 500 టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణను ఎగతాళి చేసినవాళ్లకు ఇదో మంచి ఉదాహరణ అని అన్నారు. దేశంలో వైద్య రంగంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో మరణాల రేటు కూడా తగ్గించామని చెప్పారు. కొత్తగా ప్రారంభించిన వాటితో కలిపి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య నాలుగు రెట్లకు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 21కి చేరింది. కొత్త కాలేజీలతో కలిపి తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య 8,515కు పెరిగింది. ఇదీ చదవండి: తెలంగాణలో ప్రారంభమైన టెట్ పరీక్ష -
హైదరాబాద్: అట్టహాసంగా అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ (ఫొటోలు)
-
ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ
సాక్షి, తూర్పుగోదావరి: గత ఏడాది వ్యవధిలో 77 వేల కేసులు తగ్గించామని, రాష్ట్రంలో పోలీసు శాఖపై ప్రజలకు విశ్వసనీయత పెరిగిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన రాజమండ్రిలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మహిళా పోలీసులతో చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ‘‘శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల పని అని, ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతామని డీజీపీ ప్రశ్నించారు. నిర్దేశించిన ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాలని సూచించాం. ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామన్నారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: ఏపీ సర్కార్‌పై ఐరాస శాశ్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ బృందం ప్రశంసలు -
సెలూన్ ఓపెనింగ్‌లో నమ్రత సందడి (ఫోటోలు)
-
నాగోల్ లో ఫ్లైఓవర్ ప్రారంభించిన కేటీఆర్
-
‘ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి’ ప్రారంభం
వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధుల సాయంతో ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్’, ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్’ కాంప్లెక్స్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్‌కు వ్యవసాయ శాస్త్రవేత్త ‘డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అనెక్సి’ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రప్రభుత్వ సాయంతో విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ సదుపాయాల్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని రైతాంగం వ్యవసాయాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. -
గోద్రెజ్ ఇంటీరియో స్టోర్‌ను ప్రారంభించిన హీరో కార్తికేయ
-
వికేంద్రీకరణతో సత్వర న్యాయం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల వికేంద్రీకరణతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. న్యాయవాదులు, కక్షిదారులు దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. గురువారం హై కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కలసి 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టులను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం సీజేఐ మాట్లాడారు. తగ్గనున్న కేసుల భారం ‘జిల్లా కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో సత్వర న్యాయం అందించలేని పరిస్థితి. జిల్లా కోర్టుల విభనజతో భారం తగ్గి త్వరగా న్యాయం అందే అవకాశం లభించింది. కొత్త కోర్టుల ఏర్పాటుకు తగినట్లు న్యాయమూర్తులు, సిబ్బంది నియామకానికి సీఎం ఆమోదించడం శుభ పరిణామం. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు, హైకోర్టులో సిబ్బంది పెంపు ఇలా న్యాయవ్యవస్థ పటిష్టతలో దేశానికి తెలంగాణ తలమానికంగా నిలిచింది. హైదరాబాద్‌లో వాణిజ్య కోర్టుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఐటీకి పేరుగాంచింది. కోర్టుల్లోనూ ఐటీ సేవలను వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు. వారికి నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు న్యాయం అందించడం మన బాధ్యత ’అని సీజేఐ వివరించారు. త్వరలో మరో ఇద్దరు న్యాయమూర్తులు ‘సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి న్యాయవ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్నా. న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకు, అవగాహన పెంచేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి కొంతవరకు సఫలీకృతం అయ్యా. ప్రజలు ఆస్పత్రికి, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినట్లు న్యాయస్థానాలను ఆశ్రయించేలా తీర్చిదిద్దాం. 111 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించా. 194 హైకోర్టు ఖాళీలకు సిఫారసు చేయగా, కేంద్రం 152కు ఆమోదం తెలిపింది. వీరిలో 33 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాం. అలాగే ఇప్పటివరకు 19 మంది న్యాయమూర్తులను నియమించాం. మరో ఇద్దరిని త్వరలో నియమించనున్నాం. ఇందులో సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం..’అని తెలిపారు. ప్రజా సమస్యలకు పరిష్కారం: సీఎం ‘గతంలో తెలంగాణ హైకోర్టు ప్రారంభానికి ఇక్కడికి వచ్చా. మళ్లీ ఇప్పుడు 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టుల ప్రారంభం సందర్భంగా రావడం ఆనందదాయకం. తలసరి ఆదాయం, ఐటీ, జీఎస్డీపీ, వ్యవసాయం, పరిశ్రమలు సహా అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమనంలో దూసుకుపోతోంది. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని సీజేఐని కోరాం. ఆయన చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి వెంటనే నియామకం చేపట్టారు. ఇది హైకోర్టు పటిష్టతకు దోహదం చేసింది. 32 జ్యుడీషియల్ జిల్లా కోర్టుల ఏర్పాటుతో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలకు స్వతంత్ర కోర్టులు రానున్నాయి. ఉమ్మడి జిల్లాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నా స్వస్థలం మెదక్ జిల్లా సిద్దిపేట. మా దగ్గరి నుంచి సంగారెడ్డి కోర్టుకు వెళ్లాలంటే 150 కి.మీ.లు పోవాలి. ఎన్నో పాట్లు పడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా 33 జిల్లాలుగా విభజించాం. ములుగు, భూపాలపల్లి చిన్న ప్రాంతాలే అయినా జిల్లాలుగా ఏర్పాటు చేశాం. న్యాయస్థానాల వికేంద్రీకరణ, సత్వర న్యాయంతో ప్రజలకు చిక్కులు తొలగిపోతాయి..’అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చదవండి: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు పరిధి దాటితే ఉపేక్షించం.. ‘న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే న్యాయమూర్తుల నియామకంతో పాటు ఇతర వసతులు ఉండాలి. దీనిపై ఏప్రిల్‌లో జరిగిన సీఎం, హైకోర్టు సీజేల భేటీలో అందరూ ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. అయితే కొంత అవగాహన లోపంతో జాతీయ న్యాయ వ్యవస్థ నిర్మాణం జరగడం లేదు. ఈ సమావేశంలో అందరి ఏకాభిప్రాయంతో దీనిపై తీర్మానం చేయాలని భావించినా సాధ్యంకాలేదు. ఇది కార్యరూపం దాలిస్తే రాష్ట్రాలకు మంచి జరిగేది. న్యాయవ్యవస్థ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేది కాదు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తోంది. ఇటీవలి కాలంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేయడం తేలికైపోయింది. కోర్టు తీర్పులకు, ప్రభుత్వ ఆదేశాలకు వక్రభాష్యం చెప్పడం పరిపాటిగా మారింది. ఇది దురదృష్టకరం. పరిధి దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే. పరిధి దాటితే ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యం. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది..’అని సీజేఐ చెప్పారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: హైకోర్టు సీజే ‘కొత్త జ్యుడీషియల్ కోర్టుల ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. న్యాయ వ్యవస్థ మరింత బలపడుతుంది’అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.లలిత, జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ సుమలత, ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్, కా ర్యదర్శులు కల్యాణ్‌రావు, సుజన్‌కుమా ర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ జిల్లాలో ఇండోర్ స్టేడియం ప్రారంభం
-
ఏపీ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శం
-
బ్లాక్‌క్యాట్ ర్యాలీని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
-
మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. గన్నవరంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన మత్స్య సహకార నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. గుజరాత్లో డ్రగ్స్ కేసుల్ని ఏపీకి అంటగట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. (చదవండి: ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు: సీఎం జగన్) దసరాకు 4వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని మంత్రి వెల్లడించారు. అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్ బస్సులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం త్వరలో ప్రత్యేక వాట్సాప్ నెంబర్ అందుటులోకి తీసుకువస్తామన్నారు. ఆన్ లైన్ టిక్కెట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టామని మంత్రి పేర్ని నాని తెలిపారు. చదవండి: దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు -
తిరుపతిలో అగరబత్తీల కేంద్రాన్ని ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల కేంద్రం సోమవారం ప్రారంభమైంది. ఈ కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, ఏఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఆలయాల్లో వాడిన పూలతో అగరబత్తీలు తయారీని ప్రారంభించామని తెలిపారు. ఎలాంటి లాభాపేక్షలేకుండా దర్శన్ సంస్థ వీటిని తయారు చేస్తోందన్నారు. తిరుపతి, తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ‘‘ఏడు రకాల అగరబత్తీలను భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. ఎలాంటి కెమికల్స్ లేకుండా పరిమళభరితంగా తయారు చేస్తున్నారు. వాడిన పూలతో బొమ్మల తయారీని కూడా ప్రారంభించాం. సప్తగిరి మాసపత్రికను కూడా తిరిగి అందుబాటులోకి తెచ్చాం. రంగుల పేజీలతో శ్రీవారి సమాచారాన్ని అందిస్తున్నామని’’ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవారి ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను టీటీడీ తయారీ చేపట్టింది. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, స్పష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అగరబత్తులను టీటీడీ విడుదల చేసింది. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో అగరబత్తీల విక్రయానికి టీటీడీ నిర్ణయించింది. -
వైద్య రంగానికి సీఎం జగన్ పెద్దపీట: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.1600 కోట్లతో శిథిలావస్థలోఉన్న ఆసుపత్రులను పునర్ నిర్మిస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదమా లాంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవీ చదవండి: వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల బిగ్‌బాస్-13 విన్నర్, చిన్నారి పెళ్లి కూతురు ఫేం సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం -
కర్నూలులో హెచ్ఆర్సీ కార్యాలయం ప్రారంభం
సాక్షి, కర్నూలు: కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హ్యూమన్ రైట్స్ కమిషన్ – హెచ్ఆర్సీ) కార్యాలయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులకు సీతారామ్మూర్తి ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా వుండటం వల్ల కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్‌లో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఇవీ చదవండి: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కదిలించిన ‘సాక్షి’ కథనాలు కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్.. -
ఆర్టీసీ డిపో, ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్
-
ఆర్టీసీ డిపో, ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆస్పత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. అదే విధంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్టీసీ బస్ డిపోను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. కడప డిపోకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బస్‌స్టేషన్‌గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరులో ఆర్టీసీ డిపో ద్వారా ప్రజల కల సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఠాకూర్, ఆర్టీసీ ఈడీలు కృష్ణమోహన్, కోటేశ్వరరావుతో పాటు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుంగనూరు నుంచి ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, పలువురు ఎమ్మెల్యేలు, కడప నుంచి డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్యెల్యేలు, కడప మేయర్ సురేష్‌బాబు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దేవుడు నాకిచ్చిన అదృష్టం: సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ‘‘ఈ రోజు ఆర్టీసీ ఆధ్వర్యంలో పుంగనూరులో బస్సు డిపోను ప్రారంభించడం, అదే మాదిరిగా కడపలో డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి, ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖతో పాటు, ఆర్టీసీ కూడా ఆస్పత్రిని ప్రారంభించి, సేవలు అందించడం అభినందనీయం. ఈ ఆస్పత్రి వల్ల సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. వీటిపై ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇది దేవుడు నాకిచ్చిన అదృష్టం. మీకు ఇంకా మంచి చేయాలని, ఆ అవకాశం దేవుడు నాకివ్వాలని కోరుకుంటున్నానని’’ సీఎం జగన్ అన్నారు.. సంస్థ కు ప్రాణం పోశారు: మంత్రి పేర్ని నాని ‘‘గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సు డిపోలు మూతబడే పరిస్థితి తీసుకువచ్చి, దాన్ని ప్రైవేటుపరం చేసే ప్రయత్నం జరిగింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. 50 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల రూ.3600 కోట్ల భారం ఏటా పడుతున్నా, ప్రభుత్వం వెనుకంజ వేయలేదు. అంత గొప్ప మనసున్న వ్యక్తి సీఎం జగన్. కడపలో 20 పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభం. మరో వైపు పుంగనూరు డిపోను ఇవాళ ప్రారంభించారు. కార్మికుల కోసం ఇంతగా ఆలోచిస్తున్న ఇలాంటి సీఎం మనకు ఉండటం ఎంతో అదృష్టమని’’ మంత్రి పేర్ని నాని అన్నారు. పుంగనూరు ప్రజలకు వరం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ‘సీఎం వైఎస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ ఇవాళ నిలబెట్టుకుంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పుంగనూరు డిపోను ప్రారంభించారు. పుంగనూరు ప్రజలకు ఇది ఎంతో వరం. ఆ పట్టణం 40 ఏళ్లుగా మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు డిపో లేదు. కానీ అది ఇవాళ అది సాకారం అయ్యింది. మహానేత వైఎస్సార్ హయాంలో పనులు మొదలు పెట్టినా, ఆ తర్వాత కాలంలో అవి ముందుకు సాగలేదు. మళ్లీ ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ దాన్ని పూర్తి చేశారని’’ పెద్దిరెడ్డి పేర్కొన్నారు కాగా, మొత్తం 7.5 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్తీర్ణంలో పుంగనూరు బస్సు డిపో నిర్మాణం చేశారు. 65 బస్సులతో డిపో ఏర్పాటు కాగా, ఆ డిపోను ఒక మోడల్ డిపోగానూ, అదే విధంగా డిపోలో మోడల్ వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు ఇక కడపలో ఆర్టీసికి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ వ్యయం రూ.3.8 కోట్లు కాగా, మరో రూ.2 కోట్లతో మెడికల్ ఎక్విప్మెంట్, ఇతర మౌలిక సదుపాయాల కల్పించారు. 1.6 ఎకరాలలో ఆస్పత్రి నిర్మాణం జరగ్గా, ఈ ఆస్పత్రిలో 7 గురు వైద్య నిపుణులు, 25 మంది పారా మెడికల్ సిబ్బందితో పాటు, హౌజ్ కీపింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో వివిధ విభాగాల వైద్య నిపుణులు కూడా ఉన్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు. దాదాపు 90 వేల మందికి కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి సేవలు అందించనుంది. దీంతో పాటు కడప ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బస్‌స్టేషన్‌గా పేరు మార్పు చేశారు. -
కామారెడ్డిలో నిధి అగర్వాల్ సందడి ఫొటోలు
-
ఇది ఆరంభం మాత్రమే
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ ఐటీరంగం విస్తరణలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతోంది. వరంగల్‌లో టెక్ మహీంద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇది ఆరంభం మాత్రమే. ఈ రెండు కంపెనీలు రావడంతోనే సంతృప్తి చెందట్లేదు. హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం వరంగల్. ఇంకా చాలా కంపెనీలు రావాలి. వేలాది మందికి ఉద్యోగాలు లభించాలి. వరంగల్‌కు తొలుత ఒక్క సైయంట్ కంపెనీ వచ్చింది. ఆ తర్వాత టెక్ మహీంద్రా వచ్చింది. ఒక దాని తర్వాత మరో కంపెనీ వస్తుంది. హైదరాబాద్, వరంగల్ కాదు.. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంతో పాటు దశల వారీగా అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తాం. దీంతో స్థానిక యువతకు ఉద్యోగాలు లభించాలన్నదే సీఎం కేసీఆర్ కల. ఈ కల సాకారం కానుంది’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని ఐటీ సెజ్‌లో ఏర్పాటు చేసిన టెక్ మహీం ద్రా, సైయంట్ ఐటీ ఇంక్యుబేషన్ సెంట ర్లను కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమ రంగంలో రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మడికొండలోని ఐటీ సెజ్‌లో టెక్ మహీంద్రా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సీఈఓ గురునాని, మంత్రి కేటీఆర్ పారిశ్రామిక కారిడార్.. ‘రెండేళ్ల కిందట ఆనంద్ మహీంద్రా, బీవీఆర్ మోహన్‌రెడ్డిని కలిసి వరంగల్‌లో కంపెనీ పెట్టాలని కోరాం. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వారు కంపెనీలు పెట్టారు. ఐటీ తెలం గాణ జిల్లాల కు విస్తరించడం వరంగల్ నుంచి ప్రారంభమైంది. టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీ ల ఏర్పాటు ద్వారా హైదరాబాద్ కాకుండా తెలంగాణ జిల్లాల్లో శ్రీకారం జరిగింది. ఈ కంపెనీల ద్వారా వరంగల్‌లో 10 వేల మందికి ఉపాధి కల్పించాలి’అని కేటీఆర్ కోరారు. హైదరాబాద్–వరంగల్ మార్గం పారిశ్రామిక కారిడార్‌గా మారబోతోందని స్పష్టం చేశారు. ఆలేరు, భువనగిరి, జనగామ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబాబాద్‌లో ఆహారశుద్ధి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐటీ, వ్యాపార, పరిశ్రమల వరంగల్ ప్రాంతాలను మరింత విస్తరించేందుకు మామునూరు ఎయిర్‌పోర్టును తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేస్తామన్నారు. జీఎంఆర్ సంస్థనే ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వివరించారు. ఈ దిశగా సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని, సానుకూలంగా స్పందించే అవకాశముందన్నారు. అప్పటి వరకు హెలీపోర్ట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. మరో హరిత విప్లవం.. రాష్ట్రంలో త్వరలోనే రెండో హరిత విప్లవం రాబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సాగు, తాగు నీటి విషయంలో సీఎం కేసీఆర్ విజన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు విప్లవాత్మకమైన మార్పులతో టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాలు యజ్ఞంలా కొనసాగుతున్నాయని, కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కాలంతో పోటీ పడి నిర్మించుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో 1.25 కోట్ల ఎకరాల భూమి సాగులోకి రానుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టామని, ఇప్పటికీ 12 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చామని, తద్వారా రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 13 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించామని వివరించారు. కొరియాకు చెందిన యంగ్టక్ కంపెనీ 8 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందని తెలిపారు. మరో 18 సంస్థలు టెక్స్టైల్స్ పార్కులో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్‌లు దాస్యం వినయ్‌భాస్కర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్ నాని, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్మార్టు సైకిళ్లను ప్రారంభించిన సీఎం
సాక్షి, అమరావతి : వెలగపూడి సచివాలయంలో తొలిసారి ప్రయోగాత్మకంగా జపాన్ నుంచి తెప్పించిన స్మార్టు సైకిళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. నేటి నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా స్మార్ట్ సైకిళ్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. సచివాలయం ఆవరణలో రెండు, వెలుపల వాహనాల పార్కింగ్ వద్ద మరో స్టేషన్ ఏర్పాటు చేసి ప్రతి స్టేషన్లో పది సైకిళ్ల చొప్పున అందుబాటులో ఉంచారు. సైకిల్ తీసుకునే వారికి ప్రత్యేకంగా స్వైపింగ్ కార్డు, పాస్వర్డ్ ఇస్తారు. సచివాలయానికి వచ్చిన వారు వీటిని ఉచితంగా పొంది పని ముగించుకున్న తర్వాత మూడు స్టేషన్లలో ఎక్కడైనా అప్పజెప్పి వెళ్లొచ్చు. -
అమరీందర్ ప్రమాణం పంజాబ్ కేబినెట్లోకి సిద్ధూ
-
అమరీందర్ ప్రమాణం పంజాబ్ కేబినెట్లోకి సిద్ధూ
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ 26వ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అమరీందర్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులతో గవర్నర్ వీపీ సింగ్ బద్నూర్ ప్రమాణం చేయించారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూకు ఉపముఖ్యమంత్రి పదవి లభించనుందంటూ వచ్చిన ఊహాగానాలకు తెరదించుతూ.. సిద్దూ కూడా మంత్రిగానే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు హాజరయ్యారు. గరిష్టంగా 18 మందిని మంత్రులుగా నియమిం చుకునే అవకాశముండగా, ప్రస్తుతం 9 మందినే తీసుకున్నారు. పంజాబ్ సీఎంగా అమరీందర్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. సిద్ధూకు స్థానిక ప్రభుత్వ వ్యవహారాల శాఖతో పాటు పర్యాటక, సాంస్కృతిక శాఖలను అప్పగించారు. మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ మేనల్లుడు మన్‌ప్రీత్ సింగ్‌కు ఆర్థిక శాఖ, సీనియర్ నేత బ్రహ్మ్ మొహీంద్రకు ఆరోగ్య శాఖ కట్టబెట్టారు. హోం, విజిలెన్స్, న్యాయ, సాధారణ పరిపాలన శాఖలను అమరీందర్ తన వద్దే ఉంచుకున్నారు. -
అంబేద్కర్ వర్శిటీ కొత్త క్యాంపస్ ప్రారంభం!
న్యూఢిల్లీః దేశరాజధాని నగరంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ను విద్యాశాఖ మంత్రి సిసోడియా ప్రారంభించారు. రాష్ట్ర నిధులతో ప్రారంభమైన యూనివర్శిటీగా 2008లో 1800 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. 2020 నాటికి మరో రెండు క్యాంపస్ లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఢిల్లీనగరంలోని కశ్మీర్ గేట్ ప్రాంతంలో నెలకొన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 40 అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్స్ ప్రోగ్రామ్ లను అందిస్తోంది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో 2.5 లక్షల మంది విద్యార్థులు పన్నెండో తరగతి పూర్తి చేస్తే, వారిలో సగానికి పైగా విద్యార్థులు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని వివిధ కళాశాలలకు ఉన్నత విద్యకు వెళుతున్నారని కరంపుర ప్రాంతంలో క్యాంపస్ ప్రారంభోత్సవ సందర్భంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. విద్యార్థుల్లో చాలామంది డ్రాపవుట్స్ గా మారడం, ఢిల్లీనుంచి ఇతర ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్ళడం, లేదా ప్రైవేట్ కళాశాలల్లో భారీ మొత్తంలో ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందడం చేస్తున్నారని, అటువంటివారికి సదుపాయం కల్పించాలన్న ఆలోచనలోనే 2020 నాటికి రోహిణి, ధీర్ పురేర్ ప్రాంతాల్లో మరో రెండు క్యాంపస్ లు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సిసోడియా తెలిపారు. విద్యాశాఖా మంత్రిగా కూడా ఉన్న సిసోడియా.. మరింతమంది విద్యార్థులకు స్థానం కల్పించడంతోపాటు.. విద్యా ప్రమాణాలను పెంచడానికి వారికి కావలసిన బోధనా సిబ్బంది, విద్యాలయాధికారులను సైతం నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొత్తం 26 లక్షల మంది విద్యార్థుల్లో.. ప్రభుత్వ పాఠశాలల్లోని 16 లక్షల మందితోపాటు.. మొత్తం 2.5 లక్షలమంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులై బయటకు వస్తున్నారని, ప్రతి సంవత్సరం 10 నుంచి 100 వరకూ సీట్లు పెంచడం సరికాదని చెప్పారు. సీట్లను పెంచడంతోపాటు.. విద్యాప్రమాణాలను కూడా పెంచాలని మంత్రి నొక్కి వక్కాణించారు. అయితే ఇటీవల ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా కొత్తగా నిర్మించిన కళాశాల భవనాలను ప్రారంభించిన సందర్భంలో.. అరవింద్ కేజ్రీవాల్ మోదీని విమర్శిస్తూ ట్వీట్లు కూడా చేసిన సంతగి తెలిసిందే. -
'నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు కృషి'
-
నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు కృషి : కేటీఆర్
హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో జపనీస్ పార్కును వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేదుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వరంలో రూ. 71 లక్షల వ్యయంతో జపనీస్ పార్కును నిర్మాణం చేశారు. అలాగే కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. -
FNCCలో ఓ భవనానికి అబ్దుల్ కలాం పేరు
-
రైల్వే ఫ్లైఓవర్‌ని ప్రారంభించిన వెంకయ్యనాయుడు
నెల్లూరు: దేశంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆదివారం నెల్లూరు జిల్లా మనుబోలులో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, శిద్ధా రాఘవరావుతోపాటు జెడ్పీ ఛైర్మన్ రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారతి ట్రస్ట్‌లో కిసాన్ సమ్మేళనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడు రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. -
'గోదావరి పుష్కరాలతో పుణ్యం, పురుషార్థం'
-
వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన పొంగులేటి
ఖమ్మం: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో మిని వాటర్ ఫ్లాంట్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆదివారం నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అంగన్వాడీ కేంద్రానికి నిధులు కేటాయిస్తామని పొంగులేటి చెప్పారు. పాఠశాల భవనం మరమ్మత్తు, చర్చికి చుట్టుగొడ ఏర్పాటు కోసం నిధులు కేటాయిస్తామని హామినిచ్చారు. -
జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన హీరోయిన్
-
హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్
-
హైటెక్స్‌లో ఫుడ్‌బజార్ ప్రారంభం
-
87.3 అడుగుల ఆంజనేయ విగ్రహం ప్రతిష్ట
గుంటూరు (ఎడ్లపాడు) : 87.3 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుంటూరు జిల్లా ఎడ్లపాడులో ఆదివారం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విశాఖ శారద పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వివాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం దేవస్థానం గోపురానికి పగుళ్లు ఏర్పడినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతోనే దేశానికి ఇబ్బందులు ఎదురువుతున్నాయన్నారు. అలాగే దేవాదాయ శాఖ చారిత్రక దేవాలయాలను పరిరక్షించడంలో విఫలమైందని ఆరోపించారు. బెజవాడ దుర్గగుడిలో ఇటీవల వెలుగు చూసిన కుంభకోణం విషయంలో ఈవోపై చర్య తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని జయేంద్ర విమర్శించారు. -
భీమవరంలో సందడి చేసిన కాజల్
ఏలూరు: ప్రముఖ టాలీవుడ్ నటి కాజల్ ఆదివారం భీమవరం పట్టణంలో సందడి చేశారు. పట్టణంలో ప్రముఖ నగల షాపు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం శాఖను ఆమె ప్రారంభించారు. కాజల్‌ను చూసేందుకు ఆమె అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం పరిసర ప్రాంతాలు కాజల్ అభిమానులతో కిక్కిరిసి పోయాయి. కాజల్ వస్తున్న సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దాంతో భీమవరం పట్టణంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. -
విజయవాడలో సందడి చేసిన సచిన్, అనుష్క
విజయవాడ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, హీరోయిన్ అనుష్క శుక్రవారం విజయవాడ నగరంలో సందడి చేశారు. నగరంలోని పీవీపీ మాల్‌ను వారిద్దరు ప్రారంభించారు. సచిన్, అనుష్కలను చూసేందుకు వారి అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో పీవీపీ మాల్ పరిసర ప్రాంతాలు సచిన్, అనుష్క అభిమానులతో కిక్కిరిసి పోయాయి. ఈ సందర్బంగా సోదరిసోదరీమణులారా అంటూ విజయవాడ ప్రజలను సచిన్ తెలుగులో పలకరించారు. సచిన్ వస్తున్న సందర్బంగా ట్రాఫిక్ పోలీసులు నగరంలో ఏటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో విజయవాడలోని బందరు రోడ్డు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ తీవ్ర అటంకం ఏర్పడింది. -
మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న కేసీఆర్
టీఆర్ఎస్ ఎంపీలు కూడా... హైదరాబాద్: భారత దేశ ప్రధాన మంత్రిగా ఈ నెల 26న నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని కేసీఆర్‌ను మోడీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఆ పార్టీ ఇతర సీనియర్ నాయకులు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నెల 26న ఉదయం ఢిల్లీ వెళ్లి ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిశాక వెంటనే తిరుగు ప్రయాణమై సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో కేసీఆర్ జాతీయ నాయకులను కలవనున్నారు -
14 నుంచి డబుల్ డెక్కర్ రైలు
నేటి నుంచి రిజర్వేషన్ సౌకర్యం తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్ : రాయలసీమవాసులు హైదరాబాద్ వెళ్లడానికి అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ రైలు 14వ తేదీ నుంచి రాకపోకలు సాగించనుంది. అందుకోసం దక్షిణమధ్య రైల్వే అధికారులు అన్ని చర్యలు పూర్తిచేశారు. ప్రస్తుతం ఉన్న రైల్వేట్రాక్, ప్లాట్‌ఫాం ర్యాక్ పరిస్థితిని డబుల్ డెక్కర్ రైల్‌కు అనుగుణంగా అధికారులు ఇటీవలే మార్పు చేశారు. అనంతరం ఈ రైలును కాచిగూడ నుంచి తిరుపతి వరకు ట్రయల్న్ ్రచేశారు. పూర్తిస్థాయి ట్రాక్ అనుకూలం కావడంతో న్యూ ఢిల్లీలోని రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 14న కాచిగూడలో ప్రారంభించనున్నారు. ఈ రైలు గంటకు 160 కి.మీ వేగంతో నడిచే సామర్థ్యం ఉన్నప్పటికీ కాచిగూడ నుంచి తిరుపతికి నడిచే మార్గంలో రైల్వే ట్రాక్ పరిస్థితి, ఈ ప్రాంత భూపరిస్థితులను బట్టి గంటకు 100 కి.మీలకు మించి పోయే అవకాశం ఉండదని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. కాగా ఈ రైలు ఈనెల 14వ తేదీ ఉదయం 6.45 గంటలకు కాచిగూడలో బయలుదేరి మధ్యాహ్నం తర్వాత తిరుపతికి చేరుకుంటుంది. అనంతరం 15వ తేదీ ఉదయం 5.45 గంటలకు తిరుపతిలో బయలుదేరి కాచిగూడ వెళుతుంది. ఈ రైలు ప్రతి బుధ, శని వారాల్లో కాచిగూడలోనూ, ప్రతి గురు, ఆదివారాల్లో తిరుపతిలోనూ బయలుదేరే విధంగా రైల్వే అధికారులు చార్ట్‌ను నిర్ణయించారు. ఈ రైలులో ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు శుక్రవారం(నేడు) ఉద యం 8.00 గంటల నుంచి రిజర్వేషన్లు అం దుబాటులోకి వస్తాయి. అయితే డబుల్ డెక్కర్ పూర్తిగా ఏసీ రైలు కావడంతో తిరుపతి నుంచి కాచిగూడకు రూ.700 చార్జీగా అధికారులు నిర్ణయించారు.