ముంబయి: భారత్‌లోనే అతిపొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జనవరి 12)న ప్రారంభించనున్నారు. భారత్‌లోనే అతిపెద్ద సముద్ర వంతెన రవాణా వినియోగానికి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై రాకపోకలకు పలు ఆంక్షలు విధించారు.
వంతెనపై గరిష్ఠ వేగం గంటకు 100కిలోమీటర్ల దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. మోటార్‌బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలుకు అనుమతిని నిరాకరించారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికిల్స్, మిని బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వంతెన ఎక్కేప్పుడు, దిగేప్పుడు వాహనాల వేగం 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు.
రూ. 18,000 కోట్ల వ్యయంతో నిర్మించిన అటల్ బ్రిడ్జ్.. ముంబైలోని సెవ్రీ నుండి ప్రారంభం అవుతుంది. రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్ తాలూకాలోని న్హవా షెవాలో ముగుస్తుంది. అటల్ వంతెన అనేది 6-లేన్ సముద్రం లింక్. ఇది సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.5 కి.మీ. ఉంటుంది. ఈ వంతెనతో వాహనదారులు ముంబయి, నవీ ముంబయి మధ్య దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో అధిగమించగలరు. ఈ వంతెన లేకపోతే 2 గంటల సమయం పడుతుంది.
ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక
Comments
Please login to add a commentAdd a comment