Longest Bridge
-
Mumbai Trans Harbour Link: పొడవైన సముద్రవంతెన.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం!
ముంబయి: భారత్‌లోనే అతిపొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జనవరి 12)న ప్రారంభించనున్నారు. భారత్‌లోనే అతిపెద్ద సముద్ర వంతెన రవాణా వినియోగానికి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై రాకపోకలకు పలు ఆంక్షలు విధించారు. వంతెనపై గరిష్ఠ వేగం గంటకు 100కిలోమీటర్ల దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. మోటార్‌బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలుకు అనుమతిని నిరాకరించారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికిల్స్, మిని బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వంతెన ఎక్కేప్పుడు, దిగేప్పుడు వాహనాల వేగం 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు. రూ. 18,000 కోట్ల వ్యయంతో నిర్మించిన అటల్ బ్రిడ్జ్.. ముంబైలోని సెవ్రీ నుండి ప్రారంభం అవుతుంది. రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్ తాలూకాలోని న్హవా షెవాలో ముగుస్తుంది. అటల్ వంతెన అనేది 6-లేన్ సముద్రం లింక్. ఇది సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.5 కి.మీ. ఉంటుంది. ఈ వంతెనతో వాహనదారులు ముంబయి, నవీ ముంబయి మధ్య దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో అధిగమించగలరు. ఈ వంతెన లేకపోతే 2 గంటల సమయం పడుతుంది. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
ఈ తీగల బ్రిడ్జ్.. ఎంతపొడుగో!
ఈ తీగల బ్రిడ్జి చూశారా ఎంత పెద్దగా ఉందో..! ప్రపంచంలోనే అతి పొడవైన పెడెస్ట్రెయిన్ సస్పెన్షన్ బ్రిడ్జి ఇది. పోర్చుగల్‌లో నిర్మించిన దీనిని ఇటీవల ప్రారంభించారు. 1700 అడుగుల పొడవు ఉండే ఈ బ్రిడ్జిని కేవలం నడవడానికి మాత్రమే నిర్మించారు. పూర్తిగా ఇనుప తీగలనే బ్రిడ్జి నిర్మాణానికి వినియోగించారు. దీని నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2.8 మిలియన్ల డాలర్లు ఖర్చయింది. అరౌకా జియో పార్క్ ప్రాంతంలో నిర్మించినందువల్ల దీనిని 516 అరౌకా అని పిలుస్తున్నారు. రెండు కొండల మధ్య వేగంగా ప్రవహించే పైవా నది ఉపరితలానికి 575 అడుగుల ఎత్తులో బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జిపై ఈ చివరినుంచి ఆ చివరకు నడవడానికి కనీసం పది నిమిషాలు పడుతోందని స్థానికులు చెబుతున్నారు. నడిచేటప్పుడు కిందకి చూస్తే భయం వేస్తోందని, దీనిపై నడవడానికి గుండె ధైర్యం ఉండాలని వారు అంటున్నారు. -
మరో అద్భుత ఆవిష్కరణ ప్రారంభం
-
అత్యంత పొడవైన బ్రిడ్జ్ ప్రారంభించనున్న పీఎం
దిబ్రుగడ్: భారత్‌లో అత్యంత పొడవైన బ్రిడ్జ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మే 26న ప్రారంభించనున్నారు. సుమారు 9.15 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జిని బ్రహ్మపుత్ర నదిపై అస్సాంలో నిర్మించారు. ఇది ముంబైలోని బాంద్రా-వొర్ల ఉన్న బ్రిడ్జికంటే 3.55 కిలో మీటర్లు పెద్దది. 60 యుద్ధ ట్యాంకులు ఒకే సారి దీనిపై ప్రయాణించవచ్చు. దీనిద్వారా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మద్య రవాణా సులభతరం అవుతుంది. ఈ బ్రిడ్జ్ వాడుకలోకి వస్తే రెండు రాష్ట్రాల మధ్య నాలుగు గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. దీని నిర్మాణం 2011లో సుమారు రూ.950 కోట్లతో ప్రారంభమైంది. ఇది చైనా సరిహద్దుకు 100 కిలో మీటర్లు, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 540 కిలోమీటర్లు, అస్సాం రాజధాని దిస్సూర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి 2015లోనే ప్రారంభమవ్వాల్సి ఉన్నా పనుల కారణంగా ఆలస్యమైంది.