ఈ తీగల బ్రిడ్జి చూశారా ఎంత పెద్దగా ఉందో..! ప్రపంచంలోనే అతి పొడవైన పెడెస్ట్రెయిన్ సస్పెన్షన్ బ్రిడ్జి ఇది. పోర్చుగల్‌లో నిర్మించిన దీనిని ఇటీవల ప్రారంభించారు. 1700 అడుగుల పొడవు ఉండే ఈ బ్రిడ్జిని కేవలం నడవడానికి మాత్రమే నిర్మించారు. పూర్తిగా ఇనుప తీగలనే బ్రిడ్జి నిర్మాణానికి వినియోగించారు. దీని నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2.8 మిలియన్ల డాలర్లు ఖర్చయింది.
అరౌకా జియో పార్క్ ప్రాంతంలో నిర్మించినందువల్ల దీనిని 516 అరౌకా అని పిలుస్తున్నారు. రెండు కొండల మధ్య వేగంగా ప్రవహించే పైవా నది ఉపరితలానికి 575 అడుగుల ఎత్తులో బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జిపై ఈ చివరినుంచి ఆ చివరకు నడవడానికి కనీసం పది నిమిషాలు పడుతోందని స్థానికులు చెబుతున్నారు. నడిచేటప్పుడు కిందకి చూస్తే భయం వేస్తోందని, దీనిపై నడవడానికి గుండె ధైర్యం ఉండాలని వారు అంటున్నారు.
ఈ తీగల బ్రిడ్జ్.. ఎంతపొడుగో!
Published Sun, May 2 2021 12:13 PM | Last Updated on Sun, May 2 2021 12:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment