rope way
-
Hyderabad: నగరంలో క్రేజ్‌గా మారిన జిప్‌లైన్
ఎగిరే.. ఎగిరే.. చూపే ఎగిరెనే చీకటి ఎరగని దారిలో.. పాదం ఎగిరెనే భయమే తెలియని బాటలో.. ప్రాయం ఎగిరెనే పరిచయమవ్వని త్రోవలో.. ఫ్లై హై.. ఇన్ ది స్కై.. కలలే అలలై పైకెగిరే.. పలుకే స్వరమై పైకెగిరే.. ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా.. పాట చాలా మందికి తెలిసిందే.. ఈ తరహా వినోదాన్వేషణలో భాగంగా సాహసకృత్యాలు నగర యువతకు నిత్యకృత్యాలయ్యాయి. పబ్బులు, క్లబ్బుల్లో ఒళ్లు మరచిపోయే వీకెండ్ రొటీన్‌కు భిన్నంగా ఒళ్లు గగుర్పొడిచే సాహసాలకు వారు ఓటేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు నగరంలో అత్యధికులను ఆకర్షిస్తోంది జిప్‌లైన్.. ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పాపులారిటీ ఉన్న ఈ సాహస క్రీడ నగర యువతకు క్రేజ్‌గా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పలు అడ్వెంచరస్ క్లబ్స్ అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం తమ థ్రిల్లింగ్ అవుట్డోర్ యాక్టివిటీలకు జిప్‌లైన్‌ను జత చేస్తున్నాయి. గగనాన పయనాన...అనిపించేలా చేస్తుంది ఈ సాహసక్రీడ జిప్‌లైన్. రోప్‌వే తరహాలో ఒక నిరీ్ణత దూరానికి ఒక కేబుల్ ఆధారంగా గాల్లో వేలాడుతూ ప్రయాణించే ఈ జిప్‌లైన్ దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ క్రీడను ఒకప్పుడు నగరవాసులు విభిన్న టూర్ల సందర్భంగా మాత్రమే ఎంజాయ్ చేసేవారు. అయితే పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నగరంలోని అడ్వెంచర్ యాక్టివిటీ సెంటర్లలో కూడా అందుబాటులోకి తెచ్చారు. దాదాపు రూ.500 మొదలుకుని రూ.1000లోపు రుసుముతో ఈ క్రీడను ఆనందించడానికి అవకాశం ఇస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంజాయ్ అంటే... ⇒ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్ జిప్లైనింగ్కి ఒక మంచి ప్లేస్. అంతేకాక విభిన్న రకాల అడ్వెంచర్ కార్యకలాపాలతో ఒక రోజంతా సరదాగా గడపడానికి కూడా. ఇక్కడ జిప్‌లైన్ ఎత్తులో థ్రిల్లింగ్ రైడ్‌ను అందిస్తుంది. ⇒ లియోనియా రిసార్ట్స్ సమీపంలో ఉన్న డి్రస్టిక్ట్ గ్రావిటీ సిటీలో మరొక సాహసాల కేంద్రం. ఇదొక అతిపెద్ద అడ్వెంచర్ పార్కు. ఇది విభిన్న రకాల థ్రిల్లింగ్ యాక్టివిటీస్ అందిస్తుంది. కింద పచ్చని పచ్చిక పైన 60 అడుగుల ఎత్తుతో 500 మీటర్ల జిప్‌లైన్ సెట్‌తో ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ కనీస బరువు 35 కిలోలుగా నిర్ణయించారు. కాబట్టి ఇది చిన్న పిల్లలకు తగినది కాదు. ⇒ ఖైరతాబాద్‌లోని పిట్ స్టాప్ అడ్వెంచర్ పార్క్ ఆటలకు ప్రసిద్ధి. ఇది పిల్లలు, పెద్దలు ఇద్దరికీ సరిపోయే జిప్‌లైన్‌ను అందిస్తుంది. ⇒ శంకర్‌పల్లిలోని వైల్డ్ వాటర్స్ థీమ్ పార్క్ కూడా జిప్లైనింగ్ను అందిస్తుంది. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఇది పనిచేస్తుంది. ⇒ వికారాబాద్‌లో ఉన్న అనంత అడ్వెంచర్ క్లబ్ 24–గంటల అడ్వెంచర్ హబ్. జిప్‌లైన్‌తో సహా సాహసికుల కోసంæ వివిధ కార్యకలాపాలను అందిస్తుంది. ⇒ జూబ్లీ హిల్స్‌లో పచ్చని ప్రకృతి అందాల మధ్య ఉన్న ఫ్రీకౌట్స్ అడ్వెంచర్ జోన్‌లోనూ జిప్ లైన్ ఉంది. ]జాగ్రత్తలు ⇒ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా యాక్టివిటీ ఉందా లేదా చూసుకోవాలి. ⇒ ఎంత కాలంగా జిప్‌లైన్ నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ⇒ ఇవి పూర్తి సురక్షితంగా ఉన్నప్పటికీ.. అందరికీ నప్పవు.. కాబట్టి ముందస్తుగా తమ ఆరోగ్యంపై కూడా అవగాహన అవసరమైతే వైద్య సలహా కూడా తీసుకోవాలి. -
67 ఏళ్ల వయసులో అదరగొట్టిన బామ్మ.. శారీతో రోప్ సైక్లింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!
-
శ్రీకాకుళం.. ఆకట్టుకునేలా పర్యాటక రంగం
ఆర్థిక చోదక శక్తుల్లో పర్యాటక రంగం ఒకటి. ప్రపంచంలో చాలా దేశాలు కేవలం టూరిజం పరిశ్రమపైనే ఆధారపడి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మన దేశం, రాష్ట్రంలో పర్యాటక రంగం కొంత పురోగతి సాధిస్తున్నా.. ప్రకృతి అందాలకు నెలవైన చాలా ప్రాంతాలు ఇప్పటికీ గుర్తింపునకు, అభివృద్ధికి నోచుకోవడం లేదు. వాటిలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. అతి పొడవైన సముద్ర తీరం, కోనసీమ లాంటి ఉద్దానం, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలు తదితర ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా.. పర్యాటకంగా వాటిని తీర్చిదిద్దే కృషి ఇప్పుడిప్పుడే మొదలైంది. టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఓవైపు సాగర తీరం.. మరోవైపు మన్యం.. మధ్యలో కొండలు తదితర ఆహ్లాదకర అందాలతో జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోతోంది. ఏటా ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రభుత్వం జిల్లా లోని టూరిస్ట్ స్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కొత్త పర్యాటక ప్రదేశాలను గుర్తించడమే కాకుండా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. ఆధ్మాత్మిక ప్రదేశాలను సైతం అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఉన్న చారిత్రక ప్రదేశాలకు కొత్త హంగులద్ది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అభివృద్ధి పథంలో... ► ఇప్పటికే శాలిహుండాన్ని పర్యాటక సౌకర్యాల కేంద్రంగా రూ.2.27 కోట్లతో అభివృద్ధి చేశారు. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ► పాతపట్నం నీలమణి అమ్మవారి ఆలయాన్ని రూ. 50లక్షలతో అభివృద్ధి చేశారు. ► తాజాగా శ్రీముఖలింగం క్షేత్రాన్ని ప్రసాదం స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.56 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ► శ్రీకూర్మం క్షేత్రాన్ని రూ.20 కోట్లతో, అరసవిల్లి క్షేత్రాన్ని రూ.30కోట్లతో ప్రసాదం స్కీమ్‌లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. అరసవిల్లిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమాచారం కేంద్రం, పర్యాటకుల సౌకర్యాల కేంద్రం ఏర్పాటుకు ఏడు సెంట్లు భూమిని దేవదాయ శాఖ ఇప్పటికే కేటాయించింది. దీనిలో 32 గదులు కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నారు. రోప్‌వే ద్వారా అందాలు.. రోప్ వేలతో జిల్లా అందాలను తిలకించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో తొమ్మిది రోప్‌వే మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. వీటిలో నాలుగింటి కోసం రూ.119.34 కోట్లతో అంచనా నివేదిక ఇప్పటికే కేంద్రానికి వెళ్లింది. రెండో విడతలో మిగతా ఐదింటికి ప్రతిపాదనలు పంపించనుంది. ► శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా నుంచి పొన్నాడ కొండ వరకు రూ. 32.40 కోట్లతో, శాలిహుండం బుద్ధు ని కొండ నుంచి వేణుగోపాలస్వామి ఆలయం వరకు రూ.25.56 కోట్లతో, పలాసలో నెమలికొండ వద్ద రూ. 22.68 కోట్లతో, ఇచ్ఛాపురంలో రూ.17.64 కోట్లతో రోప్‌వే వేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇవన్నీ మంజూరైతే జిల్లా పర్యాటకంగా మరింత ప్రగతి సాధించనుంది. పర్యాటక ప్రదేశాలెన్నో... ► జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవ లేదు. అరసవల్లి, శ్రీకూర్మం, శాలిహుండం, శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లికార్జునస్వామి తదితర ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ► తేలుకుంచి, బారువ, తేలినీలాపురం, దంతపురి, పొందూరు, కొరసవాడ, మందస, గొట్టా బ్యారేజీ, శాలిహుండం, పొన్నాడ కొండ తదితర చారిత్రక ప్రదేశాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ► తేలినీలాపురం, తేలుకుంచి గ్రామాలు విదేశీ పక్షుల విడిది కేంద్రంగా ఆకట్టుకుంటున్నాయి. ► రాష్ట్రంలో అత్యంత పొడవైన తీరరేఖ జిల్లాలోనే ఉంది. 193 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో పర్యాటకులు విహరించడానికి అనువైన ప్రదేశాలెన్నో. కళింగపట్నం, బారువ, శివసాగర్, గనగళ్లవానిపేట, మొగదలపాడు వంటి బీచ్‌లు టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రదేశాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిమగ్నమైంది. శాలిహుండం, బారువ బీచ్‌ను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తోంది. శివసాగరం, గనగలవానిపేట, కళింగపట్నం బీచ్‌లను కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది. -
‘రోప్‌వే’ బాధితుల తరలింపు పూర్తి
దేవ్‌గఢ్: జార్ఖండ్‌లోని దేవగఢ్‌లో ఆదివారం సాయంత్రం సంభవించిన రోప్‌వే ప్రమాదంలో చిక్కుకుపోయిన పర్యాటకుల తరలింపు పూర్తయింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి మొత్తం 60 మందిని బయటకు తీసుకువచ్చామని అదనపు డీజీపీ ఆర్కే మాలిక్ వెల్లడించారు. సుమారు 46 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆది, సోమవారాల్లో కొందరిని సురక్షితంగా తీసుకురాగా మరో 15 మంది కేబుల్ కార్లలోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. దట్టమైన అడవి, కొండప్రాంతం కావడంతో రాత్రి వేళ అధికారులు సహాయక చర్యలను నిలిపివేశారు. అధికారులు వారికి డ్రోన్ల ద్వారా నీరు, ఆహార సరఫరాలను కొనసాగించారు. మంగళవారం ఉదయం తిరిగి సహాయక చర్యలు ప్రారంభించి, రెండు హెలికాప్టర్ల ద్వారా 14 మందిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. తరలింపు సమయంలో హెలికాప్టర్ నుంచి శోభాదేవి(60) ప్రమాదవశాత్తు జారి పడి చనిపోవడంతో ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరిందని అదనపు డీజీపీ ఆర్కే మాలిక్ వెల్లడించారు. కేబుల్ కార్లు ఢీకొన్న సమయంలో ఒక మహిళ చనిపోగా, గాయపడిన మరో 12 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. -
దియోఘర్ రోప్‌వే ప్రమాదం: 40 గంటల తర్వాత..
Deoghar Ropeway Accident: జార్ఖండ్: దియోఘర్ రోప్‌వే ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు పూర్తైంది. గందరగోళం, సరైన రక్షణ చర్యలు లేకుండానే సహాయక చర్యలు చేపట్టారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. మంగళవారం మధ్యాహ్నాం రెండు గంటల ప్రాంతంలో ఆపరేషన్ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. త్రికూట్ రోప్‌వే ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు పూర్తైంది. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఎయిర్‌ఫోర్స్.. ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రజల్ని కాపాడడమే లక్ష్యంగా జరిగినప్పటికీ.. ప్రాణ నష్టం జరిగినందుకు చింతిస్తున్నట్లు హేమంత్ సోరెన్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని అని ప్రకటించారు. అయితే.. #Deoghar tragedy - one killed while rescue #DeogharRopewayAccident pic.twitter.com/j0i7RvRUyS — Amit Shukla (@amitshukla29) April 11, 2022 మంగళవారం నాటి రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయ్యాక మృతుల సంఖ్య మూడుకి పెరిగిందని సమాచారం. త్రికూట్ హిల్స్ ప్రమాదం నుంచి మొత్తం 43 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. ఇందులో 12 మందికి గాయాలు అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించింది జార్ఖండ్ హైకోర్టు. ఏప్రిల్ 26న ఈ కేసులో వాదనలు విననుంది. అయితే అంతకు ముందు.. దర్యాప్తు నివేదికను జార్ఖండ ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక మంగళవారం ఉదయం 5 గంటల నుంచే రెస్క్యూ సిబ్బంది చర్యల్లో పాల్గొన్నారు. ఇవాళ పది మందిని రక్షించినట్లు డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. దేశంలోనే 766 మీటర్ల పొడవైన అతిపెద్ద రోప్‌వే టూరిజంగా పేరున్న త్రికూట్ రోప్‌వేపై ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. The Indian Air Force @IAF_MCC continues rescue operations of stranded people at the #DeogharRopewayAccident site Operations re-commenced early in the morning today & progressing briskly @SpokespersonMoD @drajaykumar_ias @SWComd_IA @suryacommand @salute2soldier @adgpi @mygovindia pic.twitter.com/I8DguVV2IO — PRO Jaipur MoD (@PRODefRjsthn) April 12, 2022 శ్రీరామ నవమి రోజున ఆనందంగా గడిపేందుకు వచ్చిన పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. దేవ్‌గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో బాబా బైద్యనాథ్ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని త్రికూట పర్వతంపై వెళ్లేందుకు రోప్ వే ఎక్కుతుంటారు. ఆదివారం ఆ రోప్ వే ద్వారా నడిచే కేబుల్ కార్లు సాంకేతికలోపంతో ప్రమాదానికి గురయ్యాయి. కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. పలువురు గాయపడగా.. 12 క్యాబిన్లలో 50 మంది 19 గంటలకుపైగా చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. ఆదివారం ఈ ప్రమాదం జరగ్గా.. సుమారు 40 గంటలపాటు కేబుల్ కార్లలో చిక్కుకున్న వాళ్లను రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగింది. #DeogharRopewayAccident: A woman fell during the rescue operations after her rope broke. She was immediately rushed to the hospital for treatment where she was declared brought dead pic.twitter.com/WHtN6orOkM — Zee News English (@ZeeNewsEnglish) April 12, 2022 గాల్లోనే ప్రాణాలు గాల్లోనే.. ఇదిలా ఉండగా.. రెస్క్యూ ఆపరేషన్‌పై ప్రతికూల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా సహాయక చర్యలు మొదలుకాగా.. రెస్క్యూ ఆపరేషన్ సాగదీతగా కొనసాగడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. రాకేష్ నందన్ అనే మధ్యవయస్కుడు సేఫ్టీ బెల్ట్ తెగిపోయి లోయలో పడిపోవడంతో మరణించాడు. మరో మహిళ తాడు తెగి పడిపోవడంతో మరణించింది. రోప్ వే కార్లు అత్యంత ఎత్తులో ఉండడం, పైగా పొగమంచు కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. డ్రోన్ల సాయంతో ఆహారం, నీటిని సరఫరా చేశారు అధికారులు. అయినప్పటికీ విమర్శలు చల్లారడం లేదు. -
గాలిలో ప్రాణాలు
దేవగఢ్: జార్ఖండ్ రాష్ట్రం దేవగఢ్ జిల్లాలో ఆదివారం కేబుల్ కార్లు ఢీకొన్న ఘటనలో ఒక పర్యాటకురాలు మృతి చెందగా, 12 మంది గాయాలపాలయ్యారు. హెలికాప్టర్ ద్వారా తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఒకదాని వెంట మరొకటి వెళ్తున్న రెండు కేబుల్ కార్లలో మొదటిది కిందకు జారి వచ్చి వెనకున్న రెండో కేబుల్ కారును బలంగా ఢీకొట్టింది. దేవగఢ్ పట్టణంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన బాబా బైద్యనాథ్ ఆలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి రక్షణ చర్యలు నిలిచే సమయానికి కేబుల్ కార్లలోనే మరో 15 మంది ఉన్నారు. చుట్టూ దట్టమైన అడవి, కొండలు, గుట్టలు ఉండటంతో ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించి ఆదివారం రాత్రి 11 మందిని మాత్రమే కాపాడగలిగింది. మిగిలిన వారు రోప్‌వే కేబుల్ కార్లలోనే అంత ఎత్తులో రాత్రంతా ప్రాణాలరచేతపట్టుకుని గడపాల్సి వచ్చింది. వారికి అధికారులు డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందజేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్లతో సోమవారం తిరిగి సహాయక చర్యలను కొనసాగించారు. సాయంత్రం సమయానికి కేబుల్ కార్లలో చిక్కుబడిపోయిన 32 మంది పర్యాటకులను సురక్షితంగా తీసుకురాగలిగారు. కేబుల్ కార్లు ఢీకొనడంతో ఆదివారం తీవ్రంగా గాయపడి ఒక మహిళ చనిపోగా సహాయక చర్యల సమయంలో బెంగాల్‌కు చెందిన ఒక పర్యాటకుడు ప్రమాదవశాత్తు హెలికాప్టర్ నుంచి జారి పడి మృతి చెందారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కే మాలిక్ తెలిపారు. క్షతగాత్రులైన మరో 12 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. చీకటి పడటంతో సోమవారం రాత్రి సహాయక చర్యలు నిలిపివేశామన్నారు. మరో 15 మంది ఇంకా కేబుల్ కార్లలోనే ఉన్నారని చెప్పారు. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు మంగళవారం ఉదయమే తిరిగి ప్రయత్నాలు కొనసాగిస్తామని మాలిక్ పేర్కొన్నారు. రోప్‌వే వ్యవస్థలో తలెత్తిన లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని దేవగఢ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రి తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రమాదం చోటుచేసుకోగా ఆ వెంటనే రోప్‌వే నిర్వాహకులు అక్కడి నుంచి పరారైనట్లు బాధితులు తెలిపారు. ఎత్తైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా 1,100 అడుగుల ఎత్తు, 766 మీటర్ల పొడవైన ‘త్రికూట్ రోప్‌వే’కు దేశంలోనే పొడవైందిగా పేరుంది. 2019 డిసెంబర్లో కశ్మీర్‌లోని గుల్మార్గ్లో రోప్‌వే తెగి కేబుల్ కార్లలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు ముగ్గురు టూరిస్ట్ గైడ్లు ప్రాణాలు కోల్పోయారు. #WATCH | A recce was conducted by one of the helicopters in the morning and operations are underway in coordination with the district administration and NDR to rescue people from ropeway site near Trikut in Deoghar, Jharkhand pic.twitter.com/Mum5Tq73nq — ANI (@ANI) April 11, 2022 (చదవండి: మళ్లీ కరోనా కలకలం.. ఆఫ్‌లైన్ క్లాస్‌లు నిలిపివేత) -
‘రోప్మ్యాప్’తో పర్యాటకం పరుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకానికి ‘రోప్ మ్యాప్’ వేస్తూ ప్రభుత్వం సరికొత్త అందాలను తీసుకురానుంది. విదేశాల్లో ఎక్కువగా కనిపించే రోప్‌వేలను రాష్ట్రంలోని 25 ప్రముఖ విహార, ఆధ్యా త్మిక కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. తద్వారా పర్యాటక రంగం అభి వృద్ధిలో కొత్తపుంతలు తొక్కనుందని భావిస్తోంది. ఇప్పటికే రెండు రోప్‌వేలకు అనుమతి.. విజయవాడలోని ఇంద్రకీలాద్రి, కృష్ణానది మీదుగా తెలంగాణలోని ఈగలపెంట నుంచి శ్రీశైలానికి కొత్తగా రోప్ వేలను నిర్మించేందుకు ఇప్పటికే అనుమతులు లభించాయి. మరోవైపు గండికోటలో రోప్‌వే నిర్మాణ దశలో ఉంది. పర్వతమాల పథకంలో భాగంగా జాతీయ రహదారుల మౌలిక వసతుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఎల్ఎంఎల్) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వంతో రోప్‌వేల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి, ఎన్హెచ్ఎ ల్ఎంఎల్ మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం బిడ్డింగ్ నిర్వహించ నున్నారు. మిగిలిన ప్రతిపాదిత రోప్‌వేల నిర్మాణానానికి సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపాదనలు ఇలా.. గుంటూరు జిల్లా కోటప్పకొండ, విజయవాడలోని భవాని ద్వీపం–బెరంపార్క్, శ్రీకాళహస్తిలోని భరద్వాజతీర్థం, చిత్తూరు జిల్లాలో బోయకొండ గంగ మ్మ, సిద్ధేశ్వర స్వామి దేవాలయం–తలకోన జలపా తం, విశాఖ జిల్లాలోని గాలికొండ వ్యూ– అరకు కటికి జలపాతం, గంభీరం కొండ–గంభీరం డ్యామ్, లంబసింగి–అరకు కొండపైకి, తూర్పుగో దావరి జిల్లా అన్నవరం, కోరుకొండ ఆలయం– బౌద్ధస్థూపం, కొండపాదల నుంచి పైనగుడికి, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట జగతిపల్లి కొండ, హిరమండలం రిజర్వాయర్, శాలిహుండం, వైఎస్సార్ కడప జిల్లాలోని పెన్నానది మీదుగా పుష్పగి రిపట్నం – చెన్నకేశవ ఆలయం, అనంతపురం జిల్లాలోని పెనుకొండ, గుత్తి కోట, కర్నూలు జిల్లాఅహోబిలం, యాగంటి, మద్దలేటి స్వామి ఆలయం, విజయనగరం జిల్లా రామతీర్థం, తాటిపూడి, పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాంతాల్లో రోప్‌వేలు నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా రోప్‌వేలు.. రాష్ట్రానికి విదేశీయులను ఆకర్షించేంత పర్యాటక సౌందర్యం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 25 చోట్ల రోప్‌వేలు నిర్మించాలనే యోచనలో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలోనే ఇంద్రకీలాద్రి, శ్రీశైలం రోప్‌వే పనులు చేపట్టి వేగంగా పూర్తి చేస్తాం. – సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ (చదవండి: సరికొత్త శకం) -
ఈ తీగల బ్రిడ్జ్.. ఎంతపొడుగో!
ఈ తీగల బ్రిడ్జి చూశారా ఎంత పెద్దగా ఉందో..! ప్రపంచంలోనే అతి పొడవైన పెడెస్ట్రెయిన్ సస్పెన్షన్ బ్రిడ్జి ఇది. పోర్చుగల్‌లో నిర్మించిన దీనిని ఇటీవల ప్రారంభించారు. 1700 అడుగుల పొడవు ఉండే ఈ బ్రిడ్జిని కేవలం నడవడానికి మాత్రమే నిర్మించారు. పూర్తిగా ఇనుప తీగలనే బ్రిడ్జి నిర్మాణానికి వినియోగించారు. దీని నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2.8 మిలియన్ల డాలర్లు ఖర్చయింది. అరౌకా జియో పార్క్ ప్రాంతంలో నిర్మించినందువల్ల దీనిని 516 అరౌకా అని పిలుస్తున్నారు. రెండు కొండల మధ్య వేగంగా ప్రవహించే పైవా నది ఉపరితలానికి 575 అడుగుల ఎత్తులో బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జిపై ఈ చివరినుంచి ఆ చివరకు నడవడానికి కనీసం పది నిమిషాలు పడుతోందని స్థానికులు చెబుతున్నారు. నడిచేటప్పుడు కిందకి చూస్తే భయం వేస్తోందని, దీనిపై నడవడానికి గుండె ధైర్యం ఉండాలని వారు అంటున్నారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ
విజయనగరం, రాయగడ: ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తవలస ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రాయగడలో రోప్ వే బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి నాగావళి నదిలో పడి మృతి చెందాడు. రాయగడ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన 13మంది వ్యక్తులు రాయగడ మజ్జిగౌరి దర్శనానికి మంగళవారం వచ్చి మొక్కుబడులు తీర్చుకున్న పిదప రాయగడకు 4కిలోమీటర్ల దూరంలో గల చెక్కగుడ ప్రాంతంలో రోప్ వే బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు. ఈ ప్రాంతంలో పర్యాటకులు పర్యటించేందుకు వీలు లేదంటూ జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం నిషేధపు బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కొత్తవలసకు చెందిన 13మంది వ్యక్తులు రోప్ వే బ్రిడ్జిపైకి వెళ్లి నాగావళి నదిని ఆ ప్రాంతపు సౌందర్యాలను తిలకిస్తున్నారు. అయితే వారిలో టి.గంగరాజు అనే వ్యక్తి మొబైల్లో సెల్ఫీ తీసుకుంటూ అదుపు తప్పి 100మీటర్ల ఎత్తు నుంచి నాగావళి నదిలో పడిపోయాడు. మిగిలిన స్నేహితులు వేసిన కేకలకు చెక్కగుడ ప్రాంత ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. దీంతో తక్షణం అగ్నిమాసక సిబ్బంది, చెక్కగుడ ప్రజలు నాగావళి నదిలో వెతికినప్పటికీ లాభం లేకపోయింది. 3, 4గంటల తరువాత గంగరాజు మృతదేహం మర్రిగుడ గ్రామ ప్రాంతంలో లభించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గతంలో ఇదే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విభిన్న జిల్లాల వారు మృతి చెందినప్పటికీ, ప్రమాదకరమని తెలిసి కూడా సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. -
రోప్ వే కోసం స్థల పరిశీలన
భువనగిరి టౌన్ : భువనగిరి ఖిలా అభివృద్ధిలో భాగంగా ఖిలాపైకి రోప్‌వే ఏర్పాటు చేసేందుకు కోల్‌కతాకు చెందిన కంపెనీ ప్రతినిధులు రామకృష్ణ, మనోజ్‌లు స్వోరం స్థలాన్ని పరిశీలించారు. రోప్ వే కోసం బైపాస్ సమీపంలో ఉన్న 2.30 ఎకరాల భూమి పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఇక్కడి నుంచి ఖిలాపైకి రోప్ వే ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రోప్ వే కోసం వ్యయంతో పాటు, పూర్తి వివరాలను అధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వారి వెంట సోమ శేఖర్‌రెడ్డి ఉన్నారు. -
ఎనిమిది పర్యాటక ప్రదేశాల్లో రోప్‌వేలు
చిత్తూరు: రాష్ట్రంలో ఎనిమిది పర్యాటక ప్రదేశాల్లో రోప్‌వేలు ఏర్పాటు చేయనున్నామని పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ టి.నాగేశ్వరరావు వెల్లడించారు. బుధవారం చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌కు రోప్‌వే ఏర్పాట్లను ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... తొలిదశలో చిత్తూరు జిల్లాలోని హార్సిలీహిల్స్, కర్నూలు జిల్లాలోని అహోబిలం, అనంతపురం జిల్లాలోని పెనుగొండ, గుత్తి, కృష్ణా జిల్లాలోని కొండపల్ల్లి ఖిల్లా, తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం, గుంటూరు, కోటప్పకొండలో రోప్‌వేలను ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. హార్సిలీహిల్స్‌లో రోప్‌వే కోసం సర్వే చేసే బాధ్యతలను ఢిల్లీకి చెందిన కేపీఎంజీ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు.