సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకానికి ‘రోప్ మ్యాప్’ వేస్తూ ప్రభుత్వం సరికొత్త అందాలను తీసుకురానుంది. విదేశాల్లో ఎక్కువగా కనిపించే రోప్‌వేలను రాష్ట్రంలోని 25 ప్రముఖ విహార, ఆధ్యా త్మిక కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. తద్వారా పర్యాటక రంగం అభి వృద్ధిలో కొత్తపుంతలు తొక్కనుందని భావిస్తోంది.
ఇప్పటికే రెండు రోప్‌వేలకు అనుమతి..
విజయవాడలోని ఇంద్రకీలాద్రి, కృష్ణానది మీదుగా తెలంగాణలోని ఈగలపెంట నుంచి శ్రీశైలానికి కొత్తగా రోప్ వేలను నిర్మించేందుకు ఇప్పటికే అనుమతులు లభించాయి. మరోవైపు గండికోటలో రోప్‌వే నిర్మాణ దశలో ఉంది. పర్వతమాల పథకంలో భాగంగా జాతీయ రహదారుల మౌలిక వసతుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వంతో రోప్‌వేల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి, ఎన్‌హెచ్‌ఎ ల్‌ఎంఎల్ మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం బిడ్డింగ్ నిర్వహించ నున్నారు. మిగిలిన ప్రతిపాదిత రోప్‌వేల నిర్మాణానానికి సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతిపాదనలు ఇలా..
గుంటూరు జిల్లా కోటప్పకొండ, విజయవాడలోని భవాని ద్వీపం–బెరంపార్క్, శ్రీకాళహస్తిలోని భరద్వాజతీర్థం, చిత్తూరు జిల్లాలో బోయకొండ గంగ మ్మ, సిద్ధేశ్వర స్వామి దేవాలయం–తలకోన జలపా తం, విశాఖ జిల్లాలోని గాలికొండ వ్యూ– అరకు కటికి జలపాతం, గంభీరం కొండ–గంభీరం డ్యామ్, లంబసింగి–అరకు కొండపైకి, తూర్పుగో దావరి జిల్లా అన్నవరం, కోరుకొండ ఆలయం– బౌద్ధస్థూపం, కొండపాదల నుంచి పైనగుడికి, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట జగతిపల్లి కొండ, హిరమండలం రిజర్వాయర్, శాలిహుండం, వైఎస్సార్ కడప జిల్లాలోని పెన్నానది మీదుగా పుష్పగి రిపట్నం – చెన్నకేశవ ఆలయం, అనంతపురం జిల్లాలోని పెనుకొండ, గుత్తి కోట, కర్నూలు జిల్లాఅహోబిలం, యాగంటి, మద్దలేటి స్వామి ఆలయం, విజయనగరం జిల్లా రామతీర్థం, తాటిపూడి, పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాంతాల్లో రోప్‌వేలు నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి.
ప్రత్యేక ఆకర్షణగా రోప్‌వేలు..
రాష్ట్రానికి విదేశీయులను ఆకర్షించేంత పర్యాటక సౌందర్యం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 25 చోట్ల రోప్‌వేలు నిర్మించాలనే యోచనలో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలోనే ఇంద్రకీలాద్రి, శ్రీశైలం రోప్‌వే పనులు చేపట్టి వేగంగా పూర్తి చేస్తాం.
– సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ
(చదవండి: సరికొత్త శకం)
Comments
Please login to add a commentAdd a comment