ఎగిరే..పైకెగిరే..
నగరంలో క్రేజ్‌గా మారిన జిప్‌లైన్
అడ్వెంచర్లు చేసేవారికి అనుకూలంగా
గాలిలో రోప్‌పై సాహసకృత్యాలు
ఒళ్లు గుగుర్పొడిచే ఈవెంట్లు
ఎగిరే.. ఎగిరే.. చూపే ఎగిరెనే చీకటి ఎరగని దారిలో.. పాదం ఎగిరెనే భయమే తెలియని బాటలో.. ప్రాయం ఎగిరెనే పరిచయమవ్వని త్రోవలో.. ఫ్లై హై.. ఇన్ ది స్కై.. కలలే అలలై పైకెగిరే.. పలుకే స్వరమై పైకెగిరే.. ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా.. పాట చాలా మందికి తెలిసిందే.. ఈ తరహా వినోదాన్వేషణలో భాగంగా సాహసకృత్యాలు నగర యువతకు నిత్యకృత్యాలయ్యాయి. పబ్బులు, క్లబ్బుల్లో ఒళ్లు మరచిపోయే వీకెండ్ రొటీన్‌కు భిన్నంగా ఒళ్లు గగుర్పొడిచే సాహసాలకు వారు ఓటేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు నగరంలో అత్యధికులను ఆకర్షిస్తోంది జిప్‌లైన్.. ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పాపులారిటీ ఉన్న ఈ సాహస క్రీడ నగర యువతకు క్రేజ్‌గా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పలు అడ్వెంచరస్ క్లబ్స్ అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం తమ థ్రిల్లింగ్ అవుట్‌డోర్ యాక్టివిటీలకు జిప్‌లైన్‌ను జత చేస్తున్నాయి.
గగనాన పయనాన...అనిపించేలా చేస్తుంది ఈ సాహసక్రీడ జిప్‌లైన్. రోప్‌వే తరహాలో ఒక నిరీ్ణత దూరానికి ఒక కేబుల్ ఆధారంగా గాల్లో వేలాడుతూ ప్రయాణించే ఈ జిప్‌లైన్ దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ క్రీడను ఒకప్పుడు నగరవాసులు విభిన్న టూర్ల సందర్భంగా మాత్రమే ఎంజాయ్ చేసేవారు. అయితే పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నగరంలోని అడ్వెంచర్ యాక్టివిటీ సెంటర్లలో కూడా అందుబాటులోకి తెచ్చారు. దాదాపు రూ.500 మొదలుకుని రూ.1000లోపు రుసుముతో ఈ క్రీడను ఆనందించడానికి అవకాశం ఇస్తున్నారు.
ఎక్కడెక్కడ ఎంజాయ్ అంటే...
⇒ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్ జిప్‌లైనింగ్‌కి ఒక మంచి ప్లేస్. అంతేకాక విభిన్న రకాల అడ్వెంచర్ కార్యకలాపాలతో ఒక రోజంతా సరదాగా గడపడానికి కూడా. ఇక్కడ జిప్‌లైన్ ఎత్తులో థ్రిల్లింగ్ రైడ్‌ను అందిస్తుంది.
⇒ లియోనియా రిసార్ట్స్ సమీపంలో ఉన్న డి్రస్టిక్ట్ గ్రావిటీ సిటీలో మరొక సాహసాల కేంద్రం. ఇదొక అతిపెద్ద అడ్వెంచర్ పార్కు. ఇది విభిన్న రకాల థ్రిల్లింగ్ యాక్టివిటీస్ అందిస్తుంది. కింద పచ్చని పచ్చిక పైన 60 అడుగుల ఎత్తుతో 500 మీటర్ల జిప్‌లైన్ సెట్‌తో ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ కనీస బరువు 35 కిలోలుగా నిర్ణయించారు. కాబట్టి ఇది చిన్న పిల్లలకు తగినది కాదు.
⇒ ఖైరతాబాద్‌లోని పిట్ స్టాప్ అడ్వెంచర్ పార్క్ ఆటలకు ప్రసిద్ధి. ఇది పిల్లలు, పెద్దలు ఇద్దరికీ సరిపోయే జిప్‌లైన్‌ను అందిస్తుంది.
⇒ శంకర్‌పల్లిలోని వైల్డ్ వాటర్స్ థీమ్ పార్క్ కూడా జిప్‌లైనింగ్‌ను అందిస్తుంది. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఇది పనిచేస్తుంది.
⇒ వికారాబాద్‌లో ఉన్న అనంత అడ్వెంచర్ క్లబ్ 24–గంటల అడ్వెంచర్ హబ్. జిప్‌లైన్‌తో సహా సాహసికుల కోసంæ వివిధ కార్యకలాపాలను అందిస్తుంది.
⇒ జూబ్లీ హిల్స్‌లో పచ్చని ప్రకృతి అందాల మధ్య ఉన్న ఫ్రీకౌట్స్ అడ్వెంచర్ జోన్‌లోనూ జిప్ లైన్ ఉంది. ]
జాగ్రత్తలు
⇒ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా యాక్టివిటీ ఉందా లేదా చూసుకోవాలి.
⇒ ఎంత కాలంగా జిప్‌లైన్ నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకోవాలి.
⇒ ఇవి పూర్తి సురక్షితంగా ఉన్నప్పటికీ.. అందరికీ నప్పవు.. కాబట్టి ముందస్తుగా తమ ఆరోగ్యంపై కూడా అవగాహన అవసరమైతే వైద్య సలహా కూడా తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment