![Cristiano Ronaldo Two Goals Away From 900 Goals](/styles/webp/s3/article_images/2024/08/21/cr_0.jpg.webp?itok=Xwthzm8K)
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయికి చేరువయ్యాడు. ప్రస్తుతం రొనాల్డో సౌదీ సూపర్ కప్ టోరీ్నలో అల్ నాసర్ క్లబ్‌కు ఆడతున్నాడు. అల్ హిలాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్ నాసర్ క్లబ్ 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అల్ నాసర్ జట్టు చేసిన ఏకైక గోల్ రొనాల్డో ద్వారా వచ్చింది. రొనాల్డో ప్రొఫెషనల్ కెరీర్‌లో ఇది 898వ గోల్. మరో రెండు గోల్స్ సాధిస్తే రొనాల్డో కెరీర్‌లో 900 గోల్స్ పూర్తి చేసుకుంటాడు.
తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఎర్విన్ హెల్మ్‌చెన్ (జర్మనీ; 987 గోల్స్), జోసెఫ్ బికాన్ (ఆస్ట్రియా–చెక్ రిపబ్లిక్; 950 గోల్స్), రొనాల్డ్ లెస్లీ రూకీ (ఇంగ్లండ్; 934 గోల్స్) కెరీర్‌లో 900 గోల్స్ మైలురాయిని దాటారు.
Comments
Please login to add a commentAdd a comment