అత్యంత పొడవైన బ్రిడ్జ్ ప్రారంభించనున్న పీఎం
దిబ్రుగడ్: భారత్‌లో అత్యంత పొడవైన బ్రిడ్జ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మే 26న ప్రారంభించనున్నారు. సుమారు 9.15 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జిని బ్రహ్మపుత్ర నదిపై అస్సాంలో నిర్మించారు. ఇది ముంబైలోని బాంద్రా-వొర్ల ఉన్న బ్రిడ్జికంటే 3.55 కిలో మీటర్లు పెద్దది. 60 యుద్ధ ట్యాంకులు ఒకే సారి దీనిపై ప్రయాణించవచ్చు. దీనిద్వారా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మద్య రవాణా సులభతరం అవుతుంది.
ఈ బ్రిడ్జ్ వాడుకలోకి వస్తే రెండు రాష్ట్రాల మధ్య నాలుగు గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. దీని నిర్మాణం 2011లో సుమారు రూ.950 కోట్లతో ప్రారంభమైంది. ఇది చైనా సరిహద్దుకు 100 కిలో మీటర్లు, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 540 కిలోమీటర్లు, అస్సాం రాజధాని దిస్సూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి 2015లోనే ప్రారంభమవ్వాల్సి ఉన్నా పనుల కారణంగా ఆలస్యమైంది.