మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న కేసీఆర్
టీఆర్ఎస్ ఎంపీలు కూడా...
హైదరాబాద్: భారత దేశ ప్రధాన మంత్రిగా ఈ నెల 26న నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని కేసీఆర్ను మోడీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఆ పార్టీ ఇతర సీనియర్ నాయకులు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నెల 26న ఉదయం ఢిల్లీ వెళ్లి ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిశాక వెంటనే తిరుగు ప్రయాణమై సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో కేసీఆర్ జాతీయ నాయకులను కలవనున్నారు