కలకత్తా: దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు లైన్‌ను పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలో బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త లైన్‌పై రైలుకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మెట్రో రైలులో మోదీ ప్రయాణించారు. ప్రయాణంలో భాగంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. రైలు బయట స్టేషన్లలో వేచిచూస్తున్న వారికి కిటికీల్లో నుంచి అభివాదం చేశారు.
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi welcomed by a huge crowd gathered at Esplanade metro station, in Kolkata
— ANI (@ANI) March 6, 2024
PM Modi inaugurated India's first underwater metro rail service, a short while ago. pic.twitter.com/5rMfUWHQ0f
అండర్ వాటర్ మెట్రోతో పాటు పాటు మొత్తం రూ.15 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కలకత్తాలోని హౌరామైదాన్-ఎస్ప్లాండే సెక్షన్‌లోని 4.8కిలోమీటర్ల మెట్రో ఈస్ట్ వెస్ట్ కారిడార్‌లో హూగ్లీ నదిపై అండర్‌వాటర్ మెట్రోను నిర్మించారు.
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi interacts with school students as they travel in India's first underwater metro train, in Kolkata. pic.twitter.com/lQye0OnuqP
— ANI (@ANI) March 6, 2024
భూమికి 30 మీటర్ల దిగువన మెట్రో రైల్ స్టేషన్ ఉంటుంది. ఈ కారిడార్ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఐటీ హబ్ సాల్ట్ లేక్ సెక్టార్‌తో అనుసంధానిస్తుంది. బుధవారం ఈ కారిడార్‌ను ప్రధాని అధికారికంగా ప్రారంభించినప్పటికీ ప్రయాణికులకు కొద్దిరోజుల తర్వాత అండర్ వాటర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. అండర్ వాటర్ మెట్రో ప్రారంభోత్సవంలో మోదీ వెంట బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్, అసెంబ్లీలో ప్రతిపక్షనేత సువేందు అధికారి తదితరులు పాల్గొన్నారు. ఐదురోజుల్లో పశ్చిమబెంగాల్‌లో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment