Metro IT Corridor
-
Kolkata: అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని
కలకత్తా: దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు లైన్‌ను పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలో బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త లైన్‌పై రైలుకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మెట్రో రైలులో మోదీ ప్రయాణించారు. ప్రయాణంలో భాగంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. రైలు బయట స్టేషన్లలో వేచిచూస్తున్న వారికి కిటికీల్లో నుంచి అభివాదం చేశారు. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi welcomed by a huge crowd gathered at Esplanade metro station, in Kolkata PM Modi inaugurated India's first underwater metro rail service, a short while ago. pic.twitter.com/5rMfUWHQ0f — ANI (@ANI) March 6, 2024 అండర్ వాటర్ మెట్రోతో పాటు పాటు మొత్తం రూ.15 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కలకత్తాలోని హౌరామైదాన్-ఎస్ప్లాండే సెక్షన్‌లోని 4.8కిలోమీటర్ల మెట్రో ఈస్ట్ వెస్ట్ కారిడార్‌లో హూగ్లీ నదిపై అండర్‌వాటర్ మెట్రోను నిర్మించారు. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi interacts with school students as they travel in India's first underwater metro train, in Kolkata. pic.twitter.com/lQye0OnuqP — ANI (@ANI) March 6, 2024 భూమికి 30 మీటర్ల దిగువన మెట్రో రైల్ స్టేషన్ ఉంటుంది. ఈ కారిడార్ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఐటీ హబ్ సాల్ట్ లేక్ సెక్టార్‌తో అనుసంధానిస్తుంది. బుధవారం ఈ కారిడార్‌ను ప్రధాని అధికారికంగా ప్రారంభించినప్పటికీ ప్రయాణికులకు కొద్దిరోజుల తర్వాత అండర్ వాటర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. అండర్ వాటర్ మెట్రో ప్రారంభోత్సవంలో మోదీ వెంట బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్, అసెంబ్లీలో ప్రతిపక్షనేత సువేందు అధికారి తదితరులు పాల్గొన్నారు. ఐదురోజుల్లో పశ్చిమబెంగాల్లో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇదీ చదవండి.. ప్రధాని పర్యటన వేళ.. బీజేపీపై ‘దీదీ’ ఫైర్ -
హైదరాబాద్‌లో అటువైపే ఇళ్లు ఎక్కువగా కొంటున్నారు
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి మార్కెట్ పరుగులు తీస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు మధ్యలో కోవిడ్ ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ పుంజుకుంది. నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపుతో మరింత వేగంగా సాగుతోంది. ఇప్పటికే మెట్రో నగరాల్లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకొని విశ్వనగరంగా రూపాంతరం చెందేందుకు సరికొత్త పోకడలతో విస్తరిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే నివాస ఖర్చులు తక్కువ కావడంతో ఉపాధి వలసలు అధికం కావడంతో పాటు ఇక్కడే శాశ్వత నివాసాల కోసం ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు పరిశ్రమలు తరలిరావడంతో గృహ, వాణిజ్య నిర్మాణాలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా స్థిరాస్తి రంగం జోరు కొనసాగుతోంది. లక్షన్నరకుపైనే దస్తావేజులు ► గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2022– 23 ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో సుమారు లక్షన్నరకు పైగా దస్తావేజులు నమోదైనట్లు రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కేవలం శివారు ప్రాంతాల్లోనే 1.20 లక్షల లావాదేవీలు జరగడంతో భారీగా ఆదాయం సమకూరింది. గతేడాదితో పోల్చితే సుమారు 46 శాతం పైగా లావాదేవీల సంఖ్య పెరిగినట్లయింది. గతేడాది ఏప్రిల్, జూన్‌లో దస్తావేజులు నమోదు సంఖ్య భాగా పెరిగినా.. కోవిడ్ వైరస్ వ్యాప్తితో మే నెలలో మాత్రం కేవలం 25 శాతానికి పరిమితమైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ► ప్రస్తుతం శివారు పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దినసరి రిజిస్ట్రేషన్ల సంఖ్య మూడు అంకేలు దాటుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఫరూక్నగర్, మహేశ్వరం, గచ్చిబౌలి, చంపాపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, మేడ్చల్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, బంజారాహిల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, గండిపేట పరిధుల్లో స్థిరాస్తి లావాదేవీలు అత్యధికంగా జరుగుతున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్‌పై భరోసాతో.. కోవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టి భవిష్యత్తుపై భరోసా కనిపిస్తుండటంతో క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ భారీ కొత్త ప్రాజెక్టు వస్తుండటంతో కొనుగోలుదారులు మరింత ఆసక్తి కనబర్చుతున్నారు. భూములు, ఇళ్ల ధరలు పెరుగుతుండటమే తప్ప తగ్గే అవకాశం లేదనే అంచనాలతో స్థిరాస్తి రంగం మరింత వేగం పుంజుకునట్లయింది. సామాన్యులతోపాటు ఐటీ ఉద్యోగులు ఇళ్లు కొనడమే కాదు.. పెట్టుబడులు సైతం వెనుకాడటం లేదు. గృ హ అద్దెలతో పోలిస్తే అద్దెల రాబడి అధికంగా ఉంటుందని స్థిరాస్తి రంగం వైపు మొగ్గు చూపడం అధికమైంది. మెట్రోతో... మెట్రో రవాణా అందుబాటులోకి రావడం కూడా స్థిరాస్తి రంగానికి కలిసి వచ్చినట్లయింది. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీ నగర్ మార్గం వైపు కూడా కొనుగోలు దారులు ఆసక్తి పెరిగింది. వరంగల్ రహదారి మార్గంలో ఘట్కేసర్ వరకు వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. పశ్చిమంలోని ఐటీ కేంద్రానికి సైతం గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండడంతో ఉద్యోగులు ఇటువైపు ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి మీదున్న ఎల్బీనగర్ వరకు మెట్రో రవాణా సదుపాయం ఉండటంతో నాగోలు, బండ్లగూడ, హస్తినాపురం, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు నివాసాలకు డిమాండ్ పెరిగింది. శివారుపై ఆసక్తి నగర శివారు చుట్టూ 20 నుంచి 30 కిలో మీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు, ఫ్లాట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇండిపెండెంట్ గృహాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి మరింత ఊపొచ్చినట్లయింది. బాహ్యవలయ రహదారి బయట టౌన్‌షిప్‌లు, వందల ఎకరాల్లో వెంచర్లు. పెద్ద సంస్థల కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు మరింత జీవం పోస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఓఆర్ఆర్ బయట భారీ ప్రాజెక్ట్‌లను ప్రకటించాయి. గతంలో స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు కార్యాలయానికి, ప్రధాన వాణిజ్య కేంద్రానికి ఎంత దూరమని ఆలోచన ఉండేది. రహదారుల వంటి మౌలిక వసతులు మెరుగుపడటంతో కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. తరలి వస్తున్న పరిశ్రమలు ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు పలు కంపెనీలు తరలివచ్చాయి. వాటి సమీప ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాల హోరు కొనసాగుతోంది. కొండాపూర్, కోకాపేట్, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ , ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, బీరంగూడ ప్రాంతాల్లోని నివాస గృహాలకు డిమాండ్ పెరిగింది. (క్లిక్: వంట నూనె ధర తగ్గింపు, వెంటనే అమల్లోకి) -
మెట్రో కారిడార్లలో ప్రాపర్టీ ధరల పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: దేశంలో మూడు దశాబ్ధాల క్రితం ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రధాన నగరాన్ని, శివారు ప్రాంతాలతో అనుసంధానం చేయడంతో దీని వినియోగం బాగా పెరిగింది. జనాభాకు, పర్యావరణానికి మెట్రో రైలు ప్రయోజనాలు ఎంత మేరకు ఉన్నాయో.. అంతే స్థాయిలో డెవలపర్లకూ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో మియాపూర్- ఎల్బీనగర్ (కారిడార్-1), జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్-2), నాగోల్-రాయదుర్గం/హైటెక్‌సిటీ (కారిడార్-3) ప్రాంతాలలో మెట్రో రైలు పరుగులు పెడుతుంది. 2018 నుంచి 2021 మార్చి మధ్య కాలంలో ఆయా మెట్రో ప్రాంతాలలో ప్రాపర్టీల ధరలు 15-20 శాతం పెరిగాయని జేఎల్ఎల్ తెలిపింది. ఇతర ప్రాంతాలలోని వాణిజ్య స్థలాలతో పోలిస్తే కారిడార్-3 ప్రాంతాలలో ఏటా 20-25 శాతం, కారిడార్-1, 2 ప్రాంతాలలో 20 శాతం ధరలు వృద్ధి చెందుతున్నాయని జేఎల్ఎల్ వాల్యూవేషన్ అడ్వైజరీ హెడ్ శంకర్ తెలిపారు. గత ఐదేళ్లలో మెట్రో కారిడార్లలో 500 మీటర్ల లోపు భూమి విలువ 15-20 శాతం పెరిగింది. మెట్రో రైలు ప్రారంభం తర్వాత ఆయా ప్రాంతం, భూమి వినియోగం, మైక్రో మార్కెట్స్ సామర్థ్యాలన్ని బట్టి ఆస్తుల మార్కెట్ విలువలు 10-15 శాతం వరకు పెరిగాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే మెట్రో ప్రాంతాలలో ఏటా 2-5 శాతం ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రయాణ ఖర్చుల తగ్గింపు, ఉద్యోగ అవకాశాల కారణంగా రిటైల్, వాణిజ్య ధరలలో 20-25 శాతం మేర వృద్ధి నమోదయింది. రాబోయే మెట్రో కారిడార్లలో 500 మీటర్ల లోపు భూమి విలువ 10-15 శాతం వరకు పెరుగుతాయని జేఎల్ఎల్ అంచనా వేసింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో 578.34 కి.మీ. వరకు మెట్రో రైల్ ఉంది. మరొక 760.62 కి.మీ. విస్తీర్ణంలో వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. కోచి, చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, నాశిక్ నగరాల్లో కొత్త మెట్రో రైల్ లైన్లు నిర్మాణంలో ఉన్నాయి. చదవండి: రియల్ ఎస్టేట్ రంగంలోకి 1,000 కోట్ల పెట్టుబడులు -
ఐటీ కారిడార్‌లో మెట్రో రయ్..రయ్
కొత్తగా 40 డీలక్స్ బస్సులు సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తున్న ఐటీ కారిడార్‌లో కొత్త బస్సులు పరుగులు తీయనున్నాయి. చక్కటి సిట్టింగ్ సదుపాయం, ఆకుపచ్చ, తెలుపు రంగు డిజైన్‌తో, పింక్ లైన్లతో పాటు అత్యాధునిక హంగులతో రూపొందించిన 40 మెట్రో డీలక్స్ బస్సులు ఈ వారంలో రోడ్డు ఎక్కనున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు ఆదరణ లభించడంతో వివిధ మార్గాల్లో కొత్త బస్సులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం బస్ భవన్‌కు చేరుకున్న ఈ మెట్రోడీలక్స్‌లు ఆర్టీఏ నుంచి అనుమతి పొందిన వెంటనే సిటీ రోడ్లపైకి వస్తాయి. రేయింబ వళ్లు ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు విధు లు నిర్వహించే ఐటీ సెక్టార్లలో రవాణా సదుపాయాల పెంపునకు గతేడాది గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో నమోదైన ఒకటి, రెండు ఉదంతాల దృష్ట్యా మహిళా ఉద్యోగుల భద్రత, సురక్షితమైన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని నగరం నలువైపుల నుంచి 415 బస్సులను ఐటీ మార్గాల్లో ప్రవేశపెట్టింది. ఈ బస్సులు రోజూ 4246 ట్రిప్పులు తిరుగుతున్నాయి. సగటున 3 నుంచి 4 ల క్షల మంది ప్రయాణికులు వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, నానక్నామ్గూడ, ఫైనాన్షియల్ సిటీ, హైటెక్‌సిటీ తదితర 600కు పైగా ఐటీ పరిశ్రమలు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వివిధ కేటగిరీల్లో సుమారు 8 లక్షల మంది పని చేస్తున్నట్లు అంచనా. సెక్యూరిటీ గార్డులు మొదలు ఐటీ రంగ నిపుణుల వరకు ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగిస్తున్నారు. ట్యాక్సీలు, సొంత వాహనాలు, ఆటో తదితర వాహనాల్లో కొంతమంది రాకపోకలు సాగిస్తుండగా, మిగతా వారంతా ఆర్టీసీపై ఆధారపడుతున్నారు. మరోవైపు రాత్రి వేళల్లో ట్రిప్పుల సంఖ్యను పెంచడం వల్ల కూడా ప్రయాణికుల నుంచి ఆదరణ పెరిగింది. నగరవ్యాప్తంగా ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 65 నుంచి 67 శాతానికే పరిమితం కాగా ఐటీ కారిడార్లకు నడిచే బస్సుల్లో ఇది 70 -72 శాతం వరకు నమోదవుతున్నట్లు అధికారుల అంచనా. ఆర్టీసీకి ఇది లాభదాయకమైన రేషియో కావడంతో తాజాగా కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం ఈసీఐఎల్, ఉప్పల్, సికింద్రాబాద్, కోఠి, వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీ, ఎస్ఆర్నగర్ మైత్రీవనం, జీడిమెట్ల ప్రాంతాల నుంచి కొండాపూర్, వీబీఐటీ, వేవ్రాక్లకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులను మరింత ఆకట్టుకోనున్నాయి.