kalvakunatla chandrasekhar rao
-
విడుదలైన ‘ఉద్యమ సింహం’ ఆడియో
పద్మనాయక ప్రొడక్షన్స్‌పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథను అందిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్ (కరాటే రాజా) కేసీఆర్ పాత్రలో నటిస్తున్నారు. సూర్య, పి.ఆర్.విఠల్ బాబు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిలీప్ బండారి సంగీతం అందిచారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. కరాటే రాజా, నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సీడీని ఆవిష్కరించారు. నటుడు రవివర్మ టీజర్ రిలీజ్ చేసారు. అనంతరం కరాటే రాజా మాట్లాడుతూ, ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాకు ఛాలెజింగ్ రోల్. ఇప్పటివరకూ చాలా సినిమాలు చేసాను. కానీ ఉద్యమ సింహం వాటికి భిన్నంగా, కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది. జీవితాంతం గుర్తిండిపోయే గొప్ప పాత్ర’ అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ‘కేసీఆర్ గారు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఆయన కథను వీళ్లంతా ఓ టీమ్ గా ఏర్పాటై తెరకెక్కించటం చాలా సంతోషంగా ఉంది. నాలుగు పాటలు, ఫైట్లు, హీరోయిన్ పెట్టుకుని కమర్శియల్ సినిమా చేసి డబ్బులు వచ్చేలా సినిమా చేయోచ్చు. కానీ నిర్మాత కేసీఆర్ పై అభిమానంతో ఇష్టంతో సినిమా చేయడం గొప్ప విషయం. ఇలాంటి ఉద్యమనేత సినిమా యువతలో స్ఫూర్తిని నింపుతుంద’న్నారు. చిత్ర నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ‘కేసీఆర్ కథని సినిమాగా చేయడం కష్టం. ఆయన గురించి ఎంతో కథ ఉంది. మూడు గంటల్లో చెప్పేది కాదు. అందుకే ఆయనకు సంబంధించిన కొన్ని కీలక అంశాలతో కథ తయారు చేసుకున్నాం. మంచి సందేశాత్మక సినిమా అవుతుంది.ఈ నెలాఖరున సినిమా భారీ స్థాయిలో విడుదల చేస్తాం’ అని అన్నారు. చిత్ర దర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ, ‘మంచి కథ ఇది. తెలుగు ప్రేక్షకులంతా కేసీఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాత, నన్ను నాకన్నా ఎక్కువగా నమ్మారు కాబట్టే సినిమా చేయగలిగాను. నా డైరెక్షన్ టీమ్ నాకన్నా ఎక్కువగా కష్టపడింది. అందుకే మంచి అవుట్ ఫుట్ తీసుకురాగలిగాను’ అన్నారు. -
అందుకే ప్రమాణస్వీకారానికి డుమ్మా కొట్టారు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానమున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ముఖం చూయించలేకే ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ బలంతోనే కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ..కేసీఆర్ బెంగుళూరలో బీజేపీకి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా థర్డ్‌ప్రంట్ కడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ తొత్తుగా కేసీఆర్ పని చేస్తున్నారని మండిపడ్డారు. సోనియా భిక్ష వల్లే కేసీఆర్ రాష్ట్రానికి సీఎం అయ్యారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను తెలంగాణలో లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎకరాకు రూ.4 వేలు ఇస్తున్నారని, ఇది రైతు బంధు పథకం కాదు..ఓట్ల బంధు పథకం అని ఎద్దేవా చేశారు. గిట్టుబాటుధర కల్పిస్తే ఇప్పుడు ఇచ్చే రైతు పెట్టుబడి పథకం కంటే ఎక్కువగా డబ్బులు వస్తాయని తెలియజేశారు. మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పటి వరకు కూడా స్పందించలేదని, రైతు బంధు పథకమని నమ్మి ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు ఓటు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పట్టించుకోడని చెప్పారు. -
23న ధర్మపురికి సీఎం రాక!
రాయికల్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈనెల 23న ధర్మపురి పుణ్యక్షేత్రానికి రానున్నట్లు తెలిసింది. ఈ నెల 14న ధర్మపురిలో మహా పుష్కరాలను ప్రారంభించిన సీఎం పుష్కర స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోరుున విషయం తెలిసిందే. కేసీఆర్ కుటుంబ సభ్యురాలు మృతి చెందడంతో గుడి బయట నుంచి దండం పెట్టుకొని హైదరాబాద్ పయనమయ్యూరు. దీంతో 23న పుష్కరాలను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి దర్శించుకునేందుకు వస్తున్నట్లు సీఎంవో నుంచి జిల్లా అధికారులకు శుక్రవారం సమాచారం అందినట్లు తెలిసింది. ఈ విషయంపై టీఆర్ఎస్కు చెందిన ఓ ముఖ్య నేతను సాక్షి సంప్రదించగా ఆయన మాత్రం సీఎం పర్యటనను ధ్రువీకరించలేదు. అరుుతే రాజమండ్రి పుష్కరాల్లో భక్తుల తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని.. ధర్మపురిలో కేసీఆర్ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. గతంలో జిల్లాకు వచ్చిన సందర్భంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి ఆలయం, పట్టణ అభివృద్ధికి వరాలు ప్రకటిస్తానని చెప్పారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ తన తాజా పర్యటనలో ధర్మపురికి వరాలు జల్లు కురిపించే అవకాశముందని భావిస్తున్నారు. ఆలయం, పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. -
జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్...
మంగళవారం కరీంనగర్, గురువారం నిజామాబాద్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో, గురువారం నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో మాత్రమే ఆయన ఒకరోజు పర్యటించారు. రెండు నెలల పాటు ఆయన హైదరాబాద్‌లోనే ఉంటూ ప్రతిరోజూ కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్య అంశాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రస్తావించిన దాదాపు అన్ని అంశాలకు ఆమోద ముద్ర వేసిన తరువాత.. తొలిసారిగా జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ ప్రాణం పోసిందని, 2001 మే 17వ తేదీన అక్కడ నిర్వహించిన సభ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిందని కేసీఆర్ అధికారులకు తెలిపారు. కరీంనగర్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, జిల్లా అభివృద్ధి తన బాధ్యత అని సీఎం వివరించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్, అంకాపూర్ వెళ్ళనున్నట్లు వెల్లడించారు -
‘ఆది’బట్లలో అంకురార్పణ
తెలంగాణ రాష్ట్రంలో తొలి పరిశ్రమ స్థాపన ఇక్కడే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సెజ్‌లో విమానాల తయారీ కంపెనీ రూ.500 కోట్ల పెట్టుబడితో జర్మనీ కంపెనీతో టాటా భారీ ఒప్పందం చిగురిస్తున్న రియల్ ఆశలు ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ రాష్ట్రంలో తొలి పరిశ్రమ ఆదిబట్లలోనే రూపుదిద్దుకోనుంది. రూ. 500 కోట్ల పెట్టుబడితో ‘టాటా’ కంపెనీ ప్రతిష్టాత్మక పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. టాటా లాకిడ్ మార్టిన్, టాటా ‘తారా’ వంటి హెలికాప్టర్ పరికరాల తయారీ కంపెనీల సరసన మరో పరిశ్రమ ఏర్పాటుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ రూపకల్పన చేసింది. దేశంలోనే మొత్తం విమానాన్ని తయారుచేసే ప్రథమ పరిశ్రమకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. ఆదిబట్లలో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దీనిలో డార్నియార్ విమానాలకు సంబంధించిన మొత్తం పరికరాలన్నీ తయారవుతాయి. రూ.500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించనున్నారు. జర్మనీకి చెందిన రుయాగ్ (ఆర్‌యూఏజీ) సంస్థతో టాటా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుని దీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రెండు దశల్లో విమాన విడిభాగాల పరికరాలు తయారు చేస్తారు. మొదటి దశలో ప్రధాన భాగాల్ని, క్యాబిన్‌ను, రెండో దశలో పూర్తి విమానానికి రూపకల్పనచేస్తారు. పూర్తిస్థాయి విమానాన్ని రూపొందించే సంస్థ ఒకే చోట ఏర్పాటు కావడం దేశంలోనే ప్రథమం. దీంతో పలు కంపెనీల ఆగమనంతో ఆదిబట్లకు డార్నియార్ విమానాల రూపంలో మరో పరిశ్రమ రావడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. టాటా సెజ్.. పలు ఐటీ, ఐటీ ఆధారిత, విమాన భాగాల తయారీ వంటి ప్రక్రియల కోసం 2009లో ఏపీఐఐసీ టాటా కంపెనీకి సుమారు 250 ఎకరాల భూమిని అప్పగించింది. ఈ క్రమంలో ఈ సెజ్‌లో ఇప్పటికే పలు కంపెనీలొచ్చాయి. లాకిడ్ మార్టిన్, తారా, టీసీఎస్ వంటి కంపెనీలు టాటా ఆధ్వర్యంలో తమ నిర్మాణ, ఉత్పత్తి పనులకు కేంద్రంగా మారుతూ శరవేగంగా దూసుకెళ్తున్నాయి. గతంలో అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం టాటా విమాన విడిభాగాల తయారీ కంపెనీలోని కొన్ని విభాగాల్ని ప్రారంభించారు. ప్రస్తుతం టాటా కంపెనీ జర్మనీ సంస్థతో ఏర్పరచుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం తాజా పరిశ్రమకు శ్రీకారం చుట్టింది. నాడు కుగ్రామం.. నేడు స్పేస్ సిటీ.. ఆదిబట్ల పేరు రోజురోజుకూ మార్మోగుతోంది. ఒక ప్పుడు కుగ్రామంగా ఉన్న ఆదిబట్ల నేడు స్పేస్సిటీగా రూపాంతరం చెందింది. పలు ఐటీ కంపెనీలకు కేంద్రస్థానంగా నిలిచింది. కేంద్రప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్‌కు కూడా ఆదిబట్ల ప్రధాన కేంద్రంగా మారింది. పలు బహుళజాతి పరిశ్రమలకు ఆదిబట్ల కేంద్రస్థానమవుతోంది. ఆదిబట్ల అభివృద్ధి చెందడంపై స్థానికులు, వ్యాపారులు ఆనందం వెలిబుచ్చుతున్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచస్థాయి పెట్టుబడులకు కేంద్రంగా మారిన ఆదిబట్లలో స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెడ్ కార్పెట్.. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడుల పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా ఆందోళన చెందారు. పెట్టుబడులన్నీ వెనక్కిపోతాయని కొందరు దుష్ర్పచారం కూడా చేశారు. దీంతో కొంత కాలంగా తెలంగాణలో పెట్టుబడులేవీ జరగలేదు. తొలిసారిగా రూ.500 కోట్ల పెట్టుబడితో విదేశీ సంస్థ ఒప్పందంతో భారీస్థాయి విమానాల తయారీ కేంద్రం రావడంతో పరిశ్రమలకు ఢోకా లేదని స్పష్టమైంది. మరోవైపు పెట్టుబడులు పెట్టేవారు టాటాను స్ఫూర్తిగా తీసుకుని పరిశ్రమల పెట్టుబడుల కోసం క్యూ కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ విమానాల పరికరాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో పరిశ్రమల ఉనికి ఎలా ఉంటుందోనన్న సందేహాలు తొలిగాయి. తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెడతామని.. కో ఆపరేటివ్ విధానాన్ని ఏర్పాటుచేసి పెట్టుబడులను ప్రోత్సహిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో పరిశ్రమల ఏర్పాటుకు రెడ్ కార్పెట్ పరిచినట్టయింది. మరోవైపు అందర్నీ తనవైపు ఆకర్షిస్తున్న ఆదిబట్లలో మరిన్ని బహుళజాతి కంపెనీలు వచ్చేందుకు ఆస్కారముంది. పుంజుకోనున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గతంలో వలెనే ఆదిబట్లలోరియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోనుంది. తెలంగాణ ఏర్పాటైతే పెట్టుబడులు, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతాయని అపోహ ఉండటంతో ఇన్నాళ్లూ ఈ వ్యాపారంలో స్తబ్ధత నెలకొంది. టాటా వంటి ప్రముఖ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆదిబట్లను కేంద్రంగా ఎంచుకోవడంతో ఈ ప్రాంతంలో రియల్ జోరు మళ్లీ పుంజుకోనుందని అందరూ భావిస్తున్నారు. టాటా కంపెనీల ఆగమనంతో గతంలో ఈ ప్రాంతంలో ఎకరా రూ.2కోట్లపైపే పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థిరాస్తి రేట్లు గణనీయంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు, వ్యాపారులు భావిస్తున్నారు. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అఖిలపక్షం
-
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అఖిలపక్షం
నేడు పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సీఎం కేసీఆర్ సమావేశం హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు విధివిధానాలు చర్చించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం ఆరుగంటలకు అసెంబ్లీ సీబ్లాక్‌లోని కాన్ఫరెన్స్హాల్లో జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన ఫ్లోర్‌లీడర్లకు ఆహ్వానం పంపారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నా.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ తొలి శాసనసభ సమావేశాల్లో విపక్షాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. ‘ఇక్కడ చదువుకునే ఆంధ్ర విద్యార్థులకు మన మెందుకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయా’లని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పేర్కొన్నారు. ఉమ్మడి ప్రవేశాలు జరిగే సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయడం, అందుకు అవసరమైన సాంకేతిక కసరత్తు.. ప్రాథమిక సమాచార సేకరణ తదితర అంశాలు సోమవారం నాటి అఖిల పక్ష సమావేశంలో చర్యకు రానున్నాయి. గత సంవత్సరానికి సంబంధించి కూడా కళాశాలలకు వెయ్యి కోట్ల రూపాయల మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఈ బకాయిల పరిస్థితిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సమీక్షలతో కేసీఆర్ బిజీబిజీ సీఎం కేసీఆర్ అదివారం బిజిబిజీగా గడిపారు. ఉదయం నుంచే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ వినోద్‌లతో పలు అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం అపోలో ఆసుపత్రి అధినేత ప్రతాప్ సి రెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లారు. పండుగలకు పకడ్బందీ బందోబస్తు: ముఖ్యమంత్రితో డీజీపీ హైదరాబాద్: వచ్చే రంజాన్, బోనాల పండుగల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాచర్యలు, పోలీసు బందోబస్తుపై వుుఖ్యవుంత్రి కేసీఆర్ ఆదివారం డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డిలతో చర్చించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జూలై 1 నుంచి నెల రోజుల పాటు రంజాన్ పర్వదినం ఉపవాసదీక్షలు, అదే నెలలో ప్రారంభవుయ్యే బోనాల ఉత్సవాల కోసం బందోబస్తు ఏర్పాట్లను వుుఖ్యవుంత్రికి వివరించారు. పాతబస్తీతోపాటు కీలకమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నావుని, సంఘవిద్రోహ శక్తులు, అవాంఛనీయ శక్తులపై ఇప్పటినుంచే కన్నేసి ఉంచావుని అధికారులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీలు, గూండాలు, కమ్యూనల్ గూండాలపై కఠినచర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, బందోబస్తు కోసం ఎంతవుందినైనా వినియోగించాలని, నగరంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని వుుఖ్యవుంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను అదేశించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, దానిని గమనంలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీ, నగర సీపీలకు సూచించారు. రంజాన్, బోనాల పండుగలకు సంబంధించి సోవువారం జరిగే కో-ఆర్డినేషన్ కమిటీ సవూవేశంలో శాంతిభద్రతల పరంగా చర్చించాల్సిన అంశాలను కూడా డీజీపీ, సీపీలు వుుఖ్యవుంత్రికి వివరించినట్టు సవూచారం. కాగా రంజాన్, బోనాల పండుగల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాట్లను ముఖ్యమంత్రి సోమవారం మద్యాహ్నం సమీక్షించనున్నారు. మంత్రులు, శాసనసభ్యులు, మేయర్, ఎంపీలు, అధికారులు పాల్గొంటారు. -
తొలి సీఎంకు పూర్ణకుంభ స్వాగతం
సచివాలయంలో డీ బ్లాక్ నుంచి ఎర్రతివాచీ నల్ల పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు సీ బ్లాక్ వద్ద ఉద్యోగులనుద్దేశించి ప్రసంగం ఆ తర్వాత ముఖ్యమంత్రి చాంబర్లో బాధ్యతల స్వీకరణ తెలంగాణ ప్రభుత్వ రాజముద్రికపై తొలి సంతకం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి సచివాలయానికి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అక్కడ పూర్ణకుంభ స్వాగతం లభించింది. మధ్యాహ్నం 12.13 గంటలకు సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయనకు వేదపండితులు మంత్రోచ్ఛారణలు, జయజయధ్వానాలతో అధికారులు, ఉద్యోగులు ‘డీ’ బ్లాక్ నుంచి ఎర్రతివాచీ పరచి ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ తొలి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, తొలి డీజీపీ అనురాగ్‌శర్మ, ఇతర ఐఏఎస్ అధికారులు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు మమత, సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, ఎ.పద్మాచారి తదితర ఉద్యోగులు కేసీఆర్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. మింట్‌కాంపౌండ్‌వైపు నుంచి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి కొత్తగా నిర్మించిన ప్రధానద్వారం ద్వారా ఆయన లోపలికి ప్రవేశించారు. పరేడ్‌గ్రౌండ్స్ నుంచి ప్రత్యేకంగా బుల్లెట్లపై ఎర్రదుస్తుల్లో ఉన్న కాన్వాయ్ కేసీఆర్ వాహనానికి ముందు రాగా.. ఆయన సచివాలయానికి వచ్చారు. ‘డీ’ బ్లాక్ నుంచి నల్లపోచమ్మ గుడివరకు నడుస్తూ వచ్చిన ముఖ్యమంత్రి అమ్మవారిని పూజించారు. పూజ నిర్వహించిన అనంతరం ‘సీ’ బ్లాక్ ముందు ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు రెడ్‌కార్పెట్‌పైనే ముఖ్యమంత్రి నడుస్తూ వచ్చారు. అక్కడ తెలంగాణ సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పలు ప్యాకేజీలు తమ మదిలో ఉన్నప్పటికీ, మనకు ప్రస్తుతం చట్టాలు, జీవోలు లేనందున వాటిని ప్రకటించడం లేదన్నారు. ఉద్యోగుల సర్వీ సు నిబంధనలు సరళీకృతం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నవ తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులు మాట ఇచ్చినట్టు గంటపాటు అధికంగా పనిచేస్తే మరింత సంతోషిస్తానని ఆయన పేర్కొన్నారు. రాజముద్రకు ఆమోదం: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణ రాష్ట్రప్రభుత్వ రాజముద్రను ఆమోదిస్తూ కేసీఆర్ తొలిసంతకం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అందించిన ఫైలుపై పురోహితులు సూచించిన ముహూర్త సమయంలో మధ్యాహ్నం 12.57 గంటలకు ఆయన ఈ సంతకం చేశారు. ఆ తరువాత కేబినెట్ సహచరులతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు. -
మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న కేసీఆర్
టీఆర్ఎస్ ఎంపీలు కూడా... హైదరాబాద్: భారత దేశ ప్రధాన మంత్రిగా ఈ నెల 26న నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని కేసీఆర్‌ను మోడీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఆ పార్టీ ఇతర సీనియర్ నాయకులు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నెల 26న ఉదయం ఢిల్లీ వెళ్లి ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిశాక వెంటనే తిరుగు ప్రయాణమై సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో కేసీఆర్ జాతీయ నాయకులను కలవనున్నారు -
జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
పరిగి, తాండూరు, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన రంగారెడ్డి జిల్లాను వ్యవసాయకంగా అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించి జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పరిగి మినీ స్టేడియం, తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో 5లక్షల నుంచి 6లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఇందులో పరిగి నియోజకవర్గంలోనే 1.5లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. పరిగి అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్న హరీశ్వర్ రెడ్డి తన కుటుంబ సభ్యుల్లో ఒకరని పేర్కొంటూ.. ఆయన ఎమ్మెల్యేగా గెలవటం ఖాయమని, మంత్రివర్గంలోకి తప్పకుండా హరీశ్వర్‌రెడ్డిని తీసుకుంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్లు తెలంగాణను మతప్రమేయంలేని సెక్యులర్ రాజ్యం చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు, గిరిజనులకు చేసిందేమీలేదని అన్నారు. కాంగ్రెస్‌తో సోపతిజేసి అన్నివిధాలుగా నష్టపోయామని, అధికారంలోకి వచ్చాక 14 నెలల్లో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు, ముస్లింలకు 12శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించి చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా జ్యుడీషియల్ పవర్ కల్పిస్తామన్నారు. రూ.1000 కోట్లతో ముస్లిం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని, గిరిజన తండాలకు పంచాయతీలుగా మారుస్తామని అన్నారు. వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500ల చొప్పున పింఛన్లు ఇస్తామన్నారు. రూ.మూడు లక్షలతో 125 గజాల్లో 100శాతం రాయితీపై పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని, డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వరకు వడ్డీలే ని రుణాలు అందిస్తామన్నారు. తాండూరులో కంది పరిశోధన కేంద్రం ‘ఇండియాలోనే తాండూరు కందిపప్పు ఫేమస్. హైదరాబాద్‌లో తాండూరు తువ్వర్ అంటే ఎవరైనా అనుమానం లేకుండా తీసుకుంటరు. అంత క్వాలిటీ ఉంటది. అందుకే తాండూరులో కంది పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘కర్ణాటకలో షాబాద్ బండలకు రాయల్టీ తక్కువ. తాండూరులో నాపరాతి (షాబాద్)రాయల్టీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో షాబాద్ బండలపై రూపాయి రాయల్టీని తగ్గించే నిర్ణయం తీసుకుంటాం’ అని కేసీఆర్ ప్రకటించారు. తాండూరు సభలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్‌గౌడ్, తాండూరు డివిజన్ అధ్యక్షులు విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు. శ్రేణుల్లో అసంతృప్తి.. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పరిగి బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే సభలో ఉన్న పార్టీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొప్పుల హరీశ్వర్రెడ్డిలను మాట్లాడనివ్వకుండా కేసీఆర్ ఒక్కరే.. అదీ పది నిమిషాల్లోపే ప్రసంగాన్ని ముగించి వెళ్లపోవడంతో పార్టీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యాయి. పరిగి సభలో ముస్లిం రిజర్వేషన్ సాధన ఫ్రంట్ అధ్యక్షుడు ఇఫ్తేకార్ అహ్మద్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనీల్‌రెడ్డి, మీర్‌మహమూద్, సురేందర్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి, అశోక్‌వర్ధన్ రెడ్డి, రవికుమార్, మునీర్, కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కమతం రాజేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
27న జిల్లాకు కేసీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాలవారీగా పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 27న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తాండూరు చేరుకుంటారు. అక్కడినుంచి 12.40 గంటలకు పరిగి, 1.20 గంటలకు వికారాబాద్ మీదుగా పర్యటన సాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు మేడ్చల్ చేరుకుంటారు. అనంతరం 2.40 గంటలకు మెదక్ జిల్లా పటాన్చెరు బయలుదేరుతారు. అక్కణ్నుంచి తిరిగి 3.20 గంటలకు ఎల్బీనగర్కు వస్తారు. సాయంత్రం 4గంటలకు ఉప్పల్, 4.40 గంటలకు కుత్బుల్లాపూర్‌లో పర్యటిస్తారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.