కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానమున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ముఖం చూయించలేకే ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ బలంతోనే కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ..కేసీఆర్ బెంగుళూరలో బీజేపీకి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా థర్డ్‌ప్రంట్ కడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బీజేపీ తొత్తుగా కేసీఆర్ పని చేస్తున్నారని మండిపడ్డారు. సోనియా భిక్ష వల్లే కేసీఆర్ రాష్ట్రానికి సీఎం అయ్యారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను తెలంగాణలో లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎకరాకు రూ.4 వేలు ఇస్తున్నారని, ఇది రైతు బంధు పథకం కాదు..ఓట్ల బంధు పథకం అని ఎద్దేవా చేశారు.
గిట్టుబాటుధర కల్పిస్తే ఇప్పుడు ఇచ్చే రైతు పెట్టుబడి పథకం కంటే ఎక్కువగా డబ్బులు వస్తాయని తెలియజేశారు. మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పటి వరకు కూడా స్పందించలేదని, రైతు బంధు పథకమని నమ్మి ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు ఓటు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పట్టించుకోడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment