రాయికల్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈనెల 23న ధర్మపురి పుణ్యక్షేత్రానికి రానున్నట్లు తెలిసింది. ఈ నెల 14న ధర్మపురిలో మహా పుష్కరాలను ప్రారంభించిన సీఎం పుష్కర స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెళ్లిపోరుున విషయం తెలిసిందే. కేసీఆర్ కుటుంబ సభ్యురాలు మృతి చెందడంతో గుడి బయట నుంచి దండం పెట్టుకొని హైదరాబాద్ పయనమయ్యూరు. దీంతో 23న పుష్కరాలను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి దర్శించుకునేందుకు వస్తున్నట్లు సీఎంవో నుంచి జిల్లా అధికారులకు శుక్రవారం సమాచారం అందినట్లు తెలిసింది.
ఈ విషయంపై టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ముఖ్య నేతను సాక్షి సంప్రదించగా ఆయన మాత్రం సీఎం పర్యటనను ధ్రువీకరించలేదు. అరుుతే రాజమండ్రి పుష్కరాల్లో భక్తుల తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని.. ధర్మపురిలో కేసీఆర్ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.
గతంలో జిల్లాకు వచ్చిన సందర్భంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి ఆలయం, పట్టణ అభివృద్ధికి వరాలు ప్రకటిస్తానని చెప్పారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ తన తాజా పర్యటనలో ధర్మపురికి వరాలు జల్లు కురిపించే అవకాశముందని భావిస్తున్నారు. ఆలయం, పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి టీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది.
23న ధర్మపురికి సీఎం రాక!
Published Sat, Jul 18 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement