14 నుంచి డబుల్ డెక్కర్ రైలు
నేటి నుంచి రిజర్వేషన్ సౌకర్యం
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్ : రాయలసీమవాసులు హైదరాబాద్ వెళ్లడానికి అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ రైలు 14వ తేదీ నుంచి రాకపోకలు సాగించనుంది. అందుకోసం దక్షిణమధ్య రైల్వే అధికారులు అన్ని చర్యలు పూర్తిచేశారు.
ప్రస్తుతం ఉన్న రైల్వేట్రాక్, ప్లాట్‌ఫాం ర్యాక్ పరిస్థితిని డబుల్ డెక్కర్ రైల్‌కు అనుగుణంగా అధికారులు ఇటీవలే మార్పు చేశారు. అనంతరం ఈ రైలును కాచిగూడ నుంచి తిరుపతి వరకు ట్రయల్న్ ్రచేశారు. పూర్తిస్థాయి ట్రాక్ అనుకూలం కావడంతో న్యూ ఢిల్లీలోని రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 14న కాచిగూడలో ప్రారంభించనున్నారు.
ఈ రైలు గంటకు 160 కి.మీ వేగంతో నడిచే సామర్థ్యం ఉన్నప్పటికీ కాచిగూడ నుంచి తిరుపతికి నడిచే మార్గంలో రైల్వే ట్రాక్ పరిస్థితి, ఈ ప్రాంత భూపరిస్థితులను బట్టి గంటకు 100 కి.మీలకు మించి పోయే అవకాశం ఉండదని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. కాగా ఈ రైలు ఈనెల 14వ తేదీ ఉదయం 6.45 గంటలకు కాచిగూడలో బయలుదేరి మధ్యాహ్నం తర్వాత తిరుపతికి చేరుకుంటుంది. అనంతరం 15వ తేదీ ఉదయం 5.45 గంటలకు తిరుపతిలో బయలుదేరి కాచిగూడ వెళుతుంది.
ఈ రైలు ప్రతి బుధ, శని వారాల్లో కాచిగూడలోనూ, ప్రతి గురు, ఆదివారాల్లో తిరుపతిలోనూ బయలుదేరే విధంగా రైల్వే అధికారులు చార్ట్‌ను నిర్ణయించారు. ఈ రైలులో ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు శుక్రవారం(నేడు) ఉద యం 8.00 గంటల నుంచి రిజర్వేషన్లు అం దుబాటులోకి వస్తాయి. అయితే డబుల్ డెక్కర్ పూర్తిగా ఏసీ రైలు కావడంతో తిరుపతి నుంచి కాచిగూడకు రూ.700 చార్జీగా అధికారులు నిర్ణయించారు.