గుంటూరు (ఎడ్లపాడు) : 87.3 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుంటూరు జిల్లా ఎడ్లపాడులో ఆదివారం ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విశాఖ శారద పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వివాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం దేవస్థానం గోపురానికి పగుళ్లు ఏర్పడినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతోనే దేశానికి ఇబ్బందులు ఎదురువుతున్నాయన్నారు. అలాగే దేవాదాయ శాఖ చారిత్రక దేవాలయాలను పరిరక్షించడంలో విఫలమైందని ఆరోపించారు. బెజవాడ దుర్గగుడిలో ఇటీవల వెలుగు చూసిన కుంభకోణం విషయంలో ఈవోపై చర్య తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని జయేంద్ర విమర్శించారు.