‘ఎంఎస్‌ స్వామినాథన్‌ అనెక్సి’ ప్రారంభం | Institute Of Soil Health Management Complex Inaugurated In Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఎంఎస్‌ స్వామినాథన్‌ అనెక్సి’ ప్రారంభం

Published Thu, Jul 21 2022 1:47 AM | Last Updated on Thu, Jul 21 2022 9:20 AM

Institute Of Soil Health Management Complex Inaugurated In Hyderabad - Sakshi

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సాయిల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ను ప్రారంభిస్తున్న వీసీ ప్రవీణ్‌రావు 

వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్‌): ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన నిధుల సాయంతో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌’, ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌’ కాంప్లెక్స్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్‌కు వ్యవసాయ శాస్త్రవేత్త ‘డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ అనెక్సి’ అని నామకరణం చేశారు.

ఈ సందర్భంగా వర్సిటీ వీసీ డాక్టర్‌ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రప్రభుత్వ సాయంతో విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ సదుపాయాల్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని రైతాంగం వ్యవసాయాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement