నెల్లూరు: దేశంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆదివారం నెల్లూరు జిల్లా మనుబోలులో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, శిద్ధా రాఘవరావుతోపాటు జెడ్పీ ఛైర్మన్ రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు.
అలాగే నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారతి ట్రస్ట్లో కిసాన్ సమ్మేళనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడు రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.