సాక్షి, అమరావతి : వెలగపూడి సచివాలయంలో తొలిసారి ప్రయోగాత్మకంగా జపాన్ నుంచి తెప్పించిన స్మార్టు సైకిళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్‌డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. నేటి నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా స్మార్ట్ సైకిళ్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. సచివాలయం ఆవరణలో రెండు, వెలుపల వాహనాల పార్కింగ్ వద్ద మరో స్టేషన్ ఏర్పాటు చేసి ప్రతి స్టేషన్‌లో పది సైకిళ్ల చొప్పున అందుబాటులో ఉంచారు. సైకిల్ తీసుకునే వారికి ప్రత్యేకంగా స్వైపింగ్ కార్డు, పాస్‌వర్డ్ ఇస్తారు. సచివాలయానికి వచ్చిన వారు వీటిని ఉచితంగా పొంది పని ముగించుకున్న తర్వాత మూడు స్టేషన్లలో ఎక్కడైనా అప్పజెప్పి వెళ్లొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment