
విజయవాడలో సందడి చేసిన సచిన్, అనుష్క
విజయవాడ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, హీరోయిన్ అనుష్క శుక్రవారం విజయవాడ నగరంలో సందడి చేశారు. నగరంలోని పీవీపీ మాల్ను వారిద్దరు ప్రారంభించారు. సచిన్, అనుష్కలను చూసేందుకు వారి అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో పీవీపీ మాల్ పరిసర ప్రాంతాలు సచిన్, అనుష్క అభిమానులతో కిక్కిరిసి పోయాయి. ఈ సందర్బంగా సోదరిసోదరీమణులారా అంటూ విజయవాడ ప్రజలను సచిన్ తెలుగులో పలకరించారు. సచిన్ వస్తున్న సందర్బంగా ట్రాఫిక్ పోలీసులు నగరంలో ఏటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో విజయవాడలోని బందరు రోడ్డు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ తీవ్ర అటంకం ఏర్పడింది.