Vijayawada City
-
జలదిగ్బంధంలో విజయవాడ..
-
విజయవాడ అంబెడ్కర్ విగ్రహంపై అర్ధరాత్రి టీడీపీ నేతల కుట్ర..
-
విజయవాడ సెంట్రల్ లో ఎగిరేది YSRCP జెండా
-
అక్కడ వ్యాపారుల సొమ్మంతా ప్రసాదార్పణం..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ఫండ్ పేరుతో కూటమి అభ్యర్థి అందినకాడికి వసూలు చేసేస్తున్నాడు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భాగమైన ఆ నియోజకవర్గంలో ఆ అగ్రకుల పెత్తందారు సీటు దక్కించుకునే దగ్గర నుంచి అన్నింటా వసూళ్లే. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదని నిర్థారణకు వచ్చిన ఆయన కొత్త ఎత్తుగడ వేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన, వసూళ్లకు తెగబడి అందినకాడికి దోచుకోవాలనే వ్యూహానికి తెర లేపారు. విజయవాడ సిటీకి ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గాన్ని కై వసం చేసుకుని తద్వారా ఇక్కడ ఉన్న సహజవనరులు దోచుకోవాలని, రియల్ వ్యాపారంలో కోట్లు కూడబెట్టాలన్నది ఆయన లక్ష్యం. అది ఫలించే సూచనలు కనిపించకపోవడంతో ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తనకు ఇప్పుడు సహకరిస్తేనే.. రేపు తన వంతు సహకారం ఉంటుందని అన్యాపదేశంగా హెచ్చరిస్తుండటం గమనార్హం. కప్పం కట్టాల్సిందేనంటూ ఇండెంట్లు.. జిల్లాలో హాట్ సీట్..ఇన్‌కం క్రియేట్ సీట్‌గా పేరున్న ఆ నియోజకవర్గంలో రియల్ వ్యాపారం అధికంగా జరిగే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బిల్డర్లు, రియల్ వ్యాపారులకు ఇప్పటికే ఇండెంట్లు ఇచ్చేశారు. వైద్యం, విద్య, వ్యాపార రంగంలో స్థిరపడ్డ వ్యక్తులను కూడా టార్గెట్ చేశారు. అన్నీ సజావుగా సాగాలంటే కప్పం కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. భవిష్యత్తు ‘‘కమ్మ’’గా ఉండాలంటే మీకు బాధ్యత ఉందా? లేదా? అనే సెంటిమెంట్‌నూ వాడుకుంటున్నారు. గ్రామాల వారీగా ఎన్ఆర్ఐల జాబితాను సిద్ధం చేసి తన అనుయాయుల ద్వారా ఫోన్లు చేయించి ఫండ్ రెడీ చేసుకోమని తాము చెప్పిన వ్యక్తుల ఖాతాలకు డబ్బులు పంపాలని సూచిస్తున్నట్టు తెలిసింది. 2014లో అధికారాన్ని అనుభవించిన ఆయన ఉచిత ఇసుక, రియల్ వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో వ్యాపారాలకు తన వంతు సహాయ సహకారాలను అందించారు. అడ్డగోలుగా సహజవనరుల్ని బొక్కేసి, అనుయాయులకు నాలుగురాళ్లు వెనకేసుకునేలా తోడ్పాటునందించారు. ఈ దఫా వాళ్లందరినీ ఫండ్స్ కోసం టార్గెట్ చేసి గల్లా పెట్టె నింపుకొనే పనిలో పడ్డారు. ఎన్ఆర్ఐల ఫండ్‌తోనే సీటు దక్కింది.. ఆది నుంచి సీటు లేదని తేలిపోవటంతో ఏడ్చి పెడబొబ్బలు పెట్టాడాయన. ఎన్ఆర్ఐల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి, వారి ద్వారా కప్పం కట్టించి మరీ చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. ఇప్పుడిక వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇండెంట్లు పెట్టడానికి, ముక్కుపిండి వసూలు చేసేందుకు ఓ పది మందితో కూడిన కమిటీని వేశారు. ఓ మాజీ సర్పంచ్‌కు ఆ కమిటీ అధ్యక్ష పీఠం కట్టబెట్టి రంగంలోకి దించారు. ఇక ఆ కమిటీ కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఖర్చులకు కనీసం రూ.25 కోట్లకు పైగా వసూలు చేయాలని ఆయన టార్గెట్ పెట్టుకుని జల్లెడ పట్టేస్తున్నారు. గత ఎన్నికల్లో సైతం.. ఎన్నికలొస్తే ఆ అగ్రకుల అభ్యర్థికి పండగే...తన సామాజిక వర్గం దండిగా ఉన్న ఆ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కోటీశ్వరులు, ఎన్ఆర్ఐల జాబితాలు తయారుచేసి వసూళ్ల పర్వం మొదలెడతాడు. వచ్చిన దాంట్లో సగం ఖర్చు పెట్టి, మిగతా సగం వెనకేసుకుంటాడు. గతంలో ఇలాగే చేశాడు. ఈసారి ఆ పార్టీ టికెట్ కోసం విపరీతమైన పోటీ రాగా ఎన్ఆర్ఐల ఫండ్ గ్యారంటీతోనే చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం గెలుపుపై ఆశలు సన్నగిల్లిన ఆయన బరితెగించి వసూళ్ల కోసం ఏకంగా ఓ కమిటీనే నియమించాడు. ఊరూరా ఎన్ఆర్ఐలు, బడా వ్యాపారుల జాబితాలు సేకరించి వసూళ్ల పర్వం మొదలెట్టాడు. కూటమి అభ్యర్థి 2019లో అధిష్టానం ఇచ్చిన సొమ్ము, ఇతరత్రా ఫండ్స్‌లో ఖర్చుపెట్టగా తమ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో సుమారు రూ.4 కోట్లకు పైగా పందేలు కట్టారు. సొమ్ము పోయి శని పట్టింది. ఈ దఫా అలాంటి పరిస్థితి రాకుండా కొంత జాగ్రత్త వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పోయిన సొమ్ముతో పాటుగా ఈ దఫా అధికమొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. ఈ చందాల వసూళ్లు నియోజక వర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందే ఈ రేంజ్లో దోపిడీ ఉంటే.. పొరపాటున ఈయన గెలిస్తే ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల రూపంలో ఆయనకు బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఇవి చదవండి: నామినేషన్ల పర్వం షురూ.. -
మురుగు నుంచి విద్యుత్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మురుగునీటి శుద్ధికి విజయవాడ నగర పాలక సంస్థ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. ఇప్పటికే ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ)ను ఆధునికీకరిస్తూనే.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త ప్లాంట్లను నెలకొల్పుతోంది. మరోవైపు ఈ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆదాయాన్ని ఆదా చేసుకునేలా ఏర్పాటు చేస్తోంది. నగరంలో 150 ఎంఎల్డీ సామర్థ్యంతో అజిత్‌సింగ్ నగర్, ఆటోనగర్, జక్కంపూడి, రామలింగేశ్వర్‌నగర్‌లో రెండు ఎస్టీపీలున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్తగా రామలింగేశ్వర్ నగర్లో 20 ఎంఎల్డీ, ఆటోనగర్‌లో 10 ఎంఎల్డీ సామర్థ్యంతో రెండు ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్లలో నీరు శుద్ధి చేసే సమయంలో వచ్చే మిథేన్ గ్యాస్‌ను స్క్రబ్బర్ మెషిన్ల ద్వారా శుద్ధి చేస్తారు. అందులోని తేమ, ఆమ్లాలను తీసేయగా వచ్చే మిథేన్ గ్యాస్‌కు టర్బెయిన్లను అనుసంధానం చేస్తారు. తద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను అక్కడ ఎస్టీపీలలోనే వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం సింగ్‌నగర్, జక్కంపూడి, రామలింగేశ్వర్ నగర్‌లోని నాలుగు ఎస్టీపీలకు స్క్రబ్బర్ మెషిన్లు ఏర్పాటు చేసి, మిథేన్ గ్యాస్‌ను శుద్ధి చేయడం ద్వారా గ్యాస్ టర్బెయిన్లకు అనుసంధానం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. యునిడో సహకారంతో.. రామలింగేశ్వర్ నగర్లో ఏర్పాటు చేసిన ఎస్టీపీ పాతది కావడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సూచించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా దానిని ఆధునికీకరిస్తున్నారు. ఈ పనుల కోసం రూ.14.93 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యునిడో) సహకారం అందిస్తోంది. విజయవాడ కార్పొరేషన్‌కు రూ.10 కోట్ల నిధులను అందించింది. ఈ నిధులు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు బయో గ్యాస్ ప్లాంట్లను స్థాపించడంలో ఈ నిధులు కీలక భూమిక పోషిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థ నుంచి వచ్చిన స్థిరమైన పద్ధతులను అవలంబించడంతోపాటు, పర్యావరణ సవాళ్లను తగ్గించడంలో విజయవాడ కార్పొరేషన్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం ఎస్టీపీల ఆధునికీకరణ పనులు నాణ్యతా ప్రమాణాలతో చేస్తున్నాం. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వైపు విజయవాడ కార్పొరేషన్ అడుగులు వేస్తోంది. రూ.135 కోట్లతో ఎస్టీపీలను ఆధునికీకరిస్తున్నాం. మురుగునీటి నిర్వహణ క్లిష్టమైన సమస్య. దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎస్టీపీల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ఆ విద్యుత్‌ను వాటికే వినియోగిస్తాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, విజయవాడ ఎస్టీపీల ఆధునికీకరణ గతంలో నిర్మించిన పాత ఎస్టీపీలను అమృత్, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.135 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రతి ప్లాంట్‌ను ఆహ్లాదకరమైన ఇండస్ట్రియల్ వాతావరణం కలిగి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్లాంట్లలో సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మిస్తున్నారు. మరోవైపు నగరం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజల సహకారం తీసుకుంటున్నారు. రోడ్లు, డ్రెయిన్లలో చెత్త, వ్యర్థాలు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. -
ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు.. సినిమా స్టైల్లో..
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఇంట్లో పని కోసం మొదటిరోజు వచ్చిన భార్యాభర్తలు, మరుసటి రోజు అదే ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రామకృష్ణాపురం ప్రాంతంలో చెందిన నెట్ల లక్ష్మీప్రసాద్, జయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వారు ఇద్దరూ వృద్ధులు కావడంతో తమ ఇంటిలో సామాన్లు సర్దడం కోసం పనివారు కావాలని తెలిసిన మహిళను అడిగారు. ఆమె ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ సమీపంలో నివసించే అక్కరబోతు అంజిబాబు, లీలాదుర్గ దంపతులను పనికి మాట్లాడింది. లక్ష్మీప్రసాద్ ఇంటికి మంగళవారం పనికి వచ్చిన అంజిబాబు, లీలాదుర్గ రాత్రి 11 గంటల వరకూ సామాన్లన్నీ సర్ది, కూలి తీసుకొని వెళ్లిపో యారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వారిరువురు మళ్లీ లక్ష్మీప్రసాద్ ఇంటికి వచ్చి తలుపులు కొట్టారు. అతని భార్య జయలక్ష్మి ఇంటి తలుపు తీయగా వారు వెంటనే ఆమెను లోపలకు నెట్టేసి, నోరు నొక్కేసి ఐదు కాసుల బంగారు నానుతాడు, నాలుగు కాసుల బంగారు లాకెట్, చెవిదిద్దులు, రెండు పేటల నల్లపూసలగొలుసు లాక్కొని పారిపోయారు. దీంతో అంజిబాబు, లీలాదుర్గను పనికి మాట్లాడిన మహిళ దగ్గరకు లక్ష్మీప్రసాద్, జయలక్ష్మి వెళ్లి విషయం చెప్పారు. అనంతరం వారు ముగ్గురూ కలిసి అంజిబాబు, లీలాదుర్గ ఇంటికి వెళ్లగా తలుపులకు తాళాలు వేసి కనిపించాయి. చదవండి: మహిళపై వీఆర్వో వేధింపులు.. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ.. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగ్‌నగర్ సీఐ ఎస్.వి.వి.ఎస్.లక్ష్మీనారాయణ, క్రైం ఎస్ఐ సత్యనారాయణ, హెడ్‌కానిస్టేబుల్ ఖాన్, కానిస్టేబుల్ మహేష్, ఉమెన్ కానిస్టేబుల్ జానకి, హోమ్‌గార్డ్ నటరాజ్ బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గవర్నర్‌పేట బ్రిడ్జి డౌన్లో అనుమానా స్పదంగా తిరుగుతున్న అంజిబాబు, లీలాదుర్గను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన మొత్తం సొత్తును వారి వద్ద స్వా«దీనం చేసుకుని, ఇద్దరినీ అరెస్ట్ చేశారు. -
ప్రపంచం మెచ్చుకుంటున్న వాలంటీర్ల వ్యవస్థపై ఎల్లో కుట్రలు
-
విజయవాడలో ఘనంగా భోగి వేడుకలు
-
విజయవాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో బీసీ మహాసభ
-
విజయవాడలో ఘనంగా భోగి సంబరాలు
-
డ్రగ్స్ ముఠాల భరతం పడతాం
సాక్షి, విజయవాడ: డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక నిఘా పెట్టామని విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు అన్నారు. నగరంలోకి గంజాయి ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించామన్నారు. గోవా, కర్ణాటక నుంచి వస్తున్న సింథటిక్ డ్రగ్స్‌పైనా దృష్టి సారించామన్నారు. ఇప్పటికే డ్రగ్స్‌కు సంబంధించి రెండు కేసుల్లో నలుగురు విదేశీయులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఒరిస్సా, విశాఖపట్నంల నుంచి విజయవాడ మీదుగా కర్ణాటక, మహారాష్ట్రలకు స్మగ్లింగ్ జరుగుతోందమన్నారు. ఆరు నెలల్లో మూడు కిలోలకు పైగా గంజాయిని పట్టుకుని 50 మందిని అరెస్టు చేశామని వివరించారు. (ఆత్మహత్యకు ముందు యువతి సెల్ఫీ వీడియో ) గురువారం సీపీ బత్తిన శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. విదేశీయుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన న్యాయ విద్యార్థి అర్జున్ నుంచి వివరాలు సేకరించామన్నారు. అతను చెప్పిన వివరాల మేరకు డ్రగ్స్ వాడకానికి అలవాటు పడ్డ ఆరుగురిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. వాళ్లందరినీ డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించామని పేర్కొన్నారు. యువతను మత్తువైపు మళ్లిస్తున్న డ్రగ్స్ సరఫరా ముఠాల భరతం పడతామని హెచ్చరించారు. మరోవైపు పిల్లల నడవడికను తల్లిదండ్రులు ఎప్పుడూ పర్యవేక్షిస్తుండాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే పిల్లలు చెడుదారి పట్టి భవిష్యత్తును పాడు చేసుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. (రౌడీ షీటర్‌పై ఆరు నెలల బహిష్కరణ) -
బయటపడిన రైల్వే ఉద్యోగాల మోసం
సాక్షి, విజయవాడ : రైల్వే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను బోల్తా కొట్టించిన ఓ ముఠా బాగోతం బుధవారం బయటపడింది. ముంబైకి చెందిన మిత్రా, నాగూర్, వరుణ్ యశ్వంత్ సోలంకి విజయవాడ కేంద్రంగా ఈ మోసానికి తెరలేపారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.8 లక్షలకు అమ్ముతామంటూ బేరం పెట్టిన కేటుగాళ్లు.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ఫేక్ ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. ఈ తతంగంపై అనుమానం వచ్చిన చిరంజీవి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇంటర్వ్యూల సందర్భంగా నిరుద్యోగుల నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసేందుకు ముఠా సభ్యులు యత్నించినట్టు తెలిసింది. -
దుర్గ గుడి వద్ద 4 నెలలు ట్రాఫిక్ మళ్లింపు
విజయవాడ: కనకదుర్గ గుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో విజయవాడలో ఈనెల 11వ తేదీ నుంచి సుమారు 4 నెలల పాటు ఘాట్ రోడ్డు నుంచి గొల్లపూడి వైపు వెళ్లే అన్ని వాహనాలను మళ్లిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఆ దారిలో ఎటువంటి వాహనాలను అనుమతించబోమన్నారు. వాహన డ్రైవర్లు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా... 1. గొల్లపూడి, పున్నమిఘాట్, భవానీపురం నుంచి విజయవాడ సిటీలోకి వచ్చే ఇతర వాహనాలు.. ► గొల్లపూడి–కబేళా–సి.వి.ఆర్ ఫ్లైఓవర్ –ఫ్లైఓవర్ మధ్య నుంచి డైవర్షన్ తీసుకుని చిట్టినగర్–కె.ఆర్.మార్కెట్ మీదుగా ప్రయాణించాలి. ► గొల్లపూడి–కబేళా–సి.వి.ఆర్. ఫ్లైఓవర్ మధ్య నుంచి డైవర్షన్ తీసుకుని చిట్టినగర్–ఎర్రకట్ట–బి.ఆర్.టి.ఎస్. రోడ్డు మీదుగా ప్రయాణించాలి. ► గొల్లపూడి–కబేళా–సి.వి.ఆర్., ఫ్లైఓవర్ – పైపుల రోడ్డు–ఆంధ్రప్రభ కాలనీ–ఎ.యస్. నగర్ ఫ్లైఓవర్ –బుడమేరు–మీదుగా ప్రయాణించాలి. 2. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి గొల్లపూడి వైపు వెళ్లే ఇతర వాహనాలు .. ► పోలీస్ కంట్రోల్ రూమ్–కె.ఆర్. మార్కెట్–చిట్టినగర్–సితార–గొల్లపూడి మీదుగా ప్రయాణించాలి. ► ఏలూరు రోడ్డు–బుడమేరు–ఎ.ఎస్.నగర్ ప్లై ఓవర్–ఆంధ్రప్రభ కాలనీ–వై.వి. రావు ఎస్టేట్–గొల్లపూడి మీదుగా రాకపోకలు సాగించాలి. 3. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు.... ► హైదరాబాద్–ఇబ్రహీంపట్నం–మైలవరం– నూజివీడు–హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నంకు మళ్లింపు. 4. ఏలూరు నుంచి హైదరాబాద్ వైపు.. ► హనుమాన్ జంక్షన్–నూజివీడు–మైలవరం– ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్‌కు మళ్లింపు. 5. హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు... ► హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే భారీ వాహనాలు, లారీలు, బస్సులు–ఇబ్రహీంపట్నం– జి.కొండూరు–కందులపాడు క్రాస్ రోడ్డు– కొత్తూరు తాడేపల్లి–జక్కంపూడి లేఅవుట్– పాము ల కాలువ– వై.వి.రావు ఎస్టేట్ – రామవరప్పాడు రింగ్–బెంజ్‌సర్కిల్– వారధి మీదుగా ప్రయాణించాలి. 6. గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు.. ► గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు, లారీలు, బస్సులు వారధి–బెంజ్ సర్కిల్–రామవరప్పాడురింగ్–వై.వి.రావు ఎస్టేట్– పాముల కాలువ–జక్కంపూడి లేఅవుట్ కొత్తూరు తాడేపల్లి–కందులపాడు క్రాస్ రోడ్డు–జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా ప్రయాణించాలి. భారీ వాహనాలు, వాహనాల డ్రైవర్లకు సూచన... ► హైదరాబాద్ నుంచి చైన్నై వెళ్లే భారీ వాహనాలు, లారీలు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున నార్కట్‌పల్లి–మిర్యాలగూడ–పిడుగురాళ్ల–సత్తెనపల్లి మీదుగా ప్రయాణించాలి. ► చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే భారీవాహనాలు, లారీలు ఒంగోలు–మేదరమెట్ల–అద్దంకి–పిడుగురాళ్ల–మిర్యాలగూడ–నల్లగొండ– నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి. ► విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు, లారీలు దేవరపల్లి–సత్తుపల్లి – తల్లాడ–ఖమ్మం–సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. ► విశాఖపట్నం నుంచి చెన్నైకు వెళ్లే భారీ వాహనాలు, లారీలు హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ–పామర్రు–చల్లపల్లి–అవనిగడ్డ–బాపట్ల–ఒంగోలు మీదుగా చెన్నైకు వెళ్లాలి. -
లూప్లైన్లోనే మెట్రో
⇒ రైలు కోసం అధికారుల అగచాట్లు! ⇒ భూసేకరణ ప్రారంభమే కాలేదు ⇒ విదేశీ నిధులు మంజూరు చేయలేదు ⇒ టెండర్లే అసలు ఖరారు కాలేదు ⇒ అయినా ప్రత్యామ్నాయ రోడ్ల కోసం చర్యలు సాక్షి, విజయవాడ : విజయవాడ నగరంలో మెట్రో రైలును పట్టాలు ఎక్కించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ)ప్రాజెక్టు అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా... అడ్డం కులు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో ఒకేసారి మెట్రో ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే నగర వాసులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై కలెక్టర్ బాబు.ఎ కసరత్తు ప్రారంభించారు. దీని కోసం అవసరమైన పనులను చేపట్టాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వాస్తవంగా పరిశీలిస్తే అధికారులు చేస్తున్న హడావుడికి, ప్రాజెక్టు ముందుకు సాగుతున్న తీరుకు ఏ మాత్రం పొంతన కనపడటం లేదు. ప్రాజెక్టు అమలుకు కావాల్సిన అడ్డంకులను తొలగించుకోకుండా అధికారులు హడావుడి చేయడం సరికాదని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ సంస్థలు నిధుల కోసం ఎదురు చూపులు ఏఎంఆర్‌సీ ప్రాజెక్టు ఎంతమేరకు లాభదాయకమనే అంశంపై జర్మనీ, ప్రాన్స్ సంస్థలకు అంచనాలు వేస్తున్నాయి. ఇటీవల అధికారులు వచ్చి రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినా నిధులు విడుదలలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో నిధులు రావడంలో జాప్యం జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా పరిపాలన పరమైన అనుమతులు రాలేదు. కేంద్రం తన వాటా నిధులను విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు పూర్తిగా విడుదల కాలేదు. ఈ నేథ్యంలో మెట్రో ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల కోసం అధికారులు ఇంకా వెతుకులాట దశలోనే ఉన్నారు. ఇక ప్రాజెక్టు పనులు చేపట్టడానికి కావాల్సిన టెండర్లు ఖరారు చేయలేదు. ఇప్పటి వరకు కేవలం టెక్నికల్ బిడ్లను మాత్రమే తెరిచారు. ఇంకా ఫైనాన్సియల్ బిడ్ తెరిచి అర్హులైన వారికి టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు కీలకమైన దశలు దాటకుండానే జిల్లా అధికారులు, ఏఎంఆర్‌సీ అధికారులు ప్రాజెక్టు ప్రారంభమైతే ప్రజలు ఇబ్బంది పడకుండా ఏఏ చర్యలు తీసుకోవాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల మీదగా వచ్చే వాహనాలు నగరంలోకి రాకుండా చూసేందుకు ప్రత్నామాయం ఆలోచిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్, చెన్నై వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో అంతర్గత రోడ్లపైన దృష్టి పెట్టారు. వీటి కోసం ప్రస్తుతం ఉన్న వంతెనలు, కల్వర్టులకు మరమ్మతులు చేయడం, కొత్త రోడ్ల నిర్మాణం, అవసరమైన చోట కొత్త సబ్‌వేలు నిర్మించడం వంటి పనులు చేస్తున్నారు. దీని కోసం అన్ని శాఖల అధికారులతోనూ రెవెన్యూ, ఏఎంఆర్‌సీ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. భూసేకరణపై ప్రజల అభ్యంతరాలు ఏలూరు రోడ్డులో భూములు కోల్పోతున్న వారు మెట్రో రైలు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా నష్టమని, ఇందులో పెట్టుబడులు పెడితే తిరిగి రావడం అసాధ్యమని కొంతమంది బాధితులు మెట్రో ప్రాజెక్టుకు రుణాలు ఇవ్వనున్న జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన రుణ సంస్థలకు లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు డిజైన్లు మార్చాలంటూ నిబంధనలు పెట్టాలని రుణ సంస్థలకు సూచిం చారు. బీఆర్టీఎస్ రోడ్డు, కాలువలపైన మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని సూచిం చారు. ఇదే ప్రతిపాదనలపై జర్మనీ, ఫ్రాన్స్ సంస్థలు ఏఎంఆర్‌సీ వివరణ కోరాయి. డిజైన్లు మార్చడంలో గల ఇబ్బందులను ఏఎంఆర్‌సీ అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాధితుల నుంచి వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భూ సేకరణకు రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకూ నోటిఫికేషన్ ఇవ్వలేదు. -
ఆపరేషన్ ట్రాఫిక్
విజయవాడలో భారీగా పెరిగిన వాహనాల రాకపోకలు సమస్య పరిష్కారానికి ఉపక్రమించిన ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక బస్ బేలు, సలహా మండలి ఏర్పాటుకు నిర్ణయం రోజురోజుకూ విజయవాడ నగరంలో తీవ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో కంటే నగరం మీదుగా ప్రయాణించే వాహనాల సంఖ్య పెరిగినా రోడ్లు విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిసారించారు. ట్రాఫిక్ సలహా మండలి ఏర్పాటు, ప్రత్యేక బస్‌బేలు, ప్రత్యామ్నాయ మార్గాలకు వాహనాల మళ్లింపు వంటి చర్యలకు ఉపక్రమించారు. అమరావతి: విజయవాడ నగర రోడ్లపై 2014కు ముందు వరకు బస్సులు, లారీలు, కార్లు కలిపి రోజుకు 12 వేల వరకు ప్రయాణించేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 20 వేలకుపైగా చేరింది. వాటిలో 8 వేల వాహనాల వరకు ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు వస్తున్నవే. 2014కు ముందు నగరంలో ద్విచక్ర వాహనాలు రోజుకు 15 వేలవరకు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 30 వేలు దాటింది. వాటిలో దాదాపు 25 వేల వాహనాలు కృష్ణా జిల్లాకు చెందినవే. రోడ్లను విస్తరించకపోవడంతో ప్రయాణమంటేనే నరకప్రాయంగా మారుతోంది. ఈ ఏడాది ఆగస్టునాటికి నగరంలో జరిగిన 1,083 రోడ్డు ప్రమాదాల్లో 254 మంది దుర్మరణం చెందగా 1,118 మంది గాయపడ్డారు. 2015లో 1,644 రోడ్డు ప్రమాదాల్లో 379 మంది మృత్యువాత పడ్డారు. 1,548మంది గాయపడ్డారు. ట్రాఫిక్ పోలీసుల కార్యాచరణ ట్రాఫిక్ సమస్య పరిష్కారం దిశగా పోలీసులు కార్యాచరణకు ఉపక్రమిం చారు. ప్రత్యమ్నాయ మార్గాలు, ప్రత్యేక ‘బే’లు ఏర్పాటు దిశగా కసరత్తు చేపట్టారు. ట్రాఫిక్ సలహామండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ వెళ్లే బస్సులు, భారీ వాహనాలు ప్రస్తుతం వైవీరావు ఎస్టేట్, సీవీఆర్ ఫై ్లఓవర్, సితార జంక్షన్, గొల్లపూడి మీదుగా వెళ్తున్నాయి. ప్రత్యమ్నాయంగా జి.కొండూరు, కొండపల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లించాలని భావిస్తున్నారు. దశలవారీగా వాహనాలను అ మార్గంలోకి మళ్లించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్లాల్సిన భారీ వాహనాలు విజయవాడలోకి ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గంపై కసరత్తు చేస్తున్నారు. ఇటీవల గొల్లపూడి నుంచి ఇన్నర్‌రింగ్ రోడ్డు మీదుగా రామవరప్పాడు జంక్షన్‌కు వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీంతో రామవరప్పాడు, ప్రసాదంపాడు, గన్నవరం మార్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. అందుకే వాహనాలను ఇబ్రహీంపట్నం, ముస్తాబాద, కేసరపల్లి మీదుగా మళ్లించాలని భావిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయ మార్గంపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం మీదుగా హనుమాన్ జంక్షన్‌కు వాహనాలను మళ్లించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రోడ్లకు అధిక వాహనాల ట్రాఫిక్‌ను తట్టుకునేంత సామర్థ్యం లేదు. రోడ్ల విస్తరణతోపాటు, కొత్తవి నిర్మించాలని ప్రభుత్వానికి ట్రాఫిక్ పోలీసులు ప్రతిపాదించారు. అంతవరకు దశలవారీగా వాహనాలను ఆ మార్గాల్లో మళ్లించాలని భావిస్తున్నారు. లారీ యజమానులతో సమావేశం నిర్వహించి వారి సూచనలను కూడా తీసుకోనున్నారు. ‘బస్ బే - ఆటో బే’ల ఏర్పాటు విజయవాడలో సిటీ బస్సుల నిలుపుదల కోసం ప్రత్యేకంగా ‘బస్ బే’లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ అధికారులు సర్వే నిర్వహించి నగరంలో 10 ప్రాంతాలను గుర్తించారు. ఆటోలు నిలిపేందుకు ప్రత్యేకంగా ఆటో బేలు ఏర్పాటు చేయనున్నారు. వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని నగరమంతా విస్తరి స్తారు. నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. రాత్రి వేళల్లో తనిఖీలు ముమ్మరం చేసి 252 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ‘రాజధాని స్థాయికి తగ్గట్లుగా విజయవాడ ట్రాఫిక్ నియంత్రణకు అత్యున్నత ప్రమాణాలు అమలు చేయాలని నిర్ణయించాం. ఎస్పీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా శాస్త్రీయంగా చర్యలు చేపడతాం. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విజయవాడను ట్రాఫిక్ సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’ - టి. క్రాంతిరాణా, డీసీపీ (ట్రాఫిక్) ట్రాఫిక్ సలహామండలి మెట్రోపాలిటన్ నగరాల మాదిరిగా విజయవాడ కోసం ట్రాఫిక్ సలహా మండలిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్(ఎస్పీఏ) ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు శాస్త్రీయ విధానాలను రూపొందిస్తారు. ఈ సల హామండలిలో ఎస్పీఏ ప్రతినిధులతోపాటు ట్రాఫిక్ పోలీసు,సీఆర్డీఏ, కార్పొరేషన్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఎస్పీఏ సర్వే నిర్వహించి ప్రణాళికను రూపొందిస్తుంది. -
బెజవాడ రెస్టారెంట్లలో సీటీవోల తనిఖీలు
విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖాధికారులు గురువారం నగరంలోని 15 రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. విజయవాడ రాజధానిగా మారినప్పటికీ రెస్టారెంట్ల నుంచి పన్నుల రాబడి పెరగకపోవడంతోపాటు పుష్కరాల సందర్భంగా ఆశించిన రాబడి రాకపోవడంతో ఆగ్రహించిన ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు సీటీవో స్థాయి అధికారుల్ని 15 బృందాలుగా ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించారు. బందరురోడ్డు, ఏలూరురోడ్డు, మొగల్రాజపురంలోని రెస్టారెంట్లతో పాటు రెండు మూడు బ్రాంచీలు కలిగిన రెస్టారెంట్లపైన అధికారులు దృష్టిసారించినట్లు తెలిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనిఖీలు జరిగాయి. పుష్కరాల్లో అంత సీన్ లేదు పుష్కరాల సందర్భంగా రెస్టారెంట్లలో ఆశించిన స్థాయిలో వ్యాపారం సాగలేదని నిర్వాహకులు చెబుతున్నారు. పుష్కరాల రోజుల్లో అక్షయప్రాత, టీటీడీ, దుర్గగుడి వంటి ధార్మిక సంస్థలు పెద్దఎత్తున అన్నదాన ప్రసాదాలు వితరణ చేశాయని, అనేక స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేయడంతో కొన్ని రెస్టారెంట్లు సాధారణ రోజుల్లో కంటే తక్కువ వ్యాపారాలు చేసినట్లు తెలిసింది. అందువల్లనే పన్నులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ కట్టలేదు. ఇదిలా ఉండగా అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న ఒకటి, రెండు రెస్టారెంట్ల జోలికి అధికారులు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
మావాడే ఉండాలి!
సీఐల బదిలీలపై టీడీపీ నేతల పెత్తనం పోస్టింగుల పేరిట భారీ వసూళ్లు విజయవాడ నగరంలో ఇదీ పరిస్థితి ‘పోలీస్‌స్టేషన్‌లో నా మాటే చెల్లుబాటు కావడం లేదు. నా వ్యతిరేకులపై ఏవో కేసులు పెట్టమంటే రూల్స్ మాట్లాడుతున్నారు. ఇందుకేనా నేను అధికార పార్టీలోకి వచ్చింది. వెంటనే అక్కడ సీఐని మార్చండి. నా మనిషిని వేయండి’ - నగరంలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి హుకుం. అమరావతి : విజయవాడలో ప్రస్తుత పరిస్థితికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. అక్రమార్జనకు నగరాన్ని ప్రధాన వనరుగా మలచుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు శాఖపై నియంత్రణ కోసం పట్టుబడుతున్నారు. తమ అభీష్టం మేరకే సీఐల బదిలీలు జరపాలని తేల్చి చెబుతున్నారు. తమపట్ల రాజకీయ విధేయతతోపాటు సీటుకు తగిన రేటు నిర్ణయించి సొమ్ము చేసుకుంటున్నారు. పోస్టింగులను అంగడి సరుకుగా మార్చేస్తున్న అధికార పార్టీ నేతల యవ్వారం ఇదిగో ఇలా ఉంది... ప్రక్షాళనా!... రాజకీయ పెత్తనమా! రాజధానిగా రూపాంతరం చెందిన నగరంలో పోలీస్ వ్యవస్థ పటిష్టతకు ఉన్నతాధికారులు కొన్ని నెలల క్రితం కార్యాచరణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది సీఐలను వీఆర్‌కు పంపించడం రాజకీయంగా సంచలనం కలిగించింది. పుష్కరాలు ముగియడంతో ఆ అంశంపై మళ్లీ దృష్టి సారించారు. ఆరు నుంచి ఎనిమిది మంది పనితీరు బాగోలేదని గుర్తించారు. శాంతిభద్రతల కోణంలో కీలకమైన నగరంలోని రెండు నియోజకవర్గాల్లో సీఐల పనితీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఉత్సవాల పేరిట వసూళ్ల దందాకు ఓ అధికారి ఓ ప్రజాప్రతినిధికి వత్తాసు పలికారు. పారిశ్రామిక ప్రాంతంలో ఓ అధికారి ప్రజాప్రతినిధికి ఏజెంట్‌గా మారిపోయారు. ఇక శివారులోని రెండు నియోజకవర్గాల్లో కూడా కొందరు అధికారులు సివిల్ వివాదాల్లో అత్యుత్సాహం చూపిస్తున్నారు. ట్రాక్ రికార్డే ప్రాతిపదికగా చురుకైన అధికారులను నియమించాలని భావిస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. అదేం కుదరదు... మా వాళ్లను నియమించాల్సిందే ... ‘అంతా ఉన్నతాధికారుల ఇష్ట ప్రకారం చేస్తామంటే కుదరనే కుదరదు. ట్రాక్ రికార్డు, పనితీరు అంటూ ఏవేవో చెప్పొద్దు’అని టీడీపీ నేతలు తేల్చిచెప్పారు. ఏకంగా సీఎం కార్యాలయం వద్ద పంచాయితీ పెట్టినట్లు సమాచారం. తాము సూచిస్తున్న అధికారుల పేర్లతో ఓ జాబితాను కూడా సీఎం కార్యాలయ అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఐల పోస్టింగులకు ఏకంగా సీఎం కార్యాలయ స్థాయిలో పైరవీలు చేస్తుండడం పట్ల పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో సీఐ పోస్టింగుకు ప్రజాప్రతినిధులు రూ.కోటి చొప్పున వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అదే రూరల్ పరిధిలో అయితే దాదాపు రూ.60 లక్షలు డిమాండ్ చేస్తున్నారని పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం టీడీపీ నేతలు పట్టుబడుతున్న కొన్ని పోస్టింగులు ఇవీ... భూ దందాలకు పేరుబడ్డ శివారు నియోజకవర్గంలోని పోస్టింగులపై అక్కడ ప్రజాప్రతినిధి పట్టుదలకు పోతున్నారు. తన మాటకంటే గతంలో ప్రజాప్రతినిధిగా చేసిన టీడీపీ నేత మాటే చెల్లుబాటు అవుతోందని మండిపడుతున్నారు. తాను చెప్పిన అధికారికి పోస్టింగు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నగరంలోని ఓ కీలక నేత మళ్లీ టీడీపీలో చేరారో లేదో పంచాయితీలు మొదలయ్యాయి. 30 ఏళ్ల క్రితం తమ రాజకీయ ఎదుగుదలకు కేంద్రస్థానమైన చోటే మళ్లీ పాగా వేయాలని భావిస్తున్నారు. అందుకు తాము సూచించిన అధికారిని నియమించాలని పట్టుబడుతున్నారు. నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో వైట్‌కాలర్ దందాలపై ఓ ప్రజాప్రతినిధి కన్నేశారు. అందుకోసం అక్కడ తన మనిషే ఉండాలని కరాఖండీగా చెబుతున్నారు. రెండోసారి ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక నేత వ్యాపార వర్గాలను తన ఆదాయ వనరుగా మార్చుకునేందుకు పోలీసులను వాడుకోవాలని భావిస్తున్నారు. ఈ పరిణామాలతో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయభేదాల అంశం ప్రస్తుతం సీఎం కార్యాలయానికి చేరింది. -
పుష్కరాల ట్రాఫిక్ నియంత్రణకు 3300 మంది
విజయవాడ : పుష్కరాల ట్రాఫిక్ నియంత్రణకు 3,300 మంది సిబ్బందిని నియమించినట్లు డీఐజీ శ్రీకాంత్ వెల్లడించారు. శనివారం విజయవాడలో డీఐజీ శ్రీకాంత్ మాట్లాడుతూ... విజయవాడ నగరాన్ని 19 జోన్లు, 70 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. 276 ఎకరాల్లో 122 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అటు నెహ్రు బస్టాండ్ నుంచి కుమ్మరపాలెం వరకు.... ఇటు ప్రకాశం బ్యారేజీ నుంచి వన్‌టౌన్‌లోని అప్పారావు కూల్ డ్రింక్ షాప్ వరకు నో వెహికిల్ జోన్‌గా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజీపైనా వాహనాలతోపాటు భక్తులకు కూడా అనుమతి లేదని డీఐజీ శ్రీకాంత్ స్పష్టం చేశారు. -
బెజవాడలో వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆందోళన : అరెస్ట్
విజయవాడ : విజయవాడలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్ భవకుమార్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళనకు దిగారు. దీంతో పోలీసుల వారి ఆందోళనను భగ్నం చేశారు. భవకుమార్తోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పడమట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లో వారిని వంగవీటి రాధా పరామర్శించారు. -
అమ్మో...అయ్యో..!
జిల్లాలో అధికారులు ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. మలేరియా, డెంగీ జ్వరాలు సవాల్ విసురుతున్నా అధికారగణం చేష్టలుడిగి చూస్తోంది. ఫలితంగా జిల్లాలో జ్వరాల దెబ్బకు ప్రజలు అల్లాడుతున్నారు. పుష్కర పనులపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపకపోవడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ (లబ్బీపేట) : విజయవాడ నగరంతో పాటు జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అధిక శాతం మంది జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. జ్వరం కుటుంబంలో ఒకరికి వస్తే, మిగిలిన సభ్యులకు కూడా సోకడంతో ఇంటిలోని వారంతా బాధపడుతున్నారు. విజయవాడ పటమట, సింగనగర్, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. జ్వరాలు రెండు రోజులు ఉండి తగ్గిపోతాయని, ప్రమాదకరం కాదని వైద్యులు చెపుతున్నా, బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మలేరియాతోపాటు, డెంగీ పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నట్లు చెపుతున్నారు. జక్కంపూడి, కైకలూరుల్లో విజృంభించిన జ్వరాలు .... నగరంలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ, జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో వారం రోజులుగా జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. వందలాది మంది జ్వరంతో బాధపడుతున్నారు. జక్కంపూడిలో మలేరియా శాఖ ప్రత్యేక శిబిరం నిర్వహించగా, కైకలూరులో బుధవారం ప్రత్యేక క్యాంపు నిర్వహించి వందమందికిపైగా పరీక్షలు చేసినట్లు చెపుతున్నారు. పరిసరాల్లో మురుగు నీరు కారణంగా దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు సోకుతున్నట్లు చెపుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో పెరుగుతున్న ఓపీ ... విజయవాడ ప్రభుత్వాస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగానికి సాధారణ రోజుల్లో 80 నుంచి 100 మంది వరకు రోగులు వస్తుంటారు. ప్రస్తుతం జ్వరాల కారణంగా 150 మందికిపైగా వస్తున్నట్లు చెపుతున్నారు. పిల్లల విభాగానికి నిత్యం 60 నుంచి 80 మంది వరకు వస్తుంటారని, ప్రస్తుతం వంద మందికిపైగా వస్తున్నట్లు చెపుతున్నారు. పిల్లల్లో ఎక్కువ మంది వైరల్ జ్వరాల కారణంగా వస్తున్నట్టు చెపుతున్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులకు సైతం పెద్ద సంఖ్యలో జ్వరబాధితులు వైద్యపరీక్షల కోసం క్యూ కడుతున్నారు. కార్పొరేట్‌కు వెళితే జేబులు ఖాళీ ... జ్వరాలతో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళితే వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. వైరల్ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ బాలుడికి రూ.1.50 లక్షలు వైద్య ఖర్చులు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇదిలావుంటే, జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నా నివారణ చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైనట్లు తెలుస్తోంది. పుష్కర పనులపైనే అధికారులు దృష్టిసారించి జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాం ... జిల్లాలో జ్వరాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాం. జక్కంపూడిలో మూడు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించి 40 మంది నుంచి రక్త నమూనాలు సేకరించాం. ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. తిరువూరు కూడా వెళ్లి పరిశీలించాం. కైకలూరులో ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇళ్ల చుట్టూ నీరు, పారిశుధ్య సమస్యలు ఉన్న ప్రాంతాల్లో జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. - ఆదినారాయణ, కృష్ణా జిల్లా మలేరియా ఆధికారి -
నడిరోడ్డుపై వాహనంలో మంటలు
విజయవాడ : విజయవాడ నగరంలోని రహదారులకు మార్కింగ్ చేస్తున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనం మొత్తం కాలిపోయింది. మంగళవారం ఉదయం ఐదో నెంబర్ రహదారి సమీపంలోని రమేష్ ఆస్పత్రి వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రహదారిపై మార్కింగ్ చేస్తున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాహనంలో పెద్ద ఎత్తున పెయింట్స్ డబ్బాలు ఉండటంతో మంటలు వేగంగా వాహనాన్ని చుట్టుముట్టాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకునే సరికే వాహనం కాలిపోయింది. -
బెజవాడలో భారీ వర్షం: వీధులన్నీ జలమయం
విజయవాడ : విజయవాడ నగరంలో శనివారం భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని రహదారులన్నీ నీటమునిగాయి. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి భారీ వర్షం ప్రారంభం కాగా, ఆ తర్వాత వర్షం ఉధృతి తగ్గినప్పటికీ మధ్యాహ్నం వరకూ వర్షం కురుస్తూనే ఉంది. వన్‌టౌన్‌లోని పలు ప్రాంతాలు, లోబ్రిడ్జి, పోరంకి, మొగల్రాజపురం, మధుచౌక్, జమ్మిచెట్టు సెంటర్ తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ నీటమునిగాయి. దీంతో నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
దందాలు అక్కడ షరా మామూలే
తూర్పు పోలీస్ జోన్ తీరు ఇదీ. గ్రామాలవారీగా పేకాట శిబిరాలకు కాసుల వాన ప్రతి స్టేషన్లోనూ నెలకు రూ. లక్షల్లో వసూళ్లు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే.. విజయవాడ : గుట్కా, లిక్కర్ సిండికేట్ల నుంచి నెలనెలా లక్షల్లో మామూళ్లు, గ్రామాల వారీగా వీరి కనుసన్నల్లో అధికార పార్టీ ముసుగులో పేకాట శిబిరాలు, ఇక కాల్‌మనీ కేసులు వస్తే అదనంగా బోనస్ ఆదాయం.. ఇదీ విజ యవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తూర్పు పోలీస్ జోన్లో ఉన్న స్టేషన్ల పరిస్థితి. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో అతి పెద్ద జోన్ ఇది. వారం క్రితం వరకు ఏడు పోలీస్ స్టేషన్లు, సీఐలు ఉండేవారు. జోన్ల పునర్విభజనతో ఇప్పుడు మూడు స్టేషన్లుగా మారి ముగ్గురు సీఐలు ఉన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉండడం ఈ జోన్‌కు కలిసొచ్చే అంశం. దీంతో అక్కడి పోలీ సులు అధికార పార్టీ పేరుతో హడావుడి చేస్తూ.. అడ్డగోలు పంచాయితీలు సాగిస్తూ భారీగా కాసులు కొల్లగొడుతున్నారు. ఫిర్యాదు వస్తే చాలు దాన్ని కాసులుగా ఎలా మలుచుకోవాలో బాగా తెలిసిన సిద్ధహస్తులు అక్కడి అధికారులు. తూర్పు జోన్లో కంకిపాడు, గన్నవరం, ఉయ్యూరు సర్కిళ్లు ఉన్నాయి. అరెస్ట్‌లపై నిషేధం కమిషనరేట్ పరిధిలోని ఓ సీఐకు నెలకు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఆదాయం వస్తుందని సమాచారం. వారంలో ఒకటి, రెండు గుట్కా రాకెట్ కేసులు పట్టుకుంటారు. ఎఫ్ఐఆర్ నమోదవుతుంది కానీ గుట్కా విక్రేతల అరెస్ట్లుండవు. ఇక్కడి స్టేషన్లలో గుట్కాలపై కాదు గుట్కా కేసులపై నిషేధం ఉందనేది పోలీసు వర్గాల్లో ఉన్న ప్రచారం. అవినీతి తారస్థాయికి చేరడంతో ఈ స్టేషన్ సీఐను గత వారం బదిలీ చేశారు. గొడవర్రు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మద్దూరు, చోడవరం, రొయ్యూరు, నెప్పల్లిల్లో భారీగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నాడు. రోజూ రూ.లక్షల్లో ఆడతారు. ఈ క్రమంలో సదరు పేకాట నిర్వాహకుడితో సీఐకి మంచి పరిచయాలు ఉండడంతో అతడు నెలవారీ రూ. లక్షకు పోలీసులనుసెట్ చేసుకున్నాడు. గడిచిన నాలుగు నెలల్లో ఇక్కడ పేకాట భారీ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. లిక్కర్ సిం డికేట్ నుంచి నెలకు రూ.లక్ష మామూళ్లు వస్తాయని తెలిసింది. రెండు నెలల కిందట ఇద్దరు విద్యార్థులు ప్రేమ నేపథ్యంలో ఇంటి నుంచి పారిపోయారు. సీఐ పారిపోయిన విద్యార్థుల స్నేహితులను స్టేషన్‌కు తీసుకువచ్చి రెండు రోజులు హడావుడి చేశారు. చివరకు కేసును రాజీచేసి రూ.4 లక్షలు నొక్కేశారు. ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే. కాల్ మనీలో వాటాలు మరో సర్కిల్లోని పోలీసులు పూర్తిగా అధికార పార్టీ ఎమ్మెల్యే ముసుగులో ఉంటారు. ప్రతి పనికి ఎమ్మెల్యే సిఫారసు ఉండాలి. ఆయన చెబితే ఎలాంటి కేసు అయినా సెటిల్ చేస్తారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కేసు వస్తే జాగ్రత్తగా పరిశీలించి డబ్బు దండుకుంటారు. బుద్ధవరం, అల్లాపురం, కేసరపల్లి గ్రామాల్లో అధికార పార్టీ నేతల ముసగులో పేకాట శిబి రాలు నిర్వహిస్తున్నారు. శిబిరాల నుంచి నెల వారీ రూ. క్షపైనే సీఐకి వాటా అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. మూడు నెలల కిందట కాల్‌మనీ కేసుల హడావుడి సమయంలో సర్కిల్ పరిధిలో సుమారు 20 మంది కాల్‌మనీ వ్యాపారులను స్టేషన్‌కు రప్పించి నలుగురిపై మాత్రమే కేసులు కట్టారు. వారి నుంచి నామమాత్రంగా స్టేషన్ ఖర్చుల పేరుతో వసూలు చేశారు. మిగిలిన వారి వద్ద రూ.20 వేల నుంచి రూ.50 వేల లోపు వసూలుచేసినట్లు ఆరోపణలున్నాయి. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లో భారీగా దండుకుంటారు. మేడమ్ పవర్ఫుల్.. ఇక్కడ సారే కాదు మేడమ్ కూడా పవర్‌ఫుల్లే అనే పేరుంది. కొన్ని కేసుల్ని మేడమ్ ప్రత్యేకంగా డీల్ చేసి సెటిల్ చేస్తుంటారనే ప్రచారం పోలీసు వర్గాల్లో జరుగుతోంది. సార్ స్టేషన్ పరిధిలోని నెలావారీ మామూళ్లతో పాటు కేసుల్ని డీల్ చేస్తుంటే మేడమ్ వారి బంధువులు, ఇతర సిఫారసులతో వచ్చిన కేసుల్ని సార్ దృష్టికి తీసుకెళ్లి సెటిల్ చేస్తారు. ముఖ్యం గా ఎమ్మెల్యేకు సదరు సీఐ అత్యంత సన్నిహితులు కావడం కలిసొచ్చే అంశం. స్టేషన్ పరి ధిలో గండిగుంట, చినఓగిరాల, ముద్దునూరు, కాటూరు, ఆకునూరులో ఇళ్లలోనే పేకాట శిబి రాలు పోలీసుల కనుసన్నల్లో సాగుతున్నాయి. వీరి నుంచి నెలకు రూ.లక్ష మామూళ్లు ముడతాయని వినికిడి. వీటి వసూళ్లకు ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రత్యేకంగా విధుల్లో ఉంటారు. లిక్కర్ సిండికేట్ నుంచి నెలకు రూ.లక్ష మామూలు వస్తుందట. గతంలో సదరు సీఐ బదిలీకి రంగం సిద్ధంవగా స్థానిక ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి రావడంతో వాయిదా పడింది. -
పేరుకి పెద్దే.. సెటిల్మెంట్ల గద్దె
పశ్చిమలో పొలిటికల్ పోలీస్ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో విధులు రాజకీయ సిఫార్సులతోనే కేసుల నమోదు తోటి సీఐకే న్యాయం చేయలేని అధికారి ఒకరు ఇద్దరు నేతల ముద్దుల సీఐ మరొకరు గుట్కా మామూళ్ల కారణంగానే మరొక సీఐ బదిలీ విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల అవినీతి, విధినిర్వహణలో అలసత్వం పెరిగిపోయింది. అధికార పార్టీ కనుసన్నల్లో విధులు నిర్వహిస్తూ రాజకీయ సిఫార్సులు ఉంటేనే కేసులు నమోదు చేస్తున్నారు. ప్రైవేటు సెటిల్మెంట్లు, భూ వివాదాలు, ఇసుక రాకెట్‌ను ఆదాయవనరులుగా మార్చుకుని జేబులు నింపుకొంటున్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఓ స్టేషన్ సీఐ టీడీపీకి చెందిన కార్పొరేటర్‌తో కలిసి యథేచ్ఛగా సెటిల్మెంట్లు చేయగా, మరో సీఐ తోటి సీఐ ఆస్తి ఆక్రమణకు గురైనా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరుగురు సీఐలను పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇటీవల సరెండర్ చేసిన నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని వెస్ట్, సెంట్రల్, ఈస్ట్ జోన్లలోని స్టేషన్ల బాగోతంపై నేటి నుంచి వరుస కథనాలు... విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో అధిక ప్రాధాన్యం ఉన్న జోన్ వెస్ట్‌జోన్. రాష్ట్రంలోనే అతి పెద్ద రెండో దేవస్థానంగా పేరుగాంచిన కనకదుర్గమ్మ ఆలయం, దేశంలోనే ఖ్యాతి గాంచిన ఎన్టీటీపీఎస్, పెద్ద సంఖ్యలో ఆయల్ కార్పొరేషన్లు ఈ జోన్ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ సైబర్ నేరాలు, చీటింగ్ కేసులు, కాల్‌మనీ -సెక్స్ రాకెట్ కేసులు, హత్యలు తక్కువ. సివిల్ సెటిల్మెంట్లు, వ్యాపారుల మధ్య వివాదాలు, ఆత్మహత్య కేసులు అధికం. కొద్ది నెలల్లో ప్రారంభంకానున్న కృష్ణా పుష్కరాలకు కీలకంగా ఉండే పశ్చిమ జోన్లో పోలీసులపై అధికారపార్టీ పెత్తనం అధికమైంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పొలీస్ స్టేషన్ల వ్యవహారాలు నడుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైసర్గికంగా పెద్దది. విజయవాడ వన్‌టౌన్, టూటౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లు ఈజోన్ పరిధిలో ఉన్నాయి. వీటిలో ఒక్కొక స్టేషన్లో ఒక్కొక్క రకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రతి కేసులో తీవ్రస్థాయిలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉండటంతో తోటి పోలీసుల వ్యక్తిగత కేసుల్లో కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఆరుగురు సీఐలను సీపీ గౌతమ్‌సవాంగ్ ఏలూరు రేంజ్‌కు సరెండర్ చేశారు. వారి పనితీరు బాగోలేకపోవడం, అవినీతి ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వారి స్థానంలో నియమించేందుకుసమర్థుల కోసం సీపీ అన్వేషిస్తున్నారని సమాచారం. ఈక్రమంలో స్టేషన్ల వారీగా ఆయన దృష్టిసారించారు. పశ్చిమ జోన్లో ఒక్కొక్క సీఐది ఒక్కో తీరు. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల ముద్దుల సీఐ కొండ దిగువ ప్రాంతంలో ఉన్న ఒక అధికారి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ముద్దుల సీఐగా పేరుపొందారు. స్టేషన్లో ఏపని జరగాలన్నా ఆ ఇద్దరి నేతల్లో ఒకరి సిఫార్సు తప్పనిసరి. ఏ ఇబ్బందీ లేకుండా నాలుగు రూపాయలు సంపాదించడమే అతని లక్ష్యమన్న విమర్శలు ఉన్నాయి. ఏడాదిన్నరగా ఆ సీఐ అక్కడే కొనసాగుతుండటంతో ఎక్కువ పరిచయాలు పెరిగి, బాగా సంపాదిస్తున్నారనే ఆరోపణ ఉంది. సెటిల్మెంట్ల అడ్డా కొండ వెనుక వైపు ఉన్న మరో స్టేషన్ అక్రమాలు, మామూళ్లకు అడ్డగా మారిందనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా గుట్కా సిండికేట్ల నుంచి నెలనెలా రూ.లక్షల్లో వసూలు చేస్తున్న స్టేషన్‌గా పేరు గాంచింది. అధికార పార్టీ అమాత్యునితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి సిఫార్సుకు ఒక చోటా నేతను పంపుతుంటారు. ఆ చోటా నేతలు నిత్యం ఇక్కడ పంచాయితీలు చేస్తూ కనిపిస్తారు. ఇక్కడ ఫిర్యాదు కన్నా సెటిల్మెంట్లే ఎక్కువ. తోటి సీఐకే న్యాయం చేయలేని అధికారి కమిషనరేట్‌లో పరిధిలో ఒక సీఐ ఇంటిని కొందరు ఆక్రమించారు. వారు ఖాళీ చేయకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారని బాధిత సీఐ ఒకరు వెస్ట్ జోన్‌లోని సంబంధిత స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఆ స్టేషన్లో న్యాయం జరగలేదు. కారణం అధికారపార్టీ సిఫార్సులతో నిత్యం బిజీగా ఉంటూ నాలుగు రూపాయలు వెనకేసుకోవడం ఇక్కడ వారికి అలవాటు. ఆయన సమర్థుడు కారని పోలీసుల్లో ప్రచారం ఉన్నా రాజకీయ పరిచయాలతో ఆ పోస్టులో కొనసాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. హడావుడి ఎక్కువగా.... కమిషనరేట్ పరిధిలోని మరో స్టేషన్ అధికారి బాగా హడావుడిగా ఉంటారు. స్థానికంగా అమాత్యుని కనుసన్నల్లో ఉంటూ ముగ్గరు చోటా నేతల సిఫార్సులతో కేసులు నడిపిస్తుంటారు. గంజాయి కేసుల్లో ప్రతిభ చూపిన సదరు అధికారి మిగితా విషయాల్లో అంతసీరియస్గా ఉండరనేది పోలీసుల అభిప్రాయం. -
కారు - లారీ ఢీ: 20 మందికి గాయాలు
విజయవాడ : నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయాపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే బెంజి సర్కిల్ సమీపంలో బైక్‌పైకి ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.... మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.20 లక్షలు అప్పిచ్చి ఎకరం పొలం లాగేశారు
రూ.20 లక్షలు అప్పిచ్చి ఎకరం పొలం కాజేశారు కలర్ జిరాక్సులతో మోసం రియల్టర్ల మాయాజాలం ఆందోళనతో అనారోగ్యం పాలైన బాధితుడు విజయవాడ : విజయవాడ నగరంలో కాల్‌మనీ వ్యాపారుల మోసాలు రకరకాలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈసారి రియల్టర్ల ముసుగులో ఈ మాయాజాలం చోటుచేసుకుంది. వారి మోసానికి బాధితుడు మానసిక రోగిగా మారి మాట్లాడలేని స్థితికి చేరాడు. బాధితుడి భార్య కథనం మేరకు వివరాలివీ.. భవానీపురం గాంధీబొమ్మ రోడ్డులో షేక్ శ్రీను, రసూల్‌బీ దంపతులు నివసిస్తున్నారు. శ్రీను పాల ఫ్యాక్టరీలో ముఠాకూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించేందుకు, చిన్నచిన్న అప్పులు తీర్చేందుకు తన పొలాన్ని తాకట్టు పెట్టాలనుకున్నాడు. భవానీపురం హౌసింగ్‌బోర్డ్ కాలనీలోని సాయి నిర్మాణ్ అపార్ట్మెంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆచంట రాజశేఖర్, చెల్లుబోయిన ఆంజనేయులును కలుసుకున్నారు. 2015 మే 28న పి.నైనవరంలోని తన ఎకరం పొలం తాలూకు డాక్యుమెంట్లను ఇచ్చాడు. దీంతో రాజశేఖర్ తన దగ్గర పనిచేసే చిట్టినగర్‌కు చెందిన నమ్మి శ్రీనివాసరావు పేరుమీద జీపీ (తనఖా రిజిస్ట్రేషన్) చేయించుకుని రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చాడు. వడ్డీ పెరిగిపోతుందని భావించిన శ్రీను మూడు నెలల అనంతరం (ఆగస్టు) మరోచోట ఉన్న పొలం అమ్మి రాజశేఖర్‌కు అసలు, వడ్డీతో కలిపి బాకీ తీర్చేశాడు. అయితే రాజశేఖర్ అతనికి తనఖా పెట్టిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా వాటి కలర్ జిరాక్సులు ఇచ్చి పంపించాడు. అవే ఒరిజినల్ డాక్యుమెంట్లు అనుకుని శ్రీను వాటిని తీసుకుని వెళ్లిపోయాడు. నెలన్నర తర్వాత గుర్తింపు... నెలన్నర తరువాత శ్రీను తన పొలం వద్దకు వెళ్లగా, నీ పొలం అమ్మేశావట గదా.. వాళ్లు ఈ మధ్యే వచ్చి వెళ్లారని చుట్టుపక్కలవాళ్లు అనటంతో కంగుతిన్నాడు. వెంటనే రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఈసీ తీయించగా జీపీ చేయించుకున్న తొమ్మిదో రోజునే చిట్టినగర్‌కు చెందిన కొర్రపాటి శ్యాంప్రసాద్ (చెల్లుబోయిన ఆంజనేయులు బినామీ) పేరుతో 60 సెంట్లు రిజిస్టర్ అయి ఉంది. సెప్టెంబర్ 19న గుంటూరుకు చెందిన కొప్పినేని కోటేశ్వరరావు (రాజశేఖర్ బినామీ) పేరు మీద 40 సెంట్లు రిజిస్టర్ అయి ఉంది. ఇదంతా చూసిన శ్రీను మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలయ్యాడు. దీంతో భార్య ర సూల్బీ తన కుటుంబ సభ్యులతో కలిసి డిసెంబర్లో భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారినుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఈ ఏడాది జనవరి 12న నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్లాట్లుగా అమ్ముకునే యత్నాల్లో రియల్టర్లు... తమ బినామీల పేరుమీద రిజిస్టర్ చేయించుకున్న రాజశేఖర్, ఆంజనేయులు ఇప్పుడు ఆ పొలాన్ని ప్లాట్లుగా గానీ, ఏక మొత్తంగా గానీ అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పొలం కోటి రూపాయలకుపైనే పలుకుతుందని సమాచారం. ఇదెక్కడి న్యాయమని రాజశేఖర్, ఆంజనేయులును ప్రశ్నిస్తే శ్రీను స్నేహితులపై, బంధువులపై కేసులు పెడుతున్నారని శ్రీను బావమరిది హుస్సేన్ తెలిపారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి తమను మోసగించిన వారిపై చర్యలు తీసుకుని తమ పొలం తిరిగి ఇప్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
100 కేజీల గంజాయి పట్టివేత
-
100 కేజీల గంజాయి పట్టివేత
విజయవాడ : విజయవాడ భారతీనగర్ సమీపంలో 100 కేజీల గంజాయిని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. లారీలో గంజాయిని తరలిస్తుండగా పటమట పోలీసులు పట్టుకున్నారు. అయితే శుక్రవారం ఇబ్రహీంపట్నం వద్ద పోలీసుల తనిఖీల్లో మూడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. ఆ క్రమంలో భారతీనగర్‌లో టన్ను గంజాయి నిల్వ ఉన్నట్లు పోలీసులకు నిందితులు చెప్పారు. ఈ సమాచారం మేరకు దాడి చేసేందుకు సదరు ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. కాగా టన్ను గంజాయిని లారీలో అక్కడి నుంచి తరలించే క్రమంలో వారిని పోలీసులు పట్టుకున్నారు. -
బెజవాడలో పైరసీ సీడీల ముఠా గుట్టురట్టు
విజయవాడ : పైరసీ సీడీల ముఠా గుట్టును విజయవాడ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. విజయవాడ వన్‌టౌన్‌లోని కొత్తపేట డ్రెయిన్ వీధిలో పైరసీ సీడీల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 5 వేల పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తాజాగా విడుదలైన జతకలిసే, సౌఖ్యం సినిమాలతోపాటు బెంగాల్ టైగర్, శంకరాభరణం తదితర చిత్రాలకు చెందిన పైరసీ సీడీలు ఉన్నాయి. అలాగే త్వరలో విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన సీడీ కవర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పైరసీ సీడీల నిర్వాహకుడు టి సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
నగరంలో సీఐల బదిలీకి రంగం సిద్ధం
విజయవాడ : కాల్ మనీ వ్యవహారం విజయవాడ నగర పోలీసు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న పలువురు సీఐల బదిలీకి బుధవారం రంగం సిద్ధమైంది. కాల్ మనీ బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అందులో ప్రమేయం ఉన్న పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. సదరు జాబితాతో కూడిన ఫైల్‌ను అనుమతి కోసం పోలీసు కమిషనర్‌కి పంపారు. మరికాసేపట్లో ఆ ఫైల్‌పై సంతకం చేసి... ఆ వెంటనే ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని తెలిసింది. కాల్ మనీ వ్యాపారులకు సహకరించి.. తమను వేధింపులకు గురి చేశారని బాధితులు నగర పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. అందులోభాగంగా ఆరోపణలు వెల్లువెత్తిన పోలీసుల జాబితా సిద్దం చేయాలని కమిషనర్ కింది అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు కాల్ మనీలో ప్రమేయం ఉన్న వారి జాబితాను సిద్ధం చేశారు. -
నగరంలో సీఐల బదిలీకి రంగం సిద్ధం
-
రూ. 10 లక్షలు దొరికితే... తీసుకెళ్లి...
దొరికిన రూ.10 లక్షలు పోలీసులకు అప్పగింత పోలీస్ కమిషనర్ ప్రశంసలు విజయవాడ : రోడ్డుపై రూ.10 కనిపిస్తే చాలు..అటు ఇటు చూసి చటుక్కున జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది అక్షరాలా పది లక్షల రూపాయలు రోడ్డుపై దొరికితే ఇంకేమైనా ఉందా? ఎవరూ చూడకుండా అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించరూ. అలాంటిది తనకు దొరికిన భారీ నగదును నిజాయితీగా పోలీసులకు చేర్చాడో వ్యక్తి. అతని నిజాయితీకి నగర పోలీసు కమిషనర్ ఫిదా అయిపోయి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి బుధవారం ఉదయం కుమార్తెను కాలేజీ వద్ద దించి మోటారు సైకిల్‌పై వెళుతున్నాడు. బెంజిసర్కిల్ సమీపంలో రోడ్డు పక్కన పెద్ద సంచి కనిపిం చింది. దానిని తీసుకుని చూస్తే లోపల మరో నల్లని కవర్లో భారీగా నగదు ఉన్నట్టు గుర్తించాడు. తనది కాని సొమ్మును తీసుకెళ్లేందుకు మనస్కరించని సత్యనారాయణ సంచిని తీసుకెళ్లి సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ అధికారికి అప్పగించాడు. ఆపై సత్యనారాయణ, ఇతరుల సమక్షంలో ట్రాఫిక్ అధికారి సంచిలోని నగదు లెక్కించగా రూ.10లక్షలున్నాయి. రూ.500, రూ.1000 నోట్ల డినామినేషన్‌తో కూడిన నోట్ల కట్టలు రోడ్డుపై దొరికిన విషయాన్ని ట్రాఫిక్ అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ మొత్తం నగదును అదనపు డీసీపీ(ట్రాఫిక్) టి.వి.నాగరాజు ద్వారా కమిషనరేట్ అధికారులకు అప్పగించారు. సత్యనారాయణ నిజాయితీని గుర్తిం చిన పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ గురువారం స్వయంగా ఆయనను సత్కరించాలని నిర్ణయించారు. ఎవరూ రాలేదు...: దొరికిన నగదుకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. ఆ నగదుకు సంబంధించి కమిషనరేట్‌లోని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఆ నగదు తమదేనంటూ ఎవరూ రాకపోవడాన్ని బట్టి లెక్కల్లో లేని నగదు అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత వ్యక్తులను గుర్తించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
పాలన విజయవాడ నుంచే సాగాలి : విశాఖ ఎంపీ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పాలన విజయవాడ నుంచే కొనసాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాజధానిగా ఉంది... ఈ నేపథ్యంలో మరో రాష్ట్ర రాజధాని నుంచి పాలన చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.హరిబాబు మాట్లాడారు. ఈ సమావేశానికి బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు భారీగా కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా గ్రామ, మండల, జిల్లా, కార్పొరేషన్ స్థాయి అధ్యక్ష ఎన్నికలపై నాయకులు ఈ సందర్భంగా భారీ కసరత్తు చేయనున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడ్ని డిసెంబర్ రెండవ వారంలో ఎన్నుకోనున్నారు. ఆ అంశంపై కూడా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. -
ఆమెతో జాగ్రత్త
ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే దౌర్జన్యం చిన్నప్పటి నుంచి నేరస్వభావం విజయవాడ : ఆమె ఆజానుబాహురాలు.. ఆరడుగుల ఎత్తు... పేరు శీలం శిరీష (35) ఆమె రౌడీయిజం చేస్తుందంటే ఎవరూ నమ్మరు. నగరం నడిబొడ్డున బెంజిసర్కిల్‌లో రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆర్థరాత్రి ఒంటిగంట వరకు తిరుగుతూ ఒంటిరిగా ఎవరైనా కనిపిస్తే బెదిరించి నగలు, నగదుతోపాటు ఇతర వస్తువులు దోచుకుంటుంది. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే చావబాది వస్తువులు లాక్కుని పరారవుతుంది. 20 ఏళ్ల వయసు నుంచి దౌర్జన్యాలకు పాల్పడుతూ మహిళల మెడల్లో గొలుసులు కూడా లాక్కుపోతుండేది. ఈమెపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. దౌర్జన్యాలు, రౌడీయిజం, అధికారినని చెప్పి బెదిరించి డబ్బు వసూలు చేసిన సంఘటనలపై కేసులున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్‌లో మొదటి మహిళా రౌడీషీటర్‌గా పేరు నమోదు చేసుకుంది. గతేడాది ఈమెపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ప్రతినెలా మాచవరం పోలీస్ స్టేషన్‌కి వచ్చి సంతకం చేసి వెళ్తుంది. నగరంలో ఎక్కడ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. పోలీసులు కూడా ఆమె ఎక్కడుంటుందో చెప్పలేకపోతున్నారు. మొదటి నుంచి నేర స్వభావమే.... కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఈడ్పుగల్లు ఈమె స్వగ్రామం. పేర్లు. ఇంటిపేర్లు, కులం మార్చి చెప్పి మోసాలు, దౌర్జన్యాలు చేయటం ఈమెకు అలవాటు. తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకునేది కాదు. పదో తరగతి వరకు చదువుకుంది. పోలీస్ రికార్డుల్లో ఆమె భర్త పేరు సురేష్‌గా నమోదైంది. ఎనిమిదేళ్ల కిందట పెళ్లయిందని, భర్త చనిపోయాడని... ఇద్దరు పిల్లలున్నారని ఆమె చెబుతోంది. పోలీసుల కథనం వేరే... ఈమెకు భర్తలేడు. పెళ్లి కాలేదు. పిల్లలు లేరు. చెప్పేవన్నీ అబద్దాలు. ఒకచోట ఉండటం లేదు. కొన్నిసార్లు కంకిపాడు, రామవరప్పాడులో ఉంటున్నానని, మరికొన్ని సార్లు కృష్ణలంకలో ఉంటున్నానని చెబుతున్నట్లు మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. మద్యం సేవించి తిరుగుతుందని, ఒంటరిగా కనిపించేవారిపై దౌర్జన్యం చేస్తుందని చెబుతున్నారు. మహిళలు దందాలు చేస్తున్న అడ్డాలు ఇవే... నగరానికి కొత్తగా వచ్చే వారిని, మద్యం మత్తులో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని మహిళలు దందాలు చేస్తున్న అడ్డాలు పలు ఉన్నాయి. అడపా, దడపా ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు దాడులు చేసి కొందరిని అరెస్ట్ చేస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో నిలువరించే చర్యలు మాత్రం శూన్యం. బెంజిసర్కిల్, పాత బస్‌స్టాండ్, లోబ్రిడ్జి, కళాక్రేతం, అగ్నిమాపక కేంద్రం ప్రధాన కార్యాలయం సమీపంలో రాత్రి 11.00 గంటలు దాటిన తర్వాత మహిళలు వేచి ఉంటూ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆటోనగర్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో చౌకబారు వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇక్కడికి వెళ్లే వారిని బెదిరించి మహిళలు అందినకాడికి దోచుకుంటున్నారు. -
నడిరోడ్డుపై ఓటర్ కార్డులు
విజయవాడలో కలకలం స్వాధీనం చేసుకున్న అధికారులు విజయవాడ (వన్‌టౌన్): ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ఆయుధం.. ఓటు హక్కు. ఈ హక్కును వినియోగించుకోవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. ఎంతో విలువైన ఈ గుర్తింపు కార్డులు నడిరోడ్డుపై దర్శనమిచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది కార్డులు రోడ్డుపై పని ఉన్నాయి. విజయవాడలో ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కొత్తపేట దూది ఫ్యాక్టరీ రోడ్డులోని చేపల మార్కెట్‌కు సమీపంలో ఓటర్ గుర్తింపు కార్డులు రెండు గోనె సంచుల్లో ఉండటాన్ని ఆదివారం స్థానికులకు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలు సామినేని ఉదయభాను, పి.గౌతంరెడ్డి వచ్చి పరిశీలించారు. అక్కడ వేలాది ఓటర్ గుర్తింపు కార్డులు పడేయడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇవి అధికార టీడీపీ నేతలు గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకునేందుకు ఉపయోగించిన కార్డులేనని వారు ఆరోపించారు. దీనిపై న్యాయవిచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గానికి చెందినవే: ఈ ఓటర్ గుర్తింపు కార్డుల్లో 90 శాతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందినవే ఉన్నాయి. ముఖ్యంగా అజిత్‌సింగ్‌నగర్, అయోధ్యనగర్, సూర్యారావుపేట ప్రాంతాలకు చెందిన కార్డులు ఉన్నాయి. ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్సైట్లో పరిశీలించగా వీటిలోని పలు గుర్తింపు కార్డులు వాడుకలోనే ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కార్డులను పరిశీలించారు. ఇక్కడ ఐదు వేలకు పైగా కార్డులు ఉన్నాయని చెప్పారు. వాటిని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. కార్పొరేషన్లో ఎన్నికల విభాగం అధికారులకు అప్పగించారు. ఓటర్ గుర్తింపు కార్డులను దొంగ ఓట్ల కోసం సేకరించి, పని ముగిశాక రోడ్డుపై పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లను సృష్టించి, గత ఎన్నికల్లో అసలు ఓటర్లను బూత్‌కు రాకుండా చేసేందుకు కుట్ర పన్నారని పేర్కొంటున్నారు. ఎన్నికల విభాగం అధికారుల సహకారంతోనే ఈ గుర్తింపు కార్డులను సేకరించి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
బెజవాడ సెంటర్లో బస్తాల్లో ఓటరు కార్డులు
-
డోంట్ వర్రీ.. నేనున్నాగా..!
విజయవాడ : భూ వివాదంలో కూరుకుపోయిన పోలీసు అధికారిని రక్షించేందుకు నియోజకవర్గం ప్రజలు ముద్దుగా షాడో ఎమ్మెల్యేగా పిలుచుకునే వ్యక్తి రంగంలోకి దిగినట్టు తెలిసింది. తనను గండం నుంచి గట్టెక్కించాలంటూ వచ్చిన మధ్యవర్తులతో ‘ప్యాకేజీ’ కుదుర్చుకొని ఇబ్బందుల నుంచి బయటపడేస్తానంటూ భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గుంటూరుకు చెందిన ఓ వైద్యుని ప్లాట్ల విషయంలో చోటు చేసుకున్న మోసం, పోలీసు కమిషనర్ ఆదేశంలో కేసు నమోదు, నిందితులను అదుపులోకి తీసుకోవడం తదితర పరిణామాలపై ‘సెటిల్మెంట్..సో బెటర్ బాస్!’ శీర్షికన మంగళవారం సాక్షి పత్రికలో వచ్చిన కథనం పెనమలూరు నియోజకవర్గంలో కలకలం రేపింది. స్టేషన్‌కి వచ్చిన బాధితుణ్ణి ప్రైవేటు వ్యక్తుల వద్ద సెటిల్ చేసుకోమంటూ సాక్షాత్తు పెనమలూరు ఇన్స్పెక్టర్ జగన్మోహనరావు పంపడంపై నియోజకవర్గం ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.కాగా, విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారడం, పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించడంతో పెనమలూరు పోలీసు స్టేషన్ అధికారి మధ్యవర్తుల ద్వారా షాడో ఎమ్మెల్యేని ఆశ్రయించినట్టు తెలిసింది. గతంలో వారికి తాను చేసిన ఉపకారం ఏకరువు పెట్టడంతో పాటు తనను బయటపడేస్తే రానున్న రోజుల్లో చేయబోయే సాయం గురించి కూడా భరోసా ఇచ్చినట్టు తెలిసింది. లిక్కర్ సిండికేట్ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా పోలీసు అధికారికి కలిసొచ్చింది. షాడో ఎమ్మెల్యేగా చెప్పుకునే వ్యక్తి లిక్కర్ సిండికేట్‌లో కీలక వ్యక్తి కావడంతో సాయం చేసే వ్యక్తిని వదులుకోవద్దంటూ పలువురు చెప్పినట్టు వినికిడి. పైగా సాయం చేసినందుకు ప్యాకేజీ ఆఫర్ కూడా ఇవ్వడంతో ఆయన రంగంలోకి దిగి నియోకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి ద్వారా పోలీసు పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం. ఇద్దరి పైనే కేసు పోలీసు కమిషనర్ సవాంగ్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడంతో పాటు అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఇద్దరిపైనే కేసు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఖర్లో రంగ ప్రవేశం చేసిన వ్యక్తి పై స్థాయిలో తన పలుకుబడి ఉపయోగించి బయటపడేందుకు చేసిన యత్నాలు ఫలించినట్లు చెపుతున్నారు. పైగా విచారణ అధికారి ఆ వ్యక్తి మంచోడంటూ ముందుగానే కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించేందుకు ఇక్కడి అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై పలువురు మండిపడుతున్నారు. ఏసీపీ ఆగ్రహం ఓ కేసు దర్యాప్తు కోసం పెనమలూరు పోలీసుస్టేషన్‌కి వెళ్లిన మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ టిఎస్ఆర్కె ప్రసాద్ అక్కడి పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన వెళ్లేసరికే అదుపులోకి తీసుకున్న వారిని బయట కూర్చొబెట్టి మహిళా కానిస్టేబుల్ ద్వారా టీ సర్వ్ చేయిస్తున్నారు. ఇదే విషయమై అక్కడి అధికారిని మందలించడంతో పాటు వెంటనే వారిని లోపల కూర్చోబెట్టాలంటూ ఆదేశించినట్లు స్టేషన్ సిబ్బంది చెపుతున్నారు. -
అప్పడే పుట్టిన శిశువు ... చంపేసిన తల్లి
విజయవాడ: విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ నిండు గర్భిణి ప్రసవానికి బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చింది. దాంతో సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్పించుకున్నారు. ఇంతో నొప్పులు మొదలు కావడంతో టాయిలెట్ అంటూ బాత్రూమ్కి వెళ్లింది. అక్కడ ఆడ శిశువును ప్రసవించింది. అనంతరం అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయింది. టాయిలెట్ వద్ద రక్తపు మడుగులో శిశువు మృతదేహం పడి ఉండటంతో సిబ్బంది వెంటనే ఆసుపత్రి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. యువతి కోసం సిబ్బంది ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో గాలించిన ఫలితం కనిపించకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో యువతి శిశువును చంపేసి వెళ్లి పోయిందని పోలీసులు భావిస్తున్నారు. యువతి 108 వాహనంలో ఆసుపత్రికి వచ్చిందని సిబ్బంది తెలిపారు. దాంతో ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు: నలుగురికి గాయాలు
విజయవాడ: విజయవాడలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. నగరంలోని బీఆర్టీఎస్ రహదారి పక్కనే ఉన్న గుడిసెల్లోకి అధిక వేగంతో వెళ్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుడిసెలోని నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. కారులోని వ్యక్తికి దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. -
మంత్రి ఆకస్మిక తనిఖీ.. డాక్టర్లు డుమ్మా!
-
హెల్త్ మినిస్టర్ తనిఖీలు ... డాక్టర్లు డుమ్మా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం విజయవాడలోని పాత ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యులు సమయానికి ఆసుపత్రి రావడం లేదన్న విషయాన్ని కామినేని గుర్తించారు. ఈ విషయంపై ఆసుపత్రి ఆర్‌ఎంవోను నిలదీశారు. దాంతో ఆయన నీళ్లు నమిలారు. దీంతో ఆగ్రహించిన కామినేని ఇలాంటి చర్యలు పునరావృతమైతే క్షమించేది లేదని మండిపడ్డారు. మొత్తం 13 మంది వైద్యుల్లో 9 మంది విధులకు హాజరుకాలేదని మంత్రి కామినేని గుర్తించారు. వారందరికి ఛార్జి మెమో ఇవ్వాలని ఆర్‌ఎంవోను ఆదేశించారు. రికార్డులను కూడా కామినేని తనిఖీ చేశారు. -
'పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు'
-
'పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు'
విజయవాడ: పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నగర ఉన్నతాధికారులను హెచ్చరించారు. శనివారం విజయవాడ నగరంలో చంద్రబాబు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాత ప్రభుత్వాసుపత్రిలో రోగులను చంద్రబాబు పరామర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న సదుపాయలపై రోగలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది తమ వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నారని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దాంతో చంద్రబాబు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరిండెంట్‌ను మందలించారు. ఇక నుంచి అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 6.00 గంటల నుంచి నగరంలో పర్యటించాలని మేయర్, నగర కమిషనర్‌ను చంద్రబాబు ఆదేశించారు. బందరు కాల్వను పరిశీలించారు. ఆక్రమణలు తొలగింపు, కాల్వల సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కృష్ణా నది ఒడ్డున ఉన్న 10 ఎంజీడీ రక్షిత జల కేంద్రాన్ని సీఎం పరిశీలించారు. కాల్వల ఆధునికరణకు రూ. 4 కోట్లు విడుదల చేశారు. -
నగల దుకాణంలో అగ్నిప్రమాదం : ఆస్తి నష్టం
విజయవాడ: నగరంలోని కన్యకాపరమేశ్వరీ దేవాలయం సమీపంలోని ఓ నగల దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో హుటాహుటిన ఘటన స్థాలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే షాపులో అగ్రిప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో భారీగానే ఆస్తినష్టం సంభవించినట్లు షాపు యాజమాన్యం వెల్లడించింది. -
విజయవాడలో యూఎస్ కాన్స్లేట్
విజయవాడ: విజయవాడలో అమెరికన్ కాన్స్లేట్ కార్యాలయం ఏర్పాటుకు ఆ దేశ రాజకీయ, మిలటరీ వ్యవహారాల కార్యదర్శి పునీత్ తల్వార్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పునీత్ తల్వార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో కాన్స్లేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబు... పునీత్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. డిసెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు పునీత్ భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్ పర్యటనలో భాగంగా పునీత్... భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, రక్షణ మంత్రులతో కానున్నారు. ప్రాంతీయ, తీర రక్షణ భద్రత, వాణిజ్యంతోపాటు మరిన్ని అంశాలపై వ్యూహాత్మక సహకారంపై భారత్ ఉన్నతాధికారులతో పునీత్ చర్చలు జరపనున్నారు. -
మొదటి దశలో విజయవాడకే: శ్రీధరన్
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించిన కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో రెండు కారిడార్లతో తొలి దశ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ మెట్రో రైలు ప్రాజెక్టుల ముఖ్య సలహాదారు ఇ.శ్రీధరన్ పేర్కొన్నారు. బందరు రోడ్డులోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి కానూరు ఇంజనీరింగ్ కాలేజీ వరకూ 13 కిలోమీటర్ల మేర మొదటి కారిడార్, బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా ఏలూరు రోడ్డు నుంచి రామవరప్పాడు, ఐదో నంబరు జాతీయ రహదారికి లింకు కలుపుతూ 12, 13 కిలోమీటర్ల మేర రెండో కారిడార్ నిర్మాణానికి అవకాశం ఉందని తెలిపారు. భారీ ట్రాఫిక్, ఇరుకు రోడ్లను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు కారిడార్లను ఎంపిక చేశామని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గుంటూరుకు మెట్రో రైలును విస్తరించాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారుల బృందంతో కలసి శనివారం విజయవాడకు వచ్చిన ఆయన ప్రతిపాదిత మెట్రో ప్రాంతాలను పరిశీలించారు. సాయంత్రం వీజీటీఎం ఉడా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెట్రో రైలు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు, అవసరమైన మౌలిక సౌకర్యాలు, ఖర్చు అంశాలతో డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను జనవరి నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని శ్రీధరన్ చెప్పారు.మెట్రో రైలు ప్రాజెక్టు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని, కిలోమీటరుకు రూ. 240 కోట్లు ఖర్చవుతుందని శ్రీధరన్ చెప్పారు. -
విజయవాడలో సందడి చేసిన సచిన్, అనుష్క
విజయవాడ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, హీరోయిన్ అనుష్క శుక్రవారం విజయవాడ నగరంలో సందడి చేశారు. నగరంలోని పీవీపీ మాల్‌ను వారిద్దరు ప్రారంభించారు. సచిన్, అనుష్కలను చూసేందుకు వారి అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో పీవీపీ మాల్ పరిసర ప్రాంతాలు సచిన్, అనుష్క అభిమానులతో కిక్కిరిసి పోయాయి. ఈ సందర్బంగా సోదరిసోదరీమణులారా అంటూ విజయవాడ ప్రజలను సచిన్ తెలుగులో పలకరించారు. సచిన్ వస్తున్న సందర్బంగా ట్రాఫిక్ పోలీసులు నగరంలో ఏటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో విజయవాడలోని బందరు రోడ్డు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ తీవ్ర అటంకం ఏర్పడింది. -
మళ్లీ ఇసుక దందాలు
గుంటుపల్లి రీచ్‌కు అక్రమ అనుమతి గని ఆత్కూరు క్వారీ సీజ్ విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో మళ్లీ ఇసుక దందాలు మొదలయ్యాయి. ఇసుక రీచ్‌ల నిర్వాహకులు లక్షల్లో ముడుపులు ముట్టచెప్పి.. అక్రమంగా అనుమతులు పొంది.. యథేచ్ఛగా తెల్ల బంగారాన్ని దోచుకుంటున్నారు. జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి ఇసుక రేవులో బోట్స్‌మన్ సొసైటీకి దొడ్డిదారిలో అక్రమ అనుమతి మంజూరైంది. నేరుగా మైనింగ్ డెరైక్టరేట్ నుంచి అనుమతి మంజూరుకావటం చర్చనీయాంశంగా మారింది. అక్రమంగా అనుమతులు పొందిన గుంటుపల్లి రీచ్‌లో నెలరోజులుగా యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు కంచికచర్ల మండలం గనిఆత్కూరు ఇసుక రీచ్‌లో కూడా అక్రమ త వ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ మైనింగ్ అధికారులు శుక్రవారం దాడులు చేసి క్వారీని సీజ్ చేశారు. గుంటుపల్లి రీచ్‌లో ఇలా... గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీకి 2008లో లీజును తీసుకున్నారు. అప్పట్లో లీజు కాలాన్ని అధికారులు పొడిగించారు. లీజుకాలాన్ని పొడిగించటం నిబంధనలకు విరుద్ధమని గొల్లపూడి బోట్ వర్కర్స్ సొసైటీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు లీజును పొడిగించవద్దని ఆధికారులను ఆదేశించింది. ఈ విధంగా పలుమార్లు కోర్టుల్లో కేసులు నడవటంతో అధికారులు ఈ కార్వీ వేలం పాటలను నిలుపుదల చేశారు. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ 11న హైకోర్టు గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీ లీజును పొడి గించవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ బోట్స్‌మన్ సొసైటీ వారు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని మళ్లీ లీజు పొడిగింపు ఉత్తర్వులను పొందినట్లు తెలిసింది. దాంతో గుంటుపల్లి బోట్స్‌మన్ సొసైటీ తవ్వకాలు గత నెల రోజులుగా ఊపందుకున్నాయి. మైనింగ్ డెరైక్టరేట్ నుంచి ఉత్తర్వులు రావటంతో జిల్లాలో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సొసైటీ అధ్యక్షుడిని చేతిలో పెట్టుకుని కొందరు బినామీ వ్యక్తులు ఈ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నట్లు తాజాగా ఫిర్యాదులు వస్తున్నాయి. మైనింగ్ డెరైక్టరేట్ నుంచి అనుమతి రావటంతో ఈ విషయమై జిల్లా మైనింగ్ అధికారులు నోరు మెదపటం లేదు. గని ఆత్కూరులో.. గని ఆత్కూరు క్వారీలో బినామీ వ్యక్తులు దందా చేసి అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులపై మైనింగ్ అధికారులు తనిఖీలు చేశారు. ఏడున్నర ఎకరాల మేరకు లీజుకు తీసుకుని అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. మీటరు లోతు తవ్వాల్సిన పాటదారుడు నిబంధనలకు విరుద్ధంగా 10 మీటర్ల లోతు తవ్వుతున్నారని ఫిర్యాదులో పేర్కొనడంతో మైనింగ్ అధికారులు తనిఖీలు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ అక్రమ తవ్వకాల వెనుక టీడీపీ నేతలు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గని ఆత్కూరు క్వారీ నిలిపివేత గని ఆత్కూరు (కంచికచర్ల రూరల్) : మండలంలోని గని ఆత్కూరు ఇసుక క్వారీ శుక్రవారం నిలిచిపోయింది. ఈ మేరకు నందిగామ మైనింగ్ ఏడీ సీ మోహనరావు మాట్లాడుతూ గని ఆత్కూరు క్వారీలో అవకతవకలు జరుగుతున్నట్లు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు అందిందని, జేసీ ఆదేశాల మేరకు క్వారీలో తవ్వకాలు నిలుపుదల చేశామని చెప్పారు. శనివారం సర్వేయర్ , మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులను తీసుకెళ్లి సక్రమంగా కొలతలు నిర్వహించి తగిన సమాచారాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. -
అల్లాడిస్తున్న అప్రకటిత ‘కోత’
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వాన రాకడా.. ప్రాణం పోకడా అనే చందంగా విద్యుత్ సరఫరా పరిస్థితి ఉందని ప్రజానీకం వాపోతున్నారు. కొద్ది రోజులుగా పల్లెల్లో, పట్టణాల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో అలాం్లడిపోతున్నారు. విజయవాడ, నగరంతో పాటు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల్లో వారం రోజులుగా ఈఎల్ఆర్ (ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ) రోజుకు మూడు విడతలుగా కోత విధిస్తున్నారు. రాత్రిపూటకూడా ఎప్పుడు, కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మూతపడుతున్న రక్షిత మంచినీటి పథకాలు... కాగా అప్రకటిత విద్యుత్ కోత వల్ల జిల్లా వ్యాప్తంగా రక్షిత మంచినీటి పథకాలు మూతపడుతున్నాయి. త్రీఫేజ్ సరఫరా లేకపోవటంతో మోటార్లు పనిచేయక మున్సిపల్, గ్రామపంచాయతీల్లో నీటిసరఫరా పథకాలు పనిచేయడంలేదు. ఫలితంగా విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా మున్సిపల్ వాటర్ సరఫరా నిలిచిపోయింది. మెరక ప్రాంతాలకు మున్సిపల్ నీరు సరిగా రావటం లేదని ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. జిల్లాలో పెడన, గుడివాడ, ఉయ్యూరు, నూజివీడు, తిరవూరు,. జగ్గయ్యపేట, నందిగామ మున్సిపాలిటీలో కరెంటు కష్టాలతో ప్రజలు తల్లఢిల్లుతున్నారు. ఈక్రమంలో జిల్లా వ్యాప్తంగా 929 గ్రామ పంచాయతీల్లో, 49 మండలాల్లో మంచినీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుత్నుట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ కేంద్రాలు, మండలాలు, గ్రామ పంచాయతీల్లో కొద్ది రోజులుగా నిర్ణీత సమయాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కోత విధిస్తున్నారని ప్రజలువాపోతున్నారు. అన్నదాతల అవస్థలు... కాగా విద్యుత్ కోత వల్ల అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. త్రీపేజ్ సరఫరా సరిగా లేకపోవటంతో రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. పంటపొలాలకు సరిగా నీరు అందడం లేదని వాపోతున్నారు. అప్రకటిత కోతలు అనివార్యం విద్యుత్ ఉత్పత్తి, వినియోగం మధ్య వ్యతాసం రావటంతో ఎమర్జెన్సీలోడ్ రిలీప్ పేరుతో కోతలు విధించాల్సి వస్తోందని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్.ఇ. మోహన్ కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. వేసవి ఎండలు, వాడ కం పెరగటం కొన్ని సందర్బాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కల్గినప్పుడు ఈఎల్ఆర్ విధించటం అనివార్యమన్నారు. విజయవాడ, మచిలీపట్నంలో మారిన షెడ్యూల్ ప్రకారం విద్యుత్ అధికారిక కోతలు ఈ విధంగా ఉన్నాయి. విద్యుత్ కోత వేళలివే.. విజయవాడ నగరంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు, తిరిగి రాత్రి 7-45 గంటల నుంచి 8-45 గంటల వరకు మడు విడతలుగా విద్యుత్ అదికారికంగా కోత విధిస్తారు. జిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటలవరకు, సాయంత్రం 6-45 గంటల నుంచి రాత్రి 7-45 గంటల వరకు కోత విధిస్తారు. -
జగనే సీఎం
విజన్ విజయవాడ సాధిస్తా క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతా ‘పైలా’ చేరిక శుభసూచకం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి రాజేంద్రప్రసాద్ వైఎస్సార్ సీపీకి ప్రజాదరణ వెల్లువలా వస్తోందని, పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమని విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఆదివారం ఆయన విజయవాడలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం బెంజిసర్కిల్ సమీపంలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్, జైసమైక్యాంధ్ర పార్టీలకు చెందిన వందలాది మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకున్నారు. విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం అవసరమని ప్రజలు విశ్వసిస్తున్నారని కోనేరు రాజేంద్రప్రసాద్ చెప్పారు. నగరానికి చెందిన ప్రముఖ నేతలు వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ప్రముఖులంతా నేడు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు సేవలందించిన పైలా సోమినాయుడు, బాయిన వెంకట్రావు లాంటివారు తన సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి రావడం శుభసూచకమన్నారు. వీరిని పార్టీలోకి తీసుకుంటున్నట్లు తాను జగన్మోహన్రెడ్డికి చెప్పానన్నారు. వీరి చేరికతో తాను పార్టీలో ఒక అడుగు ముందుకు వేశానని సంతోషం వ్యక్తం చేశారు. వీరందరి సలహాలు, సంప్రదింపులతో ‘విజన్ విజయవాడ’ లక్ష్యంగా పని చేస్తానన్నారు. నగరాన్ని క్లీన్ సిటీగా మార్చడమే తన ధ్యేయమన్నారు. విజయవాడ అబివృద్ధికి బ్లూప్రింట్ తయారుచేసి ప్రణాళికా బద్ధంగా, ప్రాధాన్యతక్రమంలో సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తుంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. జనాదరణగల నేత జగన్.. పార్టీ నగర అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జలీల్‌ఖాన్ మాట్లాడుతూ.. తమ అధినేత జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఆకర్షణ కొద్దిసేపు మాత్రమే ఉంటుందని, ఆదరణ చిరస్థాయిగా ఉంటుందన్నారు. మహానేత ైవె ఎస్ రాజశే ఖరరెడ్డి చేపట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన పేద ప్రజలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని చెప్పారు. నాలుగేళ్లు రాజన్న కుటుంబానికి దూరం పార్టీలో చేరిన పైలా సోమినాయుడు మాట్లాడుతూ.. తాను 1986 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్లుగా తాను రాజన్న కుటుంబానికి దూరంగా ఉన్నానని విచారం వ్యక్తం చేశారు. జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ఆదరణ, కోనేరు రాజేంద్రప్రసాద్ స్ఫూర్తితో తాను వైఎస్సార్ సీపీలో కార్యకర్తగా చేరానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలంతా జగన్‌వైపే ఉన్నారని చెప్పారు. -
మౌలిక వసతులు కల్పించాం : కలెక్టర్
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అన్ని మౌలిక వసతులు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వివరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, ఫామ్-6 దరఖాస్తుల పరిష్కారం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్ అధికారుల శిక్షణ, కమ్యూనికేషన్ ప్రణాళిక వంటి పలు అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, షామియానా,ప్రథమ చికిత్సా కేంద్రం తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అవసరమైన చోట్ల తాత్కాలిక ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత డిసెంబర్ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జిల్లాలో 2,14,372 ఓటర్ల దరఖాస్తులు పరిష్కరించామని, మిగిలిన 70, 958 దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తొలిదశ శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకులు చేరుకున్నారని తెలిపారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ సదుపాయాన్ని కల్పించి కమ్యూనికేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు చేసుకున్న ఫామ్-6 దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేసి అర్హులైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను అందజేయాలని సూచించారు. ప్రతి ఓటరు బూత్ స్థాయి అధికారి ద్వారా ఫొటో ఓటరు స్లిప్పులను నూరుశాతం పంపిణీ చేయాలని కోరారు. నామినేషన్ల దరఖాస్తులను అప్పటికప్పుడే పరిశీలించి వివరాలను సకాలంలో ఎన్నికల కమిషన్‌కు నివేదించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించే వారిపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న నగదు తదితర వివరాల నివేదికను అందజేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో విజయవాడ పోలీస్ కమిషనర్ బీ. శ్రీనివాసులు, మచిలీపట్నంనుంచి ఎస్పీ జె. ప్రభాకరరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ పి.మురళీధర్, ఆర్ఐ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
' అభివృద్ధికి ఆమడ దూరంలో బెజవాడ'
రాష్ట్ర రాజకీయాలలో విజయవాడ నగరం కీలకపాత్ర పోషిస్తుందని, అయితే ఆ నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి కోనేరు ప్రసాద్ శనివారం విజయవాడలో తెలిపారు.అందుకే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను విజయవాడ పంపారని చెప్పారు. విజయవాడ నగరాన్ని హెల్త్ టూరిజం సెంటర్‌గా అభివృద్ధి చేస్తానని ఆయన విజయవాడ నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో ముఫ్పై ఏళ్లపాటు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేలా పని చేస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. నగరంలోని అన్ని రంగాలలో ప్రొఫిషనల్స్‌ను గ్రూప్‌గా తయారు చేసి విజయవాడను అభివృద్ధి చేస్తానన్నారు. -
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కలేనా?
ముందుకు కదలని విమానాశ్రయ విస్తరణ నిలిచిపోయిన భూసేకరణ పట్టించుకోని ప్రజాప్రతినిధులు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : అంతర్జాతీయ హోదా పొందడానికి అన్ని హంగులూ ఉన్న గన్నవరం విమానాశ్రయ విస్తరణ మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్న చందాన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతున్న విజయవాడకు అతి దగ్గర్లో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పించడం కలగా మారింది. పాలకులు పట్టించుకోపోవడంతో భూసేకరణ కార్యక్రమం ఐదేళ్లుగా ముందుకు సాగడం లేదని విమర్శలొస్తున్నాయి. కనీసం 491.92 ఎకరాల భూమిని అప్పగించినా.. ఎయిర్‌పోర్టును అంతర్జాతీయస్థాయికి తీసుకువెళతామని ఐదేళ్లుగా ఎయిర్‌పోర్టు అథారిటీ మొత్తుకుంటున్నా ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయితే మొదట.. గన్నవరం విమానాశ్రయంపై దృష్టి సారించాల్సి ఉంది. విజయవాడ, గుంటూరు పట్టణాల్లో వేల సంఖ్యలో ఎన్ఆర్ఐలు, వ్యాపార రంగంలో ప్రముఖులున్నారు. ఇక్కడి విమానాశ్రయానికి భవిష్యత్తులో తాకిడి పెరగనుంది. విజయవాడ నుంచి ముఖ్యవైన ఇతర ఎయిర్‌పోర్టులన్నీ దాదాపు, 300 నుంచి 400 కిలోమీటర్ల మధ్య దూరంలో ఉన్నాయి. ఢిల్లీ, ముంబయి తదితర పట్టణాలకు ఇక్కడ నుంచి లింకు సర్వీసులు నడుస్తున్నాయి. సర్వీసులు పెంచడంపై దృష్టి గన్నవరం విమానాశ్రయం నుంచి సర్వీసులను పెంచడంపై ప్రైవేటు విమానసంస్థలు దృష్టి సారించాయి. అంతర్జాతీయ హోదా కల్పించి అభివృద్ధి చేస్తే దేశంలో అతి ముఖ్యమైన పట్టణాలకు నేరుగా సర్వీసులు నడపడానికి ప్రైవేటు విమాన సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఎయిర్ కోస్తా, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి సంస్థలు మరిన్ని సర్వీసులు నడపడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రస్తుతం ఆరు సర్వీసులు నడుస్తున్నాయి. రోజూ బెంగళూరుకు మూడు సర్వీసులు, హైదరాబాద్‌కు మూడు సర్వీసులు నడుపుతున్నారు. వీటిలో రెండు విమానాలు హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి లింకు సర్వీసులుగా నడుస్తున్నాయి. నిలిచిన భూసేకరణ విమానాశ్రయం అభివృద్ధి కోసం జరుగుతున్న భూసేకరణ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఐదేళ్ల నుంచి పోరాడగా, ఐదారు నెలల క్రితం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్ల బడ్జెట్ కేటాయించింది. అవి కాగితాలకే పరిమితమయ్యాయి. భూసేకరణ ప్రక్రియలో భాగంగా నెల పాటు ఎన్జాయ్మెంట్ సర్వే చేశారు. అంతటితో ఈ కార్యక్రమం మరుగున పడింది. గన్నవరం విమానాశ్రయం 500 ఎకరాల విస్తార్ణంలో ఉంది. ఇక్కడి నుంచి నైట్ ల్యాండింగ్ సౌకర్యం, అఫ్రాన్ ఏర్పాటు చేశారు. కార్గో సర్వీసులను క్రమబద్ధం చేసి నడపడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఎప్పుడో ప్రణాళిక రూపొందించింది. అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి కార్గో బిల్డింగ్, ఫైర్‌స్టేషన్, టెక్నికల్ బ్లాక్, కార్‌పార్కింగ్, కస్టమ్స్ ఆఫీసు, అదనపు సెక్యురిటీ బ్లాకులు ఏర్పాటుకు ఎయిర్‌పోర్టు అథారిటీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా ప్రాంత నేతలు పట్టించుకోవడంలేదని ఆరోపణలున్నాయి. -
పంచాయతీ కార్యదర్శి పరీక్ష నేడే పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో శనివారం జరగనున్న పంచాయతీ కార్యదర్శుల పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మెత్తం 14,984 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు 29 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 10 మంది లైజనింగ్ అధికారులను, 29 మంది సహాయ లైజనింగ్ అధికారులను, 6 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని వివరించారు. సుమారు 670 మంది ఇన్విజిలేటర్లను పరీక్షల నిర్వహణకు నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశావుని పేర్కొన్నారు. పరీక్షలను లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు సూచనలివీ... పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి 10 గంటల తరువాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ కలిగి ఉండాలి హాల్‌టికెట్‌లో ఫొటో ప్రింట్ సరిగా లేకపోయినా, సరిగా కనపడకపోయినా గెజిటెడ్ అధికారి ఎటెస్ట్ చేసిన 3 పాస్‌పోర్టు సైజు ఫొటోలు తన వెంట పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి అభ్యర్థులు ప్యాడ్, బ్లూ లేక బ్లాక్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకురావాలి సెల్ఫోన్లు, వైట్నర్, ఎరేజర్, బ్లేడు, చాక్‌పీసులు, కాలిక్యులేటర్ వంటి వాటిని పరీక్షా కేంద్రంలోకి తీసుకురాకూడదు ఓఎంఆర్ ఒరిజినల్ షీట్లు తప్పనిసరిగా ఇన్విజిలేటర్లకు అందజేయాలి -
వీఆర్వో.. వీఆర్ఏ నేడు పరీక్ష
అన్ని ఏర్పాట్లూ పూర్తి నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ భారీ పోలీసు బందోబస్తు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : విజయవాడలో ఆదివారం జరగనున్న వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కలిపి 127 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 64 వీఆర్ఓ పోస్టులకు 54 వేల 103 మంది, 403 వీఆర్ఏ పోస్టులకు 7,592 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబోమని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ప్రకటించారు. అభ్యర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. వీఆర్వో పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు జరుగుతుంది. వీఆర్ఏ పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. వీఆర్వో పరీక్షకు 15 జోన్లు 38 రూట్లుగాను, వీఆర్ఏ పరీక్షకు ఒక జోన్ నాలుగు రూట్లుగా విభజించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 115 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 129 మంది సిట్టింగ్ స్క్వాడ్, 13 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 17 మంది పరిశీలకులను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు అర్బన్ తాలూకా కేంద్రం ఆవరణలోని ట్రెజరీలో భద్రపరిచారు. ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి రూట్ అధికారులు ప్రశ్నపత్రాలను, ఓఎంఆర్ షీట్లను పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి, డీఆర్వో సుందరరాజు, సబ్‌కలెక్టర్ డి.హరిచందన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాత్రి నుంచి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులు ఏమైనా సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూంలో అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్ 0866 2574454, మొబైల్ నంబర్ 9290009918లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు. విజయవాడలో 144వ సెక్షన్.. భారీ బందోబస్తు రెవెన్యూ పరీక్షల సందర్భంగా ఆదివారం నాడు కమిషనరేట్ పరిధిలో 144వ సెక్షన్ విధించారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. పరీక్షలను పురస్కరించుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రత : కలెక్టర్ వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష ప్రశ్నపత్రాలు పరీక్షా కేంద్రాలకు చేర్చేవరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులకు సూచించారు. స్థానిక డివిజనల్ ట్రెజరీ కార్యాలయం స్ట్రాంగ్ రూంలో భద్రపరచిన ప్రశ్నపత్రాల బండిళ్లను శనివారం ఆయన పరిశీలించారు. బండిళ్లపై ఉన్న కోడ్ నంబర్ల ఆధారంగా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలు చేర్చాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ మురళి, తహశీల్దార్ ఆర్.శివరావు ఉన్నారు. -
కొత్త జేసీకి సవాళ్లెన్నో
నేడు విధులకు హాజరు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రెండురోజుల క్రితం బాధ్యతలు స్వీకరించి శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు జిల్లాకు వస్తున్న కొత్త జాయింట్ కలెక్టర్ మురళికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో గత కొంతకాలంగా పక్కదారి పట్టిన రెవెన్యూ పాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఇసుక దొంగ రవాణా యథేచ్ఛగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతుండటం, అధికారులపై సైతం దాడులకు తెగబడుతుండటంతో వారి కార్యకలాపాలను అడ్డుకునేందుకు సిబ్బంది భయపడుతున్నారు. కృష్ణానదీతీరంలో ఇసుక దొంగ రవాణాకు చెక్ పెట్టాలి. విజయవాడ రెవెన్యూ డివిజన్లోని పలు గ్రామాల్లో అక్రమంగా తరలించుకుపోతున్న ఇసుక రవాణాను అరికట్టాలి. ఇసుక మాఫియా ఆగడాలను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంది. మరోపక్క ప్రజాపంపిణీ వ్యవస్థ జిల్లాలో పక్కదారి పట్టింది. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు యథేచ్ఛగా తరలించేస్తున్నారు. జిల్లాలో కొందరు అధికారులు, డీలర్లతో కుమ్మక్కై ప్రజాపంపిణీ వ్యవస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ప్రతీ మండలంలో ఫిర్యాదులు కోకొల్లలుగా ఉన్నాయి. బినామీ డీలర్లను ఏరేసి ఆ స్థానంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగేలా కొత్త డీలర్ల నియామకాలు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో తహశీల్దార్ కార్యాలయాల్లో, రెవెన్యూ డివిజన్లలో పెండింగులో ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొన్ని మండల కేంద్రాల్లో పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీకి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు పిర్యాదులు ఉన్నాయి. సొమ్ము ఇవ్వలేని బక్కరైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూవివాదాలు పరిష్కారం కాక అనేకమంది బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్సైజ్, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, సినిమాహాళ్ల నిర్వహణపై అజమాయిషీ కొరవడింది. ఎంతోకాలంగా వాటిపై తనిఖీలు లేకపోవటంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అన్నింటీకి మించి ఈ జిల్లాలో రాజకీయ పరిస్థితులు పెనుసవాలుగా మారనున్నాయి. -
కుప్పకూలనున్న రిజిస్ట్రేషన్ల వ్యవస్థ
ప్రజల ఆస్తులకు రక్షణ కరువు ముందుగా స్లాట్ బుకింగ్ నగరంలో దరఖాస్తు నమూనా ఆందోళనలో రిజిస్ట్రేషన్స్ సిబ్బంది విజయవాడ సిటీ, న్యూస్‌లైన్: ఆన్లైన్ విధానం పేరుతో రిజిస్ట్రేషన్స్ శాఖను ప్రైవేటు వక్తులకు సర్కారు ధారాదత్తం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. త్వరలో రిజిస్ట్రేషన్స్ కార్యకలాపాలన్నింటినీ మీ-సేవకు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఆన్లైన్ విధానాన్ని హడావుడిగా చేపట్టిన ప్రభుత్వం.. ప్రజల ఆస్తుల క్రయవిక్రయాలను మీ-సేవ కేంద్రాలకు అప్పగించడానికి తుది చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం అమల్లోకి వస్తే మరికొన్ని నెలల్లో రిజిస్ట్రేషన్స్ శాఖ కనుమరుగవుతుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు ఆధీనంలో నడుస్తున్న మీ-సేవకు రిజిస్ట్రేషన్స్ శాఖ కార్యకలాపాలన్నింటినీ దొడ్డిదారిలో అప్పగించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు, సిబ్బంది, వారికి అనుబంధంగా పనిచేస్తున్న దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ-సేవలను టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) ద్వారా అందించేవారు. అప్పట్లో కొన్ని రకాల సేవలను మాత్రమే సర్వర్ ద్వారా ఈ-సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. రెండేళ్ల కిందట ముఖ్యమంత్రి కిరణ్ ఈ-సేవలను, మీ-సేవలుగా మార్చి.. దాదాపు 200 రకాల సేవలను ఈ కేంద్రాలకు అప్పగించారు. సీఎం సోదరుడు నిర్వహిస్తున్న డేటామాట్రిక్ కార్పొరేషన్‌కు మీ-సేవ కాంట్రాక్టు అప్పగించినట్లు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ శాఖ దశలవారీగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయి ప్రజల ఆస్తులకు భద్రత కరవవుతుందని ఆరోపిస్తున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని చేసే వేలాది మంది సిబ్బందిని వివిధ డిపార్టుమెంట్లకు సర్దుబాటు చేస్తారని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఒక సబ్ రిజిస్ట్రార్, అటెండర్ మాత్రమే ఉంటారు. ఆస్తుల లావాదేవీల్లో ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది చేసే పనంతా మీ-సేవల్లోనే చేసేస్తారు. దాంతో కార్యాలయాల్లో సిబ్బంది, వేతనాలు, అలవెన్స్‌లు, ఇతర ఖర్చులు కలిసి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మీ-సేవ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ ఇలా.. రిజిస్ట్రేషన్ చేసే వారు ముందుగా మీ-సేవకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్‌లో దరఖాస్తుదారుడికి సీరియల్ నంబర్, రిజిస్ట్రేషన్ డేట్ ఇస్తారు. నిర్ణీత తేదీలో మీ-సేవ కేంద్రానికి వెళ్లి కక్షిదారులు తమ ఆస్తులపై వివిధ రకాల లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మీ-సేవా కేంద్రంలో పొందుపొరిచిన నమూనా దరఖాస్తు కూడా ఇప్పటికే తయారైంది. అర్జీదారులు రిజిస్ట్రేషన్ కోసం ఆ దరఖాస్తును పూర్తి చేస్తే ఆన్లైన్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళుతుంది. సబ్ రిజిస్రార్ వెరిఫికేషన్ చేసి క్లిక్ చేస్తే మీ-సేవ కేంద్రంలోనే డాక్యమెంటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. కక్షిదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముఖం చూడకుండానే మీ-సేవ కేంద్రంలోనే తమ ఆస్తుల లావాదేవీలు జరుపుకోవచ్చు. స్తంభించిన వందల కోట్ల లావాదేవీలు.. ఈ విషయమై గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల ఆస్తుల లావాదేవీలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లు జరగక, ఈసీలు, దస్తావేజు నకళ్లు తదితర సేవలు నిలిచిపోయి ప్రజలు ఆగచాట్లు పడుతున్నారు.