విజయవాడ : పైరసీ సీడీల ముఠా గుట్టును విజయవాడ నగర టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. విజయవాడ వన్‌టౌన్‌లోని కొత్తపేట డ్రెయిన్ వీధిలో పైరసీ సీడీల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 5 వేల పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీటిలో తాజాగా విడుదలైన జతకలిసే, సౌఖ్యం సినిమాలతోపాటు బెంగాల్ టైగర్, శంకరాభరణం తదితర చిత్రాలకు చెందిన పైరసీ సీడీలు ఉన్నాయి. అలాగే త్వరలో విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన సీడీ కవర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పైరసీ సీడీల నిర్వాహకుడు టి సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.