Piracy CDs
-
రూ.40కే సినిమాను అమ్మేస్తారా అంటూ హీరో ఆవేదన
సాక్షి, హైదరాబాద్: నిఖిల్ హీరోగా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అర్జున్ సురవరం.. మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ సురవరం మూవీకి హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను చిత్ర యూనిట్ నేరుగా కలుస్తోంది. ఈ సందర్భంగా గుంటూరు వెళ్లిన హీరో నిఖిల్ అక్కడ రోడ్డు మీద ఓ బండిపై తాజాగా విడుదలైన సినిమాలకు సంబంధించిన పైరసీ డీవీడీలను ఓ మహిళ అమ్ముతుండడం గమనించి షాక్‌కి గురయ్యాడు. ఎంతో కష్టపడి సినిమా తీస్తున్నాం. చదవండి: వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కేఏ పాల్ ఎందరో జీవితాలు సినిమాపై ఆధారపడి ఉంటాయి. ఇలా.. రూ.40కే మా సినిమాను అమ్మేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆ బండిపై సీడీలు విక్రయిస్తున్న మహిళ తనకు ఏమీ తెలియదని చెప్తూ.. తన కుటుంబ పోషణ కోసమే ఈ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పింది. ఇక ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియోని నిఖిల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. Had so much fun interacting with Housefull Crowds in Guntur yesterday and on the way back stopped for tea and Found This ... #ArjunSuravaram and other movie DVD’s being openly sold🤦🏻♂️ pic.twitter.com/nEBCbtAeqh — Nikhil Siddhartha (@actor_Nikhil) December 8, 2019 -
గోమతి సినిమా థియేటర్ మూత
తిరువొత్తియూరు: కడలూరులో పైరసీ సీడీలు తయారు చేస్తున్న గోమతి సినిమా థియేటర్‌కు పోలీసులు సీలు వేశారు. తమిళనాడులో పైరసీ సీడీల విక్రయం ఎక్కువైంది. రెండు వారాల ముందు విడుదలైన ఒరు కుప్పై కథై చిత్రం ఇంటర్నెట్లోను, పైరసీ సీడీలలోను విడుదలైంది. దీంతో చిత్ర నిర్మాత మంగళవారం కడలూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందులో విదేశాలకు పేటెంట్ హక్కు ఇస్తే దాని ద్వారా దొంగతనంగా సినిమా లీక్ అవుతుందన్నారు. ఈ చిత్రానికి విదేశీ హక్కు జారీ చేయలేదని కాని ఇంటర్నెట్లో పైరసీ సీడీల మూలంగా సినిమా బయటకు రావడం దిగ్భ్రాంతిని కలుగచేసిందని పేర్కొన్నారు. ఆ డీవీడీలను పరిశీలించగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మయిలాడుదురై గోమతి థియేటర్లో పైరసీ సీడీలు తయారు అవుతున్నట్టు తెలిసిందన్నారు. దీంతో పోలీసులు బుధవారం గోమతి థియేటర్లో తనిఖీ చేయగా పైరసీ సీడీలు తయారుచేస్తున్నట్టు తెలిసింది. దీంతో సినిమా థియేటర్‌కు సీలు వేసి ఇద్దరిని అరెస్టు చేశారు. -
పట్టుకునే దమ్ముందా?
- పోలీసులకు పైరసీ సీడీ మాఫియా సవాల్ - చిన్న వ్యాపారులను పట్టుకుని పైరసీ డాన్లను వదిలేస్తున్న వైనం - నెల్లూరులో లక్షల్లో పైరసీ సీడీల విక్రయాలు - టూ టౌన్, త్రీ టౌన్ ఐడీ పార్టీ పోలీసుల సహకారం పైరసీ సీడీల వ్యాపారానికి జిల్లా అడ్డాగా మారింది. పోలీసుల సహకారంతో జరుగుతున్న ఈ వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదు. ఫిల్మ్ చాంబర్ దాడులు మొదలు మొత్తం సమాచారాన్ని అక్రమార్కులకు పోలీసులే చేరవేస్తున్నారు. దీంతో నెలకు లక్షల్లో పైరసీ సీడీల వ్యాపారం జోరుగా సాగుతోంది. ముగ్గురు వ్యక్తులు అటు పోలీసులను, ఇటు నేతలను తమ చేతుల్లో పెట్టుకుని పైరసీ సీడీల వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బుచ్చిరెడ్డిపాళెం : నెల్లూరు జిల్లా కేంద్రమైన పట్టణంలోని ఆనంవారి వీధిలో పైరసీ సీడీల వ్యాపారం ఏళ్ల తరబడి జోరుగా సాగుతోంది. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి సీడీ దుకాణాల వ్యాపారులు పైరసీ సీడీలు కొని తీసుకెళుతుంటారు. ఒక్కో సీడీని రూ.30కు విక్రయిస్తున్నారు. వీటిని మండల కేంద్రాల్లోని దుకాణాల్లో రూ.50 కు అమ్మకాలు జరుపుతుంటారు. సుకుమార్, సుబ్రహ్మణ్యం, రత్నం అనే వ్యక్తులు ప్రధానంగా పెద్దస్థాయిలో పైరసీ సీడీల వ్యాపారం సాగిస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. జనవరిలో పరారైన అక్రమార్కులు జిల్లాలో జరుగుతున్న పైరసీ సీడీల దందాపై హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌కు సమాచారం అందింది. అక్కడి నుంచి సంబంధిత అధికారులు జిల్లాకు చేరుకున్నారు. సదరు ముగ్గురు వ్యక్తులపై ఆరా తీశారు. అయితే స్థానిక పోలీసులతో సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులు దాడుల గురించి తెలుసుకుని భార్యా పిల్లలతో సహా ఇంటిని విడిచి పరారయ్యారు. కొంతకాలం రహస్యంగా గడిపారు. తమకు తెలిసిన నేతలు, పోలీసులతో బేరసారాలు చేశారు. విషయం బయటపడకుండా సద్దు మణిగించారు. దీంతో ఫిల్మ్ చాంబర్ అధికారులు వెనక్కి తిరిగారు. పోలీసులకు తెలిసినా.. ఆనంవారి వీధిలో జరిగే ఈ పైరసీ దందా బాగోతం సంబంధిత మూడో నగర పోలీసులకు తెలుసు. అయినా ఏ నాడూ పోయి దాడులు చేసిన పాపాన పోలేదు. దాడులు చేయకపోవడమే కాదు. ఎవరైనా దాడులు చేసేందుకు స్థానిక పోలీసుల సహకారం కోరినా ఆ సమాచారాన్ని వెంటనే వారికి చేరవేస్తారు. తాజాగా విడుదలైన సుప్రీమ్, సరైనోడు చిత్రాల పైరసీ సీడీలు ఆనం వారి వీధిలో పట్టపగ లు రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం. తిమింగలాలను వదిలి... చిన్నచేపలను పట్టి ఆనంవారివీధిలో వ్యాపారం చేసే వారి నుంచి పైరసీ సీడీలు తెచ్చుకుని అమ్ముకుంటున్న వ్యాపారులపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. నెల్లూరు రూరల్ , కొడవలూరు తదితర ప్రాంతాల్లో కేసులు సైతం నమోదు చేశారు. వాస్తవానికి వీరి తెరవెనుక ఉన్న పైరసీ డాన్ల గుట్టురట్టు చేయలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నా జిల్లాలో శూన్యం రాష్ట్రంలోని అనంతపురంలో రామకృష్ణను, ఒంగోలులో సందాని, గుంటూరులో పూర్ణ, రైల్వేకోడూరులో రవి, ఏలూరులో సునీల్, రాముడు, విజయవాడలో భాస్కర్‌రావు, వైజాగ్‌లో రాజేష్‌ను పైరసీ సీడీల కేసులో ఫిల్మ్‌చాంబర్, స్థానిక పోలీసులు పట్టుకుని వారిని కటకటాల్లోకి పంపారు. నెల్లూరులో మాత్రం పైరసీని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. పైరసీ డాన్లకు సహకరిస్తున్న ఐడీ పార్టీ పోలీసుల సెల్‌ఫోన్ డేటాను వెలికితీస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. జనవరిలో జరిపిన లావాదేవీలు, సంభాషణలు బయటకు వస్తే పోలీసుల అవినీతి గుట్టురట్టయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఎస్పీ విశాల్‌గున్నీ పైరసీని రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైరసీ జరుగుతోందిలా.. సినిమా విడుదలైన రోజే సుకుమార్, సుబ్రహ్మణ్యం, రత్నం తిరుపతికి చెందిన భాస్కర్, మైసూరు, బెంగళూరుకు చెందిన కృష్ణారెడ్డి, వెంకటేష్‌లు సినిమాను ఫైల్ జిల్లా, జీమెయిల్ తదితర సాఫ్ట్వేర్ల ద్వారా పంపుతున్నట్లు సమాచారం. నెల్లూరుకు చెందిన ముగ్గురు వాటిని డౌన్‌లౌడ్ చేసుకుని డంపర్ల ద్వారా కాపీలను తయారు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన కలర్పోస్టర్ను చెన్నై ద్వారా తెచ్చుకుంటారు. వాటిలో సీడీలను ఉంచి విక్రయాలను జరుపుతున్నారు. సినిమాను పంపుతున్న ముగ్గురు వ్యక్తులు పైరసీ సీడీల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. -
బెజవాడలో పైరసీ సీడీల ముఠా గుట్టురట్టు
విజయవాడ : పైరసీ సీడీల ముఠా గుట్టును విజయవాడ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. విజయవాడ వన్‌టౌన్‌లోని కొత్తపేట డ్రెయిన్ వీధిలో పైరసీ సీడీల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 5 వేల పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తాజాగా విడుదలైన జతకలిసే, సౌఖ్యం సినిమాలతోపాటు బెంగాల్ టైగర్, శంకరాభరణం తదితర చిత్రాలకు చెందిన పైరసీ సీడీలు ఉన్నాయి. అలాగే త్వరలో విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన సీడీ కవర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పైరసీ సీడీల నిర్వాహకుడు టి సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బెంగళూరు బస్సులో బాహుబలి సీడీలు స్వాధీనం
చిత్తూరు: రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి చిత్రం పైరసీకి గురికాకుండా కఠిన చర్యలు తీసుకున్నా.. పైరసీ బెడద తప్పడంలేదు. తాజాగా సోమవారం చిత్తూరు జిల్లాలో 50 పైరసీ బాహుబలి సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో వీటిని తీసుకెళ్తుండగా పలమనేరు పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో చార్మినార్ సమీపంలో సీడీ షాపులపై పోలీసులు దాడి చేసి 115 పైరసీ సీడీలు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. ప్రభాస్, రానా, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించిన బాహుబలి శుక్రవారం విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తున్న సంగతి తెలిసింది. -
బాహుబలి పైరసీ సీడీలు స్వాధీనం
-
బాహుబలి పైరసీ సీడీలు స్వాధీనం
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి సినిమా పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో చార్మినార్ సమీపంలో పోలీసులు సీడీ షాపులపై దాడులు చేశారు. 115 పైరసీ సీడీలు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. ప్రభాస్,రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించిన బాహుబలి శుక్రవారం విడుదలయిన సంగతి తెలిసిందే. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసింది. పైరసీ భూతం అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయినా బాహుబలి విడులయిన రెండు రోజుల్లోనే పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చాయి. పోలీసుల దాడులు చేసి పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. -
'లింగా' పైరసీ సీడీలు సీజ్!
గుంటూరు: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డిసెంబర్ 12న శుక్రవారం విడుదలైన లింగా చిత్రానికి సంబంధించి పైరసీ సీడీలను పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో భారీ సంఖ్యలో పైరసీ సీడీలు లభించడం కలకలం రేపింది. సినిమా విడుదలతోనే సీడీలు కూడా బయటకు రావడం సినీ వర్గాల్లో అలజడి సృష్టించింది. పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో లింగా చిత్రానికి సంబంధించి మూడు వేల సీడీలు లభించగా, రెండు వేలకు పైగా గీతాంజలి సీడీలు, ముఫ్పై వేలకు పైగా ఇంగ్లిష్ మరియు తెలుగు సినిమా సీడీలు దొరికాయి. మొత్తంగా నలభై ఎనిమిది వేలకు పైగా సీడీలను పోలీసులు సీజ్ చేశారు. దీంతో పాటుగా 22 కంప్యూటర్ మోనిటర్లను, ఆరు ఇన్వెర్టర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హీరో విశాల్ ఫిర్యాదుతో ఇద్దరి అరెస్ట్
చెన్నై : సినీ నటుడు విశాల్ ఫిర్యాదుతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం పూజై. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ కారైకుడిలో జరుగుతోంది. షూటింగ్ పూర్తి కాగానే విశాల్ తాను బస చేసిన హోటల్‌కు వెళ్లి కాసేపు టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు వీక్షించారు. అనంతరం లోకల్ ఛానల్స్ తిలకించిన విశాల్ షాక్ అయ్యారు. ఇటీవలే విడుదలైన రెండు తమిళ చిత్రాలను ఎలాంటి హక్కులు లేకుండా ప్రదర్శిస్తుండడమే. దీంతో విశాల్ కారైకుడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పైరసీకి పాల్పడిన పళ్లత్తూర్ ముహ్మద్ మంజూర్, సంపత్ లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పైరసీ సీడీల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి రేయింబవళ్లు శ్రమించి రూపొందిస్తున్న చిత్రాలను పైరసీ సీడీల ద్వారా అక్రమంగా లబ్ధి పొండటం నీచమయిన చర్య అన్నారు. వారి న్యాయమైన శ్రమను అక్రమంగా దోచుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఎవడు, 1 నేనొక్కడినే పైరసీ సీడీలు స్వాధీనం
ఖమ్మం : తెలుగు చిత్ర పరిశ్రమను పైరసీ రక్కసి వెంటాడుతూనే ఉంది. మొన్న కృష్ణాజిల్లా....నేడు ఖమ్మం జిల్లాలో ఇటీవలి విడుదలైన ఎవడు, 1 నేనొక్కడినే చిత్రాల పైరసీ సీడీలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తాజాగా పాల్వంచలో ఈ రెండు చిత్రాల పైరసీ సీడీలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పైరసీ సీడీలు విక్రయిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు సీడీ షాపులపై దాడులు చేశారు. ఈ సందర్భంగా పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న పలు ప్రాంతాల్లో ఎవడు, 1 నేనొక్కడినే పైరసీ సీడీలు స్వైర విహారం చేస్తున్నాయి. -
బెజవాడలో '1 నేనొక్కడినే' పైరసీ సీడీలు!
విజయవాడ : హీరో మహేష్ బాబు తాజా చిత్రం 1 నేనొక్కడినే' పైరసీ సీడీలు బెజవాడలో హల్చల్ చేస్తున్నాయి. విజయవాడ, కృష్ణాజిల్లా చుట్టుపక్కల ఈ చిత్రం పైరసీ సీడీలు విచ్చలవిడిగా మార్కెట్లో లభ్యం అవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఆదివారం విడుదలైన రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం పైరసీ సీడీలను ఈరోజు రాత్రి మార్కెట్లోకి విడుదల చేసేందుకు పైరసీ మాఫీయా రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి డౌన్‌లింక్ పాస్‌వర్డ్‌ను విడుదల చేసింది. కాగా ఈ పైరసీకి జిల్లాకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇతనికి చిత్రపరిశ్రమలోని పెద్దల సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పైరసీ సీడీలపై నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందే సీడీల రూపంలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
‘అత్తారింటికి దారేది’ పైరసీ కలకలం
సాక్షి (మచిలీపట్నం/పెడన), న్యూస్‌లైన్ : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు సమైక్య సెగ ఇబ్బందికరంగా మారిన తరుణంలో పైరసీ భూతం మరింత కలవరపెడుతోంది. ఈ సినిమా రూ.50లకే పైరసీ సీడీలు పెడనలో దొరుకుతున్నాయని, ఒక టీవీ చానల్‌కు అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌కాల్‌తో కలకలం రేగింది. విడుదలకు ముందే ఈ సినిమా పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చాయన్న ప్రచారం జరగడంతో చిత్ర నిర్మాత రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. కాగా, సదరు టీవీ చానల్ దీనికి మరింత మసాలా దట్టించి, పైరసీ సీడీలు కృష్ణా జిల్లా పెడనలో దొరుకుతున్నట్లు ప్రత్యేక కథనాన్ని ప్రచారం చేసింది. దీంతో ఎలక్ట్రానిక్ మీడియా వ్యాన్లు సోమవారం పెడనలో చక్కర్లు కొట్టాయి. ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదేశాలతో డీఎస్పీ కేవీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీస్ ప్రత్యేక బృందాలు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ సెంటర్లు, సీడీ షాపులపై దాడులు చేశారు. ఎక్కడా పైరసీ సీడీలు దొరక్కపోయినప్పటికీ పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సంగతి తెలుసుకున్న పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున మొబైల్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద గుమిగూడారు. ర్యాలీలు చేస్తూ పెడన బస్టాండ్ సెంటర్లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పైరసీని అరికట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. అత్తరింటికి దారేదీ సినిమా సీడీ పెడనలోని మొబైల్ షాపుల్లో దొరుకుతోందని రెండు రోజుల క్రితం ఒక టీవీ చానల్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. సినిమా నిడివి (1.5 మెగా బైట్స్) 65 నిమిషాలు పాటు ఉంటుందని, దాన్ని సీడీలు, సెల్ మెమరీ కార్డుల్లోకి కాపీ చేసి రూ.50కి అమ్ముతున్నట్టు చెప్పాడు. తాను వడ్లమన్నాడు గ్రామానికి చెందిన రమేష్ అని, పెడనలోని గూడూరు రోడ్డులో దేవీ మొబైల్ షాపులో కొనుగోలు చేశానన్నాడు. కాగా, పైరసీ సీడీల్లో ఆ సినిమా మొదట నుంచి చివరి వరకు ఉందని మధ్య మధ్యలో కొన్ని బిట్లు లేవని సీడీలు చూసిన కొంత మంది తెలిపారు. దీనిపై ఓ చానల్ ప్రతినిధులు జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావుకు సీడీని అందజేశారు. ఆయన ఆదేశంతో బందరు డీఎస్సీ డాక్టర్ కేవీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ పల్లంరాజు పలువురు ఎస్సైలు మొబైల్ షాపులను తనిఖీ చేశారు. తొలుత దేవీ మొబైల్స్ షాపును పరిశీలించగా అక్కడేమి దొరకలేదు. దీంతో సీఐ పల్లంరాజు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, ఇంటర్నెట్ కంప్యూటర్ షాపులను తనిఖీ చేసి షాపుల్లో ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా టీవీ చానల్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వ్యక్తి నంబరు మనుగడలో లేదని విచారణలో తేలింది. యూ ట్యూబ్ ద్వారా వచ్చిందా? ఇటీవలే అత్తారింటికి దారేదీ సినిమా అడియో ఫంక్షన్ హైదరాబాదులో జరిగింది. ఆ సమయంలో కొన్ని ైట్రెలర్స్ను విడుదల చేశారు. అలాంటి వాటినన్నింటినీ కలిపి యూట్యూబ్‌లో పెట్టి ఉండవచ్చని, పలువురు యువకులు నెట్ సహాయంతో డౌన్లోడ్ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో సినిమా విడుదల కాకుండనే సినిమా సీడీ బహిరంగ మార్కెట్లోకి వచ్చిందని పుకార్లు వచ్చి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. లోతుగా దర్యాప్తు : డీఎస్పీ ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. పెడనలో పలు మొబైల్ షాపులను పరిశీలించగా ఎలాంటి ఆధారాలు దొరక లేదన్నారు. పలు షాపుల యజమానులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లు, మెమరీ కార్డులను ఐటీ నిపుణులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సమాచారం అందించిన వ్యక్తి వడ్లమన్నాడు గ్రామానికి చెందినతనుగా చెప్పడంతో అక్కడ ఉన్న నాలుగు మొబైల్ షాపులను పరిశీలించి అక్కడ వారిని కూడా అదుపులోకి తీసుకున్నటుల తెలియజేశారు. టీవీ చానల్‌కు వచ్చిన ఫోన్ నంబరును సేకరించామని, ఆ నంబరు రెండు రోజులుగా పనిచేయడం లేదని తెలిపారు. అయితే ఆ నంబరు కాల్స్ లిస్టును సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భగ్గుమన్న పవన్ ఫ్యాన్స్.. పైరసీ సీడీల విషయమై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. వందల సంఖ్యలో అభిమానులు బస్టాండ్ ఎదుట గంట సేపు చిలంకుర్తి పృద్వీ ప్రసన్న నేతృత్వంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న విలేకరులతో మాట్లాడుతూ ఏ హీరో సినిమాను పైరసీ చేస్తే ఊరుకునేది లేదన్నారు. కోట్లాది రుపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తే.. థియేటర్లోకి వెళ్లి చూడకుండా పైరసీ సీడీలు కొనుగోలు చేసి చూడటం దౌర్భాగ్యం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు ఉద్యమిస్తారని హెచ్చరించారు.