ఖమ్మం : తెలుగు చిత్ర పరిశ్రమను పైరసీ రక్కసి వెంటాడుతూనే ఉంది. మొన్న కృష్ణాజిల్లా....నేడు ఖమ్మం జిల్లాలో ఇటీవలి విడుదలైన ఎవడు, 1 నేనొక్కడినే చిత్రాల పైరసీ సీడీలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. తాజాగా పాల్వంచలో ఈ రెండు చిత్రాల పైరసీ సీడీలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పైరసీ సీడీలు విక్రయిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు సీడీ షాపులపై దాడులు చేశారు. ఈ సందర్భంగా పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న పలు ప్రాంతాల్లో ఎవడు, 1 నేనొక్కడినే పైరసీ సీడీలు స్వైర విహారం చేస్తున్నాయి.