yevadu
-
చరణ్ సినిమాకు బన్నీ వాయిస్..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఎవడు. ఈ సినిమాలో చరణ్, అర్జున్ తెర మీద కలిసి కనిపించకపోయినా.. అల్లు అర్జున్ చేసిన అతిథి పాత్ర సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది. ఎవడు సినిమా తరువాత రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో పూర్తి స్థాయి మల్టీ స్టారర్ రానుందన్న వార్తలు వినిపించాయి. అయితే సరైన కథ దొరక్కపొవటంతో ఇంత వరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే మరోసారి రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు కలిసి ఒకే సినిమాకు పనిచేయబోతున్నారన్న వార్త మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఓ రీమేక్ సినిమా ఆ కోసం చరణ్, అర్జున్‌లు కలిసి పనిచేయనున్నారు. అయితే ఇది కూడా పూర్తి స్థాయి మల్టీ స్టారర్ సినిమా కాదని తెలుస్తోంది. కన్నడలో ఘనవిజయం సాధించిన బహద్దూర్ సినిమాను రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలో కోసం అల్లు అర్జున్ కూడా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఎవడు సినిమాలో కీలక పాత్రలో నటించిన బన్నీ, బహద్దూర్ రీమేక్‌కు వాయిస్ ఓవర్ అందించనున్నాడు. ఒరిజినల్ వర్షన్‌కు కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ వాయిస్ అందించాడు. దీంతో తెలుగులోనూ అదే స్థాయి ఇమేజ్ ఉన్న హీరో అయితే కరెక్ట్ అని భావించిన అల్లు అరవింద్, అల్లు అర్జున్‌తో వాయిస్ చేయించాలని నిర్ణయించాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ఎవడు తమిళ గీతాల ఆవిష్కరణ
ఎవడు చిత్రం తమిళ వెర్షన్ గీతాలావిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో జరిగింది. తెలుగులో రామ్ చరణ్ తేజ, అల్లుఅర్జున్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎవడు. కాజల్ అగర్వాల్,ఎమిజాక్సన్, శ్రుతిహాసన్ ముగ్గురు బిగ్ బ్యూటీస్ నటించిన కలర్‌ఫుల్ భారీ యాక్షన్ చిత్రం ఇది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ విభిన్న కథా చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. ఇంతకు ముందు వంబు, భద్ర, గాయత్రి ఐపీఎస్,భాష వంటి విజయవంతమైన చిత్రాలను అందించి రీసెంట్గా శ్రీమంతుడు చిత్రాన్ని సెల్వందన్ పేరుతో విడుదల చేసి హిట్‌ను అందుకున్న భద్రకాళీ ఫిలింస్ అధినేత భద్రకాళీ ప్రసాద్ ఏవీవీఎస్.నాయుడు సమర్పణలో మగధీర పేరుతో అందించనున్నారు. అడ్డాల వెంకట్రావు సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఏఆర్కే రాజా మాటలు రాసిన ఈ చిత్ర ఆడియోను సీ.కల్యాణ్, జాక్వుర్ తంగం ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది. చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తునట్లు చిత్ర నిర్మాత వెల్లడించారు. -
తమిళంలో ఎవడు మగధీర
రామ్‌చరణ్, అల్లు అర్జున్ కథానాయకులుగా నటించిన టాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రం ఎవడు. కోలీవుడ్‌లో మగధీరగా రానుంది. ముగ్గురు ముద్దుగుమ్మలు కాజల్, శ్రుతిహాసన్, ఎమిజాక్సన్ కథానాయికలుగా అభినయంతో పాటు అందాలు తెరపై ఆరబోసిన కలర్‌ఫుల్ చిత్రం ఎవడు. ఇంతవరకు భారతీయ సినిమాలో రానటువంటి ఒక కొత్త పాయింట్‌తో భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, ప్రతీకారం, యాక్షన్ సన్నివేశాలకు ప్రాముఖ్యత నిస్తూ పక్కా కమర్షియల్ చిత్రంగా ఉంటుంది. ప్రస్తుతం నాగార్జున, కార్తీతో హీరోలుగా ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వంశీ పైడిపల్లి ఈ ఎవడు చిత్రానికి దర్శకుడు. ఒక యువకుడు రెండు రూపాలు. అదెలా, ఎందుకు మారాల్సి వచ్చింది అన్న ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఎవడు చిత్రాన్ని తమిళంలో మగధీరగా ఏవీవీఎస్నాయుడు సమర్పణలో భద్ర కాళీ ఫిలిం పతాకంపై భద్రకాళి ప్రసాద్ అనువదిస్తున్నారు. ఈయన ఇంతకుముందు తమిళంలో వంబు, భద్రత, గాయత్రి ఐపీఎస్, హిందీలో భాష, తదితర చిత్రాలను అనువదించారన్నది గమనార్హం. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటున్న మగధీర చిత్రాన్ని వచ్చే నెలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చిత్రానికి ఏఆర్కే రాజా మాటలను, వివేకా, స్నేహన్, అరుణ్ భారతి, మీనాక్షి సుందరం పాటలు రాస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. -
ముచ్చటగా మూడోసారి..!!
-
వంశీ పైడిపల్లి కొత్త చిత్రమేదీ ?
-
టార్చర్ అనుభవించాను!
‘‘ ‘గబ్బర్‌సింగ్’ కథ విన్నప్పుడు... ‘ఒక హిట్ సినిమా కథ విన్నాను’ అనిపించింది. అనుకున్నట్లే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. ‘ఎవడు’ కథ విన్నప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. ఆ సినిమా కూడా పెద్ద హిట్. అయితే... ఈ ఇద్దరు హీరోలూ ఒకే కుటుంబానికి చెందిన వారవ్వడం యాదృచ్ఛికం. మెగా హీరోలు నాకు కలిసొచ్చిన మాట నిజమే. కానీ.. ఆ సెంటిమెంట్లను మాత్రం నేను నమ్మను. సక్సెస్ అనేది కథ, దర్శకత్వం మీదే ఆధారపడి ఉంటుందని నమ్ముతాను’’ అని శ్రుతిహాసన్ అన్నారు. రామ్‌చరణ్ సరసన ఆమె నటించిన చిత్రం ‘ఎవడు’. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ‘దిల్’రాజు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు, అందులోని తన పాత్రకు వస్తున్న స్పందనపై శ్రుతి సంతోషం వెలిబుచ్చారు. ‘‘ఈ ఏడాది ప్రారంభంలో ‘ఎవడు’ రూపంలో మంచి విజయం దక్కడం ఆనందంగా ఉంది. చరణ్‌తో పనిచేయడం నిజంగా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. తన డాన్సులు నిజంగా సూపర్బ్. ఈ సినిమాలో నేను తనతో అడుగు కదిపాను. ‘నీ జతగా నేనుండాలి’, ‘నిన్ను చూడకుంటే చాలు’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో డాన్సులు, ఛేజ్‌లు ఎక్కువ ఉండడంతో టార్చర్ అనుభవించాను. సినిమా హిట్ అవ్వడంతో పడ్డ కష్టం మొత్తం దూదిపింజలా ఎగిరిపోయింది’’ అని ఆనందం వ్యక్తం చేశారు శ్రుతిహాసన్. దిల్ రాజు ప్రొడక్షన్లో ఇప్పటికి మూడు సినిమాల్లో నటించానని, ఓ హీరోలా అనిపిస్తారని ఈ సందర్భంగా శ్రుతి కొనియాడారు. -
హీ ఈజ్ ఎ రియల్‌స్టార్!
‘ఎవడు’లో సెకండ్ హీరోయిన్గా చేసిన అమీ జాక్సన్ హీరో రామ్‌చరణ్‌ని పొగడ్తల్లో ముంచెత్తేస్తోంది. ‘‘చరణ్ పక్కన నటించే చాన్సు రావడం నిజంగా నా అదృష్టం. హీ ఈజ్ ఎ రియల్‌స్టార్. చరణ్‌కు చాలామంది అభిమానులున్నారు. తన పక్కన యాక్ట్ చేయడంతో నాక్కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. చరణ్ డాన్సులు కూడా బాగా చేస్తాడు. తనతో కలిసి డాన్స్ చేయడాన్ని చాలా ఆస్వాదించాను’’ అని చెప్పింది అమీ. ‘ఎవడు’ విజయం తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెబుతూ -‘‘కథతో పాటు ట్రావెల్ అయ్యే విధంగా నా పాత్రను తీర్చిదిద్దిన దర్శకుడు వంశీ పైడిపల్లికి థ్యాంక్స్. భారీ సినిమాలు నిర్మించే ‘దిల్’ రాజు సంస్థలో పనిచేయడాన్ని ఎప్పటికీ మరచిపోను’’ అని సంబరపడిపోయింది. -
అల్లు అర్జున్ కు కూతురు పుట్టింది!
సంకాంత్రి పండుగ, ఎవడు ఘన విజయం సాధించడంతోపాటు, మరో సంఘటన అల్లు, మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపింది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఓ పండంటి బిడ్డకు తండ్రయ్యాడు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు ఆడపిల్లకు జన్మనిచ్చారని తెలిసింది. రెండేళ్ల క్రితం అర్జున్, స్నేహారెడ్డిలకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తమ కుటుంబంలోకి కొత్తగా మరో సభ్యురాలు చేరడాన్ని అల్లు, చిరు కుటుంబాలు ఆహ్వానించాయి. బంధువులు, స్నేహితులు అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపారు. -
ఎవడు, 1 నేనొక్కడినే పైరసీ సీడీలు స్వాధీనం
ఖమ్మం : తెలుగు చిత్ర పరిశ్రమను పైరసీ రక్కసి వెంటాడుతూనే ఉంది. మొన్న కృష్ణాజిల్లా....నేడు ఖమ్మం జిల్లాలో ఇటీవలి విడుదలైన ఎవడు, 1 నేనొక్కడినే చిత్రాల పైరసీ సీడీలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తాజాగా పాల్వంచలో ఈ రెండు చిత్రాల పైరసీ సీడీలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పైరసీ సీడీలు విక్రయిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు సీడీ షాపులపై దాడులు చేశారు. ఈ సందర్భంగా పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న పలు ప్రాంతాల్లో ఎవడు, 1 నేనొక్కడినే పైరసీ సీడీలు స్వైర విహారం చేస్తున్నాయి. -
అల్లు ఆర్జున్, రామ్‌చరణ్ తో చిట్ చాట్
-
హీరో రామ్ చరణ్‌పై కేసు నమోదు
-
హీరో రామ్ చరణ్‌పై కేసు నమోదు
కర్నూలు : ప్రముఖ యువ హీరో రామ్ చరణ్‌పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రామ్ చరణ్ హీరోగా ఇటీవలి విడుదలైన 'ఎవడు' చిత్రంలో అశ్లీలత ఉందంటూ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేందర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీఎస్ సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. రామ్ చరణ్‌తో పాటు మరో ఆరుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. -
''ఎవడు'' టీమ్‌తో చిట్‌చాట్
-
సంక్రాంతి రేసులో 1 'ఎవడు'..!
భారీ బడ్జెట్‌తో తెరకెక్కించి, భారీ అంచనాలు రేకెత్తించిన సినిమా ఒకటి. విడుదల వాయిదా పడుతూ ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మరొకటి. రెండూ స్టార్ హీరోల సినిమాలే. రెండూ సంక్రాంతి రేసులో సందడి చేస్తున్నాయి. అవే ' ప్రిన్స్' మహేష్‌బాబు నటించిన '1' నేనొక్కడినే.. 'మెగా పవర్ స్టార్' రామ్ చరణ్ చిత్రం ఎవడు. రూ. 70 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిన '1' సినిమాను శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 1400 స్ర్కీన్లపై విడుదల చేశారు. ఓ దశలో 'అత్తారింటికి దారేది' సినిమా ప్రారంభ వసూళ్లను అధిగమిస్తుందని అంచనాలు రేకెత్తించినా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు లేవని విశ్లేషకులు అంటున్నారు. ఓపెనింగ్ రోజు రూ. 8.4 కోట్లు కలెక్షన్లు వసూలు సాధించింది. ఇక రామ్ చరణ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎవడు'కు హిట్ టాక్ రావడంతో అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో తొలి రోజున 9.03 కోట్లు వసూలు చేసిందని నిర్మాత దిల్ రాజు చెప్పారు. తొలిరోజు కలెక్షన్లను పోల్చితే మహేష్ '1' కంటే రామ్ చరణ్ 'ఎవడు' ముందంజలో నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. రామ్ చరణ్ కెరీర్లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఎవడు నిలిచింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంపై నిర్మాత దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఎవడు సక్సెస్ మీట్ లో దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మించిన చిత్రాల్లో అతిపెద్ద హిట్ అని చెప్పారు. ఎవడు భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోందని, బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగవచ్చని సినీ పండితులు చెబుతున్నారు. ఇక మహేష్ '1' హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ ప్రశంసలు వచ్చాయి. కలెక్షన్లు పుంజుకోవచ్చని ప్రిన్స్ అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తమ్మీద సంక్రాంతి రేసులో ఓవరాల్‌గా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఏదో నిలుస్తుందో చూడాలి.! -
'ఎవడు' మా బ్యానర్ లో అతిపెద్ద హిట్: దిల్ రాజు
రామ్ చరణ్ నటించిన యాక్షన్, థ్రిల్లర్ 'ఎవడు' చిత్రం ఘన విజయం సాధించడంపై ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఎవడు సక్సెస్ మీట్ లో దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మ్యా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మించిన చిత్రాల్లో అతిపెద్ద హిట్ అని అన్నారు. దిల్ రాజు నిర్మాతగా 16 చిత్రాలు నిర్మించగా, వాటిలో బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దిల్, బృందావనం, ఆర్య చిత్రాలు విజయం సాధించాయి. తాజాగా విడుదలైన ఎవడు బ్లాక్ బస్టర్ గా టాక్ తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్ లో తొలి రోజున 9.03 కోట్లు వసూలు చేసిందన్నారు. గత కొద్దికాలంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిందని.. తాను ఇంతటి విజయాన్ని సాధిస్తుందని ఊహించలేదు అని అన్నారు. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాంచరణ్ సరసన ఆమీ జాక్సన్, శృతి హసన్, నటించగా, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. -
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో...
సంక్రాంతి అంటేనే పందేల పండుగ. పది రోజుల ముందే పండుగ హడావిడి మొదలైనా... ఆ శోభకు శ్రీకారం జరిగేది మాత్రం ‘భోగి’ నుంచే. భోగిమంటలతో పోటీల పర్వం మొదలవుతుంది. ఇక ముగ్గుల పందేలతో ఆడవాళ్లు... కోడి పందేలతో మగాళ్లు... గాలిపటాల పందేలతో పిల్లలు... ఇలా చెప్పుకుంటూ పోతే... సర్వం పందేల మయం. వీటి మధ్య సినిమాల పందేలు. అప్పుడే బాక్సాఫీస్ దగ్గర వేడి మొదలైంది. మహేష్ ‘1’, చరణ్ ‘ఎవడు’ రిలీజులు ఇప్పటికే జరిగిపోయాయి. కనుమ దాటి ముక్కనుమకు చేరేసరికి విజయం ఎవరి సొంతమో తేలిపోతుంది. ఈ లోపు సరదాగా ‘భోగి స్పెషల్ సాంగ్స్’ని కాసేపు నెమరు వేసుకుందాం. భోగి పండుగ భోగం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఈ పాటలు నిజంగా తెలుగు దనానికి ప్రతికలే. భోగిమంటలు(1981) భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో... తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో... ఆచార్య ఆత్రేయ రాసిన ఈ పాట ఏ రోజు విన్నా... ఆ రోజే భోగి పండుగలా అనిపిస్తుంది. ఇక రమేశ్‌నాయుడు స్వరరచన తెలుగుదనానికి అద్దం పట్టిందనే చెప్పాలి. దీనికి తోడు కృష్ణ, రతి అగ్నిహోత్రిల అభినయం, విజయనిర్మల టేకింగ్ ఈ పాటకు హైలైట్స్. ‘భోగిమంటలు’ సినిమా వచ్చి 33 ఏళ్లు అవుతున్నా... ఇంకా ఈ పాట శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. బాలు, సుశీల, బృందం ఈ పాటను ఆలపించారు. దళపతి (1992) సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంటా పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగ జీవితాలే సాగాలంటా ఆడాలి ఈనాడు.. ఊరంతటా... రాగాల దీపాలటా.. నీకోసం.. వెలిగేనటా.. ఉల్లాసం.. నీవేనటా.. హోయ్ ఈ పాటను అనువాద గీతమంటే ఎవరైనా నమ్ముతారా? అంతగొప్పగా రాశారు రాజశ్రీ. ‘వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని.. కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకోమంటారా హోయ్. మూలబడివున్నా.. బుట్టా తట్టా తీసి.. భోగిమంటల్లోన నీవే వెయ్యరా..’ అంటూ.. భోగి పండుగ పరమార్థాన్ని రెండే ముక్కల్లో చెప్పారాయన. రాజశ్రీ అక్షరాలకు ఇళయరాజా స్వరరచన తోడైతే.. ఇక చెప్పేదేముంది! శ్రోతలు పులకించక ఏంచేస్తారు? నిజంగానే అంతగా ఆకట్టుకుందీ పాట. పైగా ఈ పాట పాడింది ఎవరనుకున్నారు.. కె.జె.ఏసుదాస్, ఎస్పీబాలు. ఇద్దరూ అగ్రగణ్యులే. పాటకు పట్టాభిషేకం చేసినవారే. ఇక చేసింది తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి. తీసింది మణిరత్నం. ఇంతమంది ఘనాపాటీలు కలిశారు కాబట్టే రెండు దశాబ్దాలు దాటినా ఇంకా ఈ పాటను జనాలు ఇష్టపడుతూనే ఉన్నారు. రాముడొచ్చాడు (1996) మా పల్లే రేపల్లెంటా... ఈ పిల్లే రాధమ్మంటా... రేగుతుంటే భోగిమంట.. రేగుపళ్ల విందులంటా రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో మంచుపూల జల్లులంటా మంచెకాడ గిల్లుడంటా మంచమేస్తే సంకురాత్రి తిరునాళ్ళో పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా ఉంటే పండగ. భోగి పండుగ శోభ అంతా ఈ పాటలోనే కనిపిస్తుంది కదూ! మరి వేటూరా మజాకా. సిటీల్లో పరిస్థితి ఎలా ఉన్నా... పల్లెల్లో యువతరానికి సంక్రాంతి అంటే నిజంగా పెద్ద సంబరమే. పట్టు పరికిణీల్లో అమ్మాయిలూ, టిప్పుటాప్పుగా అబ్బాయిలూ... అలకలు, అల్లర్లు, సరదాలు, సరాగాలు అన్నింటికీ వేదిక సంక్రాంతి. ‘రేగుతుంటే భోగిమంట...రేగుపళ్ల విందులంటా... రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో...’ అని వేటూరి రాసింది అందుకే. ఎస్పీబాలు, చిత్ర, బృందం ఆలపించిన ఈ పాటకు స్వరరచన చేసింది రాజ్. ఆయన సంగీతం సమకూర్చిన హిట్ సాంగ్స్‌లో ఇదీ ఒకటి. ఇక నాగార్జున, సౌందర్యల అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా! సిందూరం (1997) ఏడుమల్లెలెత్తు సుకుమారికి ఎంత కష్టమొచ్చింది నాయనో.. భోగిపళ్లు పోయాలి బేబికి.. ఏమి దిష్టి కొట్టింది నాయనో.. ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెమట్లు పట్టాయిరో... మంచు బొట్లు ఆ బుగ్గలో అగ్గిచుక్కలైనాయిరో... పల్లెల అందాలు ఏ తీరుగా ఉంటాయో ఈ పాట చూస్తే అర్థమైపోతుంది. అలముకున్న మంచు పొరల మాటున పరుచుకున్న పచ్చదనం, భగభగ మండుతున్న భోగి మంటలు, పాలపుంతల్ని తలపించే సంక్రాంతి ముగ్గులు. వీటికి దీటుగా అందమైన అమ్మాయిలు. వాళ్లనే టార్గెట్ చేస్తూ సిరివెన్నెల కలం కదిపారు. ఆ అక్షరాలను స్వరబద్ధం చేసే బాధ్యతను సంగీత దర్శకుడు ‘శ్రీ’ తలకెత్తుకున్నాడు. తండ్రి చక్రవర్తిని తలపించాడు కూడా. కృష్ణవంశీకి తెలుగుదనంపై ఉన్న మమకారం మొత్తం ఈ పాటలో కనిపిస్తుంది. ఇక పరికిణీలో సంఘవి అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగమ్మాయి కాకపోయినా.. బాపు బొమ్మనే గుర్తుచేసింది. ఇక రవితేజ గురించి తెలిసిందేగా! ఓవరాల్‌గా అందర్నీ రంజింపజేసేసిందీ పాట. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా పాటలొచ్చాయి కానీ, భోగి పాటలు మాత్రం తక్కువే. అయినా... వచ్చిన ప్రతిపాట అందర్నీ అలరించి, మన సంప్రదాయ విలువలకు అద్దం పట్టింది. కొన్నేళ్లుగా ఇలా పండుగల్ని ప్రతిబింబించే పాటలు సినిమాల్లో కరువయ్యాయి. ‘ట్రెండ్’ అంటూ... క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ, విదేశాల చుట్టూ సినిమా పాట తిరుగుతోంది. మన ‘సోల్’ ఏంటో మనం మరిచిపోతున్న పరిస్థితి ప్రస్తుతం సినిమాల్లో నెలకొని ఉంది. పాశ్చాత్య పోకడలను ప్రతిబింబించే ఈ విధానాలను భోగిమంటల్లో ఆహుతి చేస్తూ... మన సంస్కృతిని ప్రతిబింబించే కొత్తదనాన్ని తెలుగు సినిమా ఆహ్వానించాలని ఆశిద్దాం. -
'ఎవడు' చిత్రంపై ప్రముఖుల, అభిమానుల ట్వీట్స్!
రామ్ చరణ్, శృతి హసన్, అల్లు అర్జున్, కాజల్ నటించిన 'ఎవడు' చిత్రం జనవరి 12న విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు రూపొందించిన ఈ చిత్రంపై పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. Congratulations YEVADU team on the success!!! Vamsi grasped the nuances of commercial film making. Spl mention to jaani, he made good use of — rajamouli ss (@ssrajamouli) January 12, 2014 Im Happy to share that my role is being well appreciated and especially Mega Fans are loving me in #Yevadu Happy to be part of this MEGA HIT — Sashaank (@Shashanksye) January 12, 2014 Success of a film depends not just on what story speaks; but on high emotional peaks. #Yevadu scored in both. — sirasri (@sirasri) January 12, 2014 Ramcharan showed matured performance,Bunny presence is plus,BGM by @ThisIsDSP is excellent.Overall one time watchable.#Yevadu — mourya (@vamsimourya) January 12, 2014 #Yevadu is llike cheap liquor. #1Nenokkadine is like French wine. Now ur Turn to Select Wat U Want" — Mohammad Rafi Shaik (@RafiPrincefan) January 12, 2014 Avg movie - With excellent RR did the magic #yevadu — Akhil Chennupati (@akhilchennupati) January 12, 2014 2 stories (or) 2 movies packed in one i.e. #Yevadu — PHANEENDRA (@phaneendra_p1) January 12, 2014 #1Nenokkadine is 100 times better than Yevadu.... Amy Jackson has more screen presence than Sruthi hasan...!! — Ravi Vaddepally (@ravi251291) January 12, 2014 Special mention to DSP BGM... As I said before Stalin Indra taravtaa aa range BGM yevadu ki undi ... — KC (@krishna84) January 12, 2014 watched #Yevadu finally....definitely entertaining but lags in few parts here nd ther....Comedy is less compared to othr charan movies.... — Jilla Mass (@superstancer) January 12, 2014 If any credit, Vakkantham Vamsi should get it for coming up with the Plot Idea of #Yevadu..He sure has great ideas within Commercial Format! — Varun Vallabhaneni (@vva_run) January 12, 2014 Teesina cinemale tippi tippi enni sarlu teestharra babu #yevadu .. malli danni hit antaru ento ee mega fans mararra — Rohith (@pvrsunny) January 12, 2014 Kajal ni champese scene tears...charan intro scene superbbb..loving the movie #Yevadu — Pawan Kalyan (@PawanKalyanFan) January 12, 2014 #Yevadu is a straight hatrick hit for ramcharan after racha and naayak. The basti episodes emotion worked well. Film caters to everybody — idlebrain jeevi (@idlebrainjeevi) January 12, 2014 A typical revenge drama/mass entertainer...kinda long...but then...it hardly matters I suppose, because people are loving it #Yevadu — Hemanth Kumar C R (@crhemanth) January 12, 2014 #Yevadu : A Revenge story dealt in a good manner. 1st half was interesting and 2nd half had some good moments. Its a team effort. Liked it. — T.H.A.R.U.N (@Tharun_Yeluguri) January 12, 2014 Freedom song ki #Ramcharan vesina dance superb , Naayak lo Laila o Laila eppudu #Yevadu lo Freedom — kiran ponkal (@kiran_ponkal) January 12, 2014 Yevadu... full commercial flick.. hil8 is the response came from audience after seeing 'pawan' on screen.. ;) bindassssssssss :D — Sandeep Grandhi (@grandhisandeep) January 12, 2014 Ram Charan was the obvious choice. Nobody else could have carried the plastic operated, expressionless face throughout the film. #Yevadu — prithvi chandra (@prithvivar) January 12, 2014 I am sure #SaiKumar will get similar kind of roles in coming days. He has given fantastic performance in #Yevadu — FAN OF PAWAN KALYAN (@PSPK55) January 12, 2014 #Yevadu is a routine revenge drama. Strictly average flick. Commercial hit . BO wise Nayak ki more or less. — vivek (@vivek_venkyfan) January 12, 2014 Ye mataki aa mata chepukovali..Single expression tho avg content tho oka movie ni hit cheyali ante adi only charan ke possible! :D #Yevadu — Goutham Reddy (@gouthamreddybr) January 12, 2014 #Yevadu - Regular Mass Masala Entertainer...Charan kummedu...Ee matram chalu migathadi pandaga / fans Chuskuntaru... Rating : 3/5 .. — Venkatesh Venky (@venkybest) January 12, 2014 #yevadu oke cinema meedha 2 cinemas chupinchadu direction charan fails As actor — Raghavendra (@raghava4mahesh) January 12, 2014 #Yevadu is watched.Charan role allu arjun chesunte bagundedi anipinchindi throughout d movie.I was literally searching 4 charans expressions — Vamsi (@VamsiPannala) January 12, 2014#Yevadu is d sankranthi winner ..will end in all time top5 ... 4 movies in top 5 belongs to mega heroes....Mega Family Rules ..Topic is Over— sambi reddy (@imsambi) January 12, 2014 -
'ఎవడు'పై మీ రివ్యూ, అభిప్రాయాల్ని వెల్లడించండి
సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఎవడు చిత్రం సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన 'ఎవడు' చిత్రంపై మీ అభిప్రాయాల్నితెలియచేయండి. -
సినిమా రివ్యూ: ఎవడు
పాజిటివ్ పాయింట్స్: రాంచరణ్ యాక్టింగ్ వంశీ పైడిపల్లి డెరైక్షన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ మైనస్ పాయింట్స్: కామెడీ మితిమీరిన హింస సత్య(అల్లు అర్జున్), దీప్తీ (కాజల్) ప్రేమికులు. ధీరూభాయ్(రాహుల్ దేవ్)అనే గూండా దీప్తిని చూసి ఇష్టపడతాడు. దీప్తి కోసం ధీరూభాయ్ గుండాలు వెంటాడుతుంటారు. దీప్తి ప్రేమ కోసం ధీరూభాయ్‌ని ఎదిరించడానికి సిద్ధమవుతాడు. కాని గుండాలతో సత్య గొడవ పడటం దీప్తికి ఇష్టం ఉండదు. దాంతో సత్య, దీప్తిలు హైదరాబాద్ నుంచి పారిపోవాలనుకుంటారు. కాని ధీరుభాయ్ మనుషులు చేసిన ఎటాక్‌లో దీప్తి చనిపోగా, ముఖం కాలిపోయి, తీవ్ర గాయాలతో, కొన ఊపిరితో ఆస్పత్రిలో చేరిన సత్యకు చరణ్ రూపు రేఖల్ని కల్పించి డాక్టర్(జయసుధ) బ్రతికిస్తుంది. ఆతర్వాత దీప్తిని తనకు కాకుండా చేసిన ధీరూభాయ్ గ్యాంగ్‌ను చరణ్ రూపంలో ఉన్న సత్య చిత్ర తొలిభాగంలోనే మట్టుపెడుతాడు. అంతా అయిపోయిందని భావించే తరుణంలో చరణ్‌ను చంపడానికి ఎటాక్ జరుగుతుంది. అయితే చరణ్ ఎవరు? చరణ్‌పై ఎందుకు ఎటాక్ జరిగింది? చరణ్ గతం ఏమిటి? చరణ్‌కు డాక్టర్ సంబంధమేమిటి? వేరే గ్యాంగ్‌కు చరణ్‌ను చంపాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నలకు చిత్ర రెండవ భాగంలో సమాధానం దొరుకుంది. తుఫాన్ చిత్రం దారుణమైన ఫ్లాప్ తర్వాత సరియైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్‌కు మరోసారి సామర్ధ్యాన్ని ప్రూవ్ చేసుకుని..విజృంభించడానికి రామ్ చరణ్‌కు చక్కటి పాత్ర ఎవడు చిత్రం ద్వారాలభించింది. ఈ చిత్రంలో సత్య రూపంలో ఉన్న చరణ్‌గా తొలిభాగంలో ఆకట్టుకున్నాడు. ఇక రెండవ భాగంలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న చరణ్ పాత్ర ’ఎవడు’కి జీవం పోసి.. ఫుల్ మార్కులను కొట్టేసింది. యధాప్రకారం డాన్స్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో చెర్రీ ఇరగదీశాడనే చెప్పవచ్చు. అన్ని రకాల ఎమోషన్స్ పలికించే పాత్రను పోషించడానికి రామ్ చరణ్ కు 'ఎవడు' ద్వారా అవకాశం దక్కింది. సత్య పాత్రలో అల్లు అర్జున్ కనిపించేది కాసేపైనా.. ఉన్నంత సేపు తన మార్కు నటనతో పరిణతిని ప్రదర్శించాడు. దీప్తిగా కాజల్‌ది అతిధి పాత్ర అయినా.. మరికొంత సేపు కనిపిస్తే బాగుండేదనే ఫీలింగ్‌ను కలిగించింది. అతిధి పాత్రలో కాజల్ గ్లామరస్‌గా కనిపించింది. ఎమీ జాక్సన్ అందాల ఆరబోతకు పనికి వచ్చింది. ఇక చిత్ర సెకాండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే శృతిహాసన్‌కు గ్లామర్‌తోపాటు యాక్టింగ్‌కు స్కోప్ ఉండే పాత్ర లభించింది. తన పాత్ర పరిధి మేరకు శృతిహాసన్ వందశాతం న్యాయం చేసింది. విలన్ల విషయానికి వస్తే తొలిభాగంలో రాహుల్‌దేవ్, రెండవ భాగంలో సాయికుమార్, కోట శ్రీనివాస్‌లు ఈచిత్రానికి మూలస్థంభాల్లా నిలిచారు. హీరో పాత్రను ఇమేజ్ను పెంచడానికి రాహుల్ దేవ్, సాయికుమార్ పాత్రలు బాగా సహకరించాయి. కారెక్టర్ ఆరిస్టుల్లో ఎల్బి శ్రీరాం మరోసారి గుర్తుండిపోయే పాత్రను చేశారు. ఇక డాక్టర్ జయసుధకు ఇలాంటి పాత్రలకు కొత్తేమి కాకున్నా..చక్కటి ఫీల్‌ను కల్పించడానికి ఉపయోగపడింది. బ్రహ్మానందం కామెడీ అంతంత మాత్రంగానే ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ’నీ జతగా నేనుండాలి’, ’నిన్ను చూడకుంటే చెంపల్లోన పింపుల్స్, ప్రీడమ్ పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెంపోను పెంచింది. ఫోటోగ్రఫీ, ఫైట్స్ చిత్రానికి అదనపు ఆకర్షణ. తెలుగు సినిమాకు పర్ఫెక్ట్గా సరిపోయే రెగ్యులర్ ఫార్మాట్‌తో, ఎలాంటి ప్రయోగాలు చేయకుండా, పక్కా కమర్షియల్ ఎలిమింట్స్ మిక్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేస్తే హిట్ కొట్టవచ్చు అనే సిద్దాంతాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి నమ్మినట్టు స్పష్టంగా కనిపించింది. కథలో వేగం తగ్గకుండా, చక్కటి స్క్రీన్‌ప్లేతో పరిగెత్తించాడు. ’ఎవడు’ చిత్రంలో అన్ని విభాగాలను బాలెన్స్ చేయడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. తొలి భాగంలో లాజిక్కుల దూరంగా.. రెండవ భాగంలో హింస మితిమీరినట్టు అనిపించినా.... వాటిపై పాజిటివ్ అంశాలు డామినేట్ చేయడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. పలు రకాల కారణాలతో ఈ చిత్రం అనేకమార్లు వాయిదా పడటం విసుగుపుట్టించినా..చివరకు సంక్రాంతి రేసులో మైరుగైన ఫలితాన్ని రాబట్టడంలో నిర్మాత దిల్‌రాజు మరోసారి పైచేయి సాధించాడు. ఓ బ్లాక్‌బస్టర్ (మగధీర మినహాయిస్తే)కోసం వేచి చూస్తున్న రామ్ చరణ్.. తన సొంత ఇమేజ్‌తో ‘ఎవడు’ ద్వారా ఓ భారీ హిట్‌ను సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. --రాజబాబు అనుముల -
ఎవడు చూసిన సాయి కుమార్
-
సంక్రాంతి బరిలో తలపడుతున్న చెర్రి, ప్రిన్స్
-
రెండు రోజుల గ్యాప్ తో వస్తోన్న బిగ్ మూవీస్
-
ఇది ఆనంద సంక్రాంతి...
‘ఎవడు’ చిత్రంలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందని, ‘సంక్రాంతి’కి విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని శ్రుతిహాసన్ నమ్మకం వ్యక్తం చేశారు. రామ్‌చరణ్ కథానాయకునిగా పైడిపల్లి వంశీ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘ఎవడు’ చిత్రం ఈ నెల 12న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ‘ఎవడు మొబైల్ యాప్’ని చిత్ర కథానాయిక శ్రుతిహాసన్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘‘ఒక సినిమా విడుదలకు సిద్ధమైతే.. రెండో సినిమా సెట్స్‌పై ఉండటం మా సంస్థలో రివాజు. కానీ... మూడు స్క్రిప్టులు రెడీగా ఉన్నా మేం సెట్స్‌కి వెళ్లలేదు. కారణం ‘ఎవడు’. ఆ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేసిన తర్వాతే మా కథలను సెట్స్‌కి తీసుకెళ్తాం. ‘ఎవడు’పై మాకున్న నమ్మకానికి ఇదో మచ్చుతునక. చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అని అభినందించారు. అందరి అభిప్రాయాలనూ ఈ సినిమా నిజం చేస్తుంది’’ అని దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేశారు. ‘ఎవడు’ మా టీమ్ మొత్తానికి ఓ పరీక్ష లాంటిదని, రామ్‌చరణ్, అల్లు అర్జున్ తొలిసారి కలిసి నటించిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని పైడిపల్లి వంశీ చెప్పారు. -
ఎవడు చిత్రం ట్రైలర్
-
'ఎవడు' సినిమా స్టిల్స్
-
విడుదలకు ముందే ఉత్కంఠ
టైటిల్ ‘ఎవడు’. రామ్‌చరణ్ హీరో. అల్లు అర్జున్ స్పెషల్ రోల్. ప్రోమోస్‌లో చరణ్ పగతో రగిలిపోతూ అగ్నిపర్వతంలా కనిపిస్తున్నాడు. ఏదో ఊహించని ట్విస్ట్‌లు కథలో ఉన్నాయేమో అనిపిస్తోంది. విడుదలకు ముందే సినిమా ఉత్కంఠకు లోను చేస్తోంది. కొన్ని సినిమాలకు మాత్రమే... ఇలాంటి మ్యాజిక్కులు జరుగుతాయి. సినిమా పూర్తయి ఇన్నిరోజులవుతున్నా... ఇంకా ‘ఎవడు’ సినిమాపై అంచనాలు తగ్గకపోవడానికి కారణం ఇదే. ఈ నెల 12న ‘ఎవడు’ విడుదల కానుంది. అభిమానుల ఆకలి తీర్చే సినిమా అవుతుందని నిర్మాత ‘దిల్’రాజు నమ్మకంగా చెబుతున్నారు. హాలీవుడ్ తరహా స్క్రీన్‌ప్లేతో దర్శకుడు పైడిపల్లి వంశీ ఈ చిత్రాన్ని మలిచినట్లు సమాచారం. నటునిగా చరణ్‌ని మరో స్టేజ్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ పాటలు ఇప్పటికే శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయి. గత ఏడాది సంక్రాంతికి చరణ్ ‘నాయక్’ మాస్‌ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సంక్రాంతికి రాబోతున్న ‘ఎవడు’ అదే ఫీట్‌ని రిపీట్ చేస్తుందని అభిమానుల ఆశాభావం. -
సంక్రాంతి బరిలో ఎవడు
కొన్ని సినిమాలు లేట్‌గా విడుదలైనా.. లేటెస్ట్ విజయాలను అందుకుంటుంటాయి. ఫ్లాష్బ్యాక్లోకెళితే... అలాంటి విజయాలు చాలా కనిపిస్తాయి. మరి వాటి చెంత ‘ఎవడు’ చేరుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే సంక్రాంతి దాకా ఆగాల్సిందే. ఏనాడో నిర్మాణం పూర్తి చేసుకున్న ‘ఎవడు’ ఎట్టకేలకు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా ఇంత ఆలస్యమైన సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉండవు. కానీ ‘ఎవడు’పై అంచనాలు మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. పైగా బన్నీ ఇందులో ఓ పదిహేను నిమిషాల పాటు మెరిపిస్తాడని తెలియగానే.. అంచనాలు అంబరాన్ని తాకాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే విశేషాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి నిర్మాత ‘దిల్’రాజు మాట్లాడుతూ- ‘‘చరణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే సినిమా ఇది. దర్శకుడు పైడిపల్లి వంశీ ‘ఎవడు’ రూపంలో వెండితెరపై ఓ అద్భుతాన్నే ఆవిష్కరించాడు. ఈ సినిమా విజయంపై మా టీమ్ మొత్తం నమ్మకంగా ఉన్నాం. జనవరి 1న ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ టీజర్‌ని విడుదల చేస్తున్నాం. అలాగే.. అదే నెల 3న థియేటరికల్ ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తాం. సంక్రాంతి కానుకగా అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. శ్రుతిహాసన్, అమీ జాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కథ: పైడిపల్లి వంశీ, వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. -
ఎవడు సినిమా కోసం బన్నీ, చెర్రీ స్పెషల్ సాంగ్
-
రామయ్య వచ్చాడు వెళ్ళాడు.కానీ ఎవడు రాలేదు
-
ఎవడు రెడీ
ఇంతకూ ఇతను ‘ఎవడు’? కథ రీత్యా ఇందులో ప్రతినాయకునికి ఈ ప్రశ్నే అడుగడుగునా వెంటాడుతుందట. చూస్తున్న ప్రేక్షకుణ్ణి కూడా ఈ ప్రశ్నే కలవరపెడతుందట. అంతటి పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. రామ్‌చరణ్ కథానాయకునిగా నటించిన ఈ చిత్రంలో బన్నీ ఓ ప్రత్యేక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో బన్నీ, చరణ్‌ల పాత్రల మధ్య ఉండే అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. హాలీవుడ్ సినిమాను తలపించేలా దర్శకుడు పైడిపల్లి వంశీ ఈ చిత్రాన్ని మలిచారని తెలిసింది. డిసెంబర్ 19న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత ‘దిల్’రాజు మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ‘‘మెగా అభిమానులకు ఈ సినిమా విందుభోజనం లాంటిది. రామ్‌చరణ్ నటన, శ్రుతిహాసన్, అమీజాక్సన్ అందచందాలు, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. పైడిపల్లి వంశీ విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని మలిచాడు. మా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. మరో ప్రత్యేక పాత్రలో కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, సాయికుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ: పైడిపల్లి వంశీ, వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్ : ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, సమర్పణ: శ్రీమతి అనిత. -
'ఎవడు' వస్తున్నాడు
ఎట్టకేలకూ ‘ఎవడు’ సినిమా విడుదల తేదీ ఖరారయ్యింది. ఆగస్టు నెలలో విడుదల కావాల్సిన ఈ చిత్రం రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడింది. చివరకు డిసెంబర్ 19న విడుదల చేయాలని నిర్మాత ‘దిల్’ రాజు నిర్ణయించారు. రామ్ చరణ్, శ్రుతిహాసన్, అమీజాక్సన్ కాంబినేషన్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్నో భారీ హంగులతో ఈ చిత్రం తయారైంది. ఇందులో అల్లు అర్జున్ గెస్ట్‌గా పది నిమిషాల పాత్ర చేయడం విశేషం. ఇప్పటికే పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ‘దిల్’రాజు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి. తెలుగుతో పాటు మలయాళంలో కూడా డిసెంబర్ 19న విడుదల చేయబోతున్నాం. మా సంస్థలో పక్కా కమర్షియల్ సినిమా ఇది. రామ్‌చరణ్ కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది. తెలుగు సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లే స్థాయిలో రూపొందింది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్. -
‘ఎవడు’లో చరణ్ విశ్వరూపం
మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎవడు’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇందులో రామ్ చరణ్ నటవిశ్వరూపం చూస్తారని, తెలుగు సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా ఇదని దిల్‌రాజు నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘పైడిపల్లి వంశీ ‘ఎవడు’ రూపంలో ఓ అద్భుతాన్నే ఆవిష్కరించాడని చెప్పాలి. అల్లు అర్జున్ ఇందులో పది నిమిషాలే కనిపిస్తారు. కానీ ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం కనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తున్నాయి. మా సంస్థ నుంచి రాబోతున్న బ్లాక్‌బస్టర్ ఇది. అక్టోబర్ 10న అత్యధిక థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. శుతిహాసన్, అమీజాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో కాజల్ అతిథి పాత్ర పోషించారు. జయసుధ, కోట శ్రీనివాసరావు, సాయికుమార్, రాహుల్‌దేవ్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: ఆనంద్ సాయి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి అతడు: నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నను రప్పించావే నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వనిపించావే ॥జతగా॥ చరణం : 1 ఆ: కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రాలేదే... జాడైనా లేదే... అ: రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే... పైగా తిడతావే... ఆ: లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావా నన్నిలా అ: నీలోకంలో నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా ॥జతగా॥ చరణం : 2 అ: తెలిసి తెలియక వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపు... ఏం చేస్తాం చెప్పు... ఆ: తోచని తొందర పుడుతుంది తెగ తుంటరిగా నను నెడుతుంది నీ వైపు... నీదే ఆ తప్పు అ: నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా ఆ: దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా ॥జతగా॥ చిత్రం: ఎవడు (2013) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, గానం: కార్తీక్, శ్రేయాఘోషల్ సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి. ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు) పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034 మెయిల్: sakshi.features@gmail.com