హీ ఈజ్ ఎ రియల్‌స్టార్!
హీ ఈజ్ ఎ రియల్‌స్టార్!
Published Sun, Jan 19 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
‘ఎవడు’లో సెకండ్ హీరోయిన్‌గా చేసిన అమీ జాక్సన్ హీరో రామ్‌చరణ్‌ని పొగడ్తల్లో ముంచెత్తేస్తోంది. ‘‘చరణ్ పక్కన నటించే చాన్సు రావడం నిజంగా నా అదృష్టం. హీ ఈజ్ ఎ రియల్‌స్టార్. చరణ్‌కు చాలామంది అభిమానులున్నారు. తన పక్కన యాక్ట్ చేయడంతో నాక్కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. చరణ్ డాన్సులు కూడా బాగా చేస్తాడు. తనతో కలిసి డాన్స్ చేయడాన్ని చాలా ఆస్వాదించాను’’ అని చెప్పింది అమీ. ‘ఎవడు’ విజయం తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెబుతూ -‘‘కథతో పాటు ట్రావెల్ అయ్యే విధంగా నా పాత్రను తీర్చిదిద్దిన దర్శకుడు వంశీ పైడిపల్లికి థ్యాంక్స్. భారీ సినిమాలు నిర్మించే ‘దిల్’ రాజు సంస్థలో పనిచేయడాన్ని ఎప్పటికీ మరచిపోను’’ అని సంబరపడిపోయింది.
Advertisement
Advertisement