చరణ్ సినిమాకు బన్నీ వాయిస్..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఎవడు. ఈ సినిమాలో చరణ్, అర్జున్ తెర మీద కలిసి కనిపించకపోయినా.. అల్లు అర్జున్ చేసిన అతిథి పాత్ర సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేసింది. ఎవడు సినిమా తరువాత రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో పూర్తి స్థాయి మల్టీ స్టారర్ రానుందన్న వార్తలు వినిపించాయి. అయితే సరైన కథ దొరక్కపొవటంతో ఇంత వరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
అయితే మరోసారి రామ్ చరణ్, అల్లు అర్జున్లు కలిసి ఒకే సినిమాకు పనిచేయబోతున్నారన్న వార్త మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఓ రీమేక్ సినిమా ఆ కోసం చరణ్, అర్జున్లు కలిసి పనిచేయనున్నారు. అయితే ఇది కూడా పూర్తి స్థాయి మల్టీ స్టారర్ సినిమా కాదని తెలుస్తోంది. కన్నడలో ఘనవిజయం సాధించిన బహద్దూర్ సినిమాను రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలో కోసం అల్లు అర్జున్ కూడా పనిచేస్తున్నాడని తెలుస్తోంది.
ఎవడు సినిమాలో కీలక పాత్రలో నటించిన బన్నీ, బహద్దూర్ రీమేక్కు వాయిస్ ఓవర్ అందించనున్నాడు. ఒరిజినల్ వర్షన్కు కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ వాయిస్ అందించాడు. దీంతో తెలుగులోనూ అదే స్థాయి ఇమేజ్ ఉన్న హీరో అయితే కరెక్ట్ అని భావించిన అల్లు అరవింద్, అల్లు అర్జున్తో వాయిస్ చేయించాలని నిర్ణయించాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.