కర్నూలు : ప్రముఖ యువ హీరో రామ్ చరణ్పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రామ్ చరణ్ హీరోగా ఇటీవలి విడుదలైన 'ఎవడు' చిత్రంలో అశ్లీలత ఉందంటూ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేందర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీఎస్ సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. రామ్ చరణ్తో పాటు మరో ఆరుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.