మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎవడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. 2014లో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన ఈ సినిమాను ఇన్నేళ్ల తరువాత బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
తెలుగులో ఎవడు సినిమాను నిర్మించిన దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత నిఖిల్ అద్వానీ తో కలిసి ఎవడును రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు హేట్‌స్టోరి 4 ఫేం మిలాప్ జవేరి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే హీరో హీరోయిన్లు ఎవరన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment