Yevadu movie
-
మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న 'ఎవడు' సినిమా హీరోయిన్
రామ్ చరణ్ 'ఎవడు' సినిమాలో హీరోయిన్గా నటించిన అమీ జాక్సన్ గుర్తుందా? ఇప్పుడు ఆమె రెండో పెళ్లికి సిద్ధమైపోయింది. గతంలో కొన్నాళ్ల ఓ వ్యక్తితో డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మకు ఓ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత బ్రిటీష్ నటుడితో ప్రేమలో పడింది. గత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న ఈ జంట ఇప్పుడు ఒక్కటయ్యేందుకు రెడీ అయిపోయారు. (ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్) విదేశాల్లో పుట్టి పెరిగిన అమీ జాక్సన్ తొలుత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత 'మద్రాసు పట్టణం' అనే తమిళ సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రంలో ఓ హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత 'అభినేత్రి' అనే ద్విభాషా చిత్రంలోనూ నటించింది. ఈ రెండు తప్పితే తమిళ, హిందీలోనే ఎక్కువగా మూవీస్ చేసింది. గతంలో జార్జ్ పనయాట్టు అనే వ్యక్తితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమీ జాక్సన్.. అతడితో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. ఏమైందో ఏమో గానీ అతడి నుంచి విడిపోయింది. ఇది జరిగిన తర్వాత కొన్నాళ్లకు విదేశీ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం నేరుగా చెప్పనప్పటికీ కలిసి బయట కనిపించడంతో అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. తాజాగా స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాల్లో ఇతడు లవ్ ప్రపోజ్ చేశాడు. అమీ జాక్సన్ దీన్ని అంగీకరించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో వీళ్ల పెళ్లి ఉండొచ్చు. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) -
బాలీవుడ్‌కు ‘ఎవడు’?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఎవడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. 2014లో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన ఈ సినిమాను ఇన్నేళ్ల తరువాత బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలుగులో ఎవడు సినిమాను నిర్మించిన దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత నిఖిల్ అద్వానీ తో కలిసి ఎవడును రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు హేట్‌స్టోరి 4 ఫేం మిలాప్ జవేరి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే హీరో హీరోయిన్లు ఎవరన్నది తెలియాల్సి ఉంది. -
శృతిహాసన్ ఫిర్యాదుపై దర్యాప్తు
హైదరాబాద్: ‘ఎవడు’ సినిమాలోని స్టిల్స్‌ను తన అనుమతి లేకుండా సినీ వెబ్సైట్లలో పెట్టారంటూ హీరోయిన్ శృతిహాసన్ ఇటీవల సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పలువురు వెబ్సైట్ ఫొటోగ్రాఫర్లను సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. గత మూడు రోజులుగా సినీ వెబ్సైట్ ఫొటోగ్రాఫర్లను పిలిపించి.. ఆ ఫొటోలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు? ఎందుకు వెబ్సైట్లలో పెట్టారనే విషయాలపై విచారిస్తున్నారు. ఎవడు సినిమాలో తనపై తీసిన ఫొటోలను వెబ్సైట్లలో పెట్టడం లేదని ఆ సినిమా నిర్మాత చెప్పారని, తీరా చూస్తే ఇటీవల 11 స్టిల్స్ వెబ్సైట్లలో దర్శనమిచ్చాయని ఆమె ఆరోపించారు. ఒప్పందానికి విరుద్ధంగా ఈ ఫొటోలు వెబ్సైట్లో పెట్టారని ఆమె పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా ఇలా ఫొటోలను వాడుకోవడం సబబు కాదని, ఈ పని చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 10 మంది ఫొటోగ్రాఫర్లను పోలీసులు విచారించారు. స్టిల్స్ పెట్టడంలో దురుద్దేశాన్ని అడిగి తెలుసుకున్నారు. -
హీరో రామ్ చరణ్‌పై కేసు నమోదు
-
హీరో రామ్ చరణ్‌పై కేసు నమోదు
కర్నూలు : ప్రముఖ యువ హీరో రామ్ చరణ్‌పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రామ్ చరణ్ హీరోగా ఇటీవలి విడుదలైన 'ఎవడు' చిత్రంలో అశ్లీలత ఉందంటూ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేందర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీఎస్ సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. రామ్ చరణ్‌తో పాటు మరో ఆరుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘ఎవడు’ సినిమాను అడ్డుకుంటాం
మెదక్: సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు రాంచరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా విడుదలను మెదక్‌లో అడ్డుకుంటామని టీఆర్ఎస్ నేత మోచి కిషన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. మెదక్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారి సినిమాలను తెలంగాణలో ఆడనీయబోమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి, దాన్ని నడిపే శక్తిలేక కాంగ్రెస్‌లో విలీనం చేశాడని ఎద్దేవా చేశారు. తెలంగాణను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదనీ, వ్యతిరేకించే వారేవరైనా సరే.. తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. -
మళ్లీ వారిద్దరే!
సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండగ. అలాగే సినిమా వాళ్లకు కూడా పెద్ద పండగే. అగ్ర కథానాయకుల సినిమాలు సంక్రాంతికి విడుదల చేయడం తెలుగులో అనవాయితీగా వస్తోంది. ఈ పండుగ సీజన్లో వరుస సెలవుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ధియేటర్లకు వస్తుంటారు. ఈ సమయంలో సినిమాలు విడుదల చేస్తే కాసుల వర్షం ఖాయమన్న ఉద్దేశంతో 'బొమ్మ'ను ధియేటర్లలోకి వదులున్నారు నిర్మాతలు. ఈ ఏడాది కూడా రెండు అగ్ర హీరోల సినిమాల సందడి నెలకొంది. 'ప్రిన్స్' మహేష్‌బాబు, 'మెగా పవర్‌స్టార్' రామ్‌చరణ్ బాక్సాఫీస్ రేసులో నిలిచారు. గతేడాది పోటీ పడిన హీరోలే ఈ సంక్రాంతికి పోటీ పడుతుండడం ఈసారి విశేషం. మహేష్‌బాబు ’1’ నేనొక్కడినే, రామ్‌చరణ్ 'ఎవడు' సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ’1’ నేనొక్కడినే సినిమా జనవరి 10న విడుదలయింది. దీనికి సరిగ్గా రెండు రోజుల తర్వాత 12న ఎవడు దూసుకు వస్తున్నాడు. గతేడాది చరణ్ సినిమా ముందు వస్తే, ఈసారి మహేష్ సినిమా ముందుగా విడుదలయింది. నాయక్ గతేడాది జనవరి 9న విడుదలకాగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(ఎస్వీఎస్సీ) జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. గతేడాది మహేష్ మల్టీస్టారర్ మూవీ చేస్తే, ఈసారి చరణ్ ఈ ఫీట్ చేశాడు. అల్లు అర్జున్‌తో కలిసి తెరను పంచుకున్నాడు చరణ్. అయితే అల్లు అర్జున్ పాత్ర 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. అల్లు అర్జున్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలో నటించింది. చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ నటించారు. ఎస్వీఎస్సీలో మహేష్, వెంకటేష్ అన్నదమ్ములుగా నటించిన సంగతి తెలిసిందే. సునీల్ 'భీమవరం బుల్లోడు'గా సంక్రాంతికి రావాలనుకున్నా వెనక్కి తగ్గాడు. ఇక ప్రతి సంక్రాంతికి సినిమాను వదిలే నిర్మాత దిల్ రాజు ఈ ఏడాది కూడా ఆనవాయితీ పాటిస్తున్నారు. 'ఎవడు' సినిమాతో ఆయన సంక్రాంతి బరిలో నిలిచారు. నిజానికి ఈ సినిమాను గతేడాది ద్వితీయార్థంలోనే విడుదల చేయాలనుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడి చివరకు సంక్రాంతికి విడుదలవుతోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కు ఆయనే నిర్మాత. సంక్రాంతి పోటీలో నిలిచిన ’1’ నేనొక్కడినే, 'ఎవడు' చిత్రాలు ప్రేక్షకులను ఏ మేరకు రంజింపచేస్తాయో చూడాలి. -
‘ఎవడు’ థియేటరికల్ ట్రైలర్ లాంచ్
-
సెలబ్రేట్ చేసుకునేలా ఎవడు ఉంటుంది
‘‘దిల్‌రాజు ఫోన్ చేసి ‘థియేటరికల్ ట్రైలర్ లాంచ్‌ని ఓ ఫంక్షన్‌లా చేద్దాం’ అన్నారు. ట్రైలర్ లాంచ్క్కూడా ఫంక్షన్ చేస్తారా అనిపించింది. పైగా అలా చేయడం కరెక్ట్ అనిపించలేదు. నా మనసు గ్రహించిన దిల్‌రాజు... ‘అభిమానుల సమక్షంలో సినిమా థియేటర్లో ఫంక్షన్ చేద్దాం’ అన్నారు. ఫ్యాన్స్ మధ్య అనగానే కాదనలేకపోయాను’’ అని రామ్‌చరణ్ చెప్పారు. ఆయన కథానాయకునిగా పైడిపల్లి వంశీ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘ఎవడు’. ఈ చిత్రం థియేటరికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ‘సంధ్య’ థియేటర్లో రామ్‌చరణ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ -‘‘సినిమా విడుదల అంటే... ఓ పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. అయితే... అభిమానులు అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. వారికి ఏమైనా జరిగితే.. పండుగను ఆనందంగా జరుపుకోలేం. అభిమానులే నాకు సర్వస్వం. మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి రాబోతోంది. ఆ పండుగను ఎలాగైతే కుటుంబ సమేతంగా జరుపుకుంటామో.. ఈ సినిమాను అలాగే కుటుంబ సమేతంగా ఆదరిస్తారని నా ఆకాంక్ష. ‘ఎవడు’ అభిమానుల్ని నిరాశపరచడు. సెలబ్రేట్ చేసుకునేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఆడియో వేడుకలో చిరంజీవి అన్నట్లుగా... ‘మగధీర’ను మించే సినిమా ‘ఎవడు’ అవుతుందని దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేశారు. సినిమా బాగా వచ్చిందని, ఆదరిస్తారనే నమ్మకం ఉందని పైడిపల్లి వంశీ అన్నారు. ఇంకా వక్కంతం వంశీ, శిరీష్, అబ్బూరి రవి, కెమెరామేన్ రామ్‌ప్రసాద్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.