
సెలబ్రేట్ చేసుకునేలా ఎవడు ఉంటుంది
‘‘దిల్‌రాజు ఫోన్ చేసి ‘థియేటరికల్ ట్రైలర్ లాంచ్‌ని ఓ ఫంక్షన్‌లా చేద్దాం’ అన్నారు. ట్రైలర్ లాంచ్‌క్కూడా ఫంక్షన్ చేస్తారా అనిపించింది. పైగా అలా చేయడం కరెక్ట్ అనిపించలేదు. నా మనసు గ్రహించిన దిల్‌రాజు... ‘అభిమానుల సమక్షంలో సినిమా థియేటర్‌లో ఫంక్షన్ చేద్దాం’ అన్నారు. ఫ్యాన్స్ మధ్య అనగానే కాదనలేకపోయాను’’ అని రామ్‌చరణ్ చెప్పారు. ఆయన కథానాయకునిగా పైడిపల్లి వంశీ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘ఎవడు’. ఈ చిత్రం థియేటరికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ‘సంధ్య’ థియేటర్‌లో రామ్‌చరణ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ -‘‘సినిమా విడుదల అంటే... ఓ పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. అయితే... అభిమానులు అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. వారికి ఏమైనా జరిగితే.. పండుగను ఆనందంగా జరుపుకోలేం.
అభిమానులే నాకు సర్వస్వం. మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి రాబోతోంది. ఆ పండుగను ఎలాగైతే కుటుంబ సమేతంగా జరుపుకుంటామో.. ఈ సినిమాను అలాగే కుటుంబ సమేతంగా ఆదరిస్తారని నా ఆకాంక్ష. ‘ఎవడు’ అభిమానుల్ని నిరాశపరచడు. సెలబ్రేట్ చేసుకునేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఆడియో వేడుకలో చిరంజీవి అన్నట్లుగా... ‘మగధీర’ను మించే సినిమా ‘ఎవడు’ అవుతుందని దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేశారు. సినిమా బాగా వచ్చిందని, ఆదరిస్తారనే నమ్మకం ఉందని పైడిపల్లి వంశీ అన్నారు. ఇంకా వక్కంతం వంశీ, శిరీష్, అబ్బూరి రవి, కెమెరామేన్ రామ్‌ప్రసాద్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.