
‘ఎవడు’ సినిమాను అడ్డుకుంటాం
మెదక్: సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు రాంచరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా విడుదలను మెదక్‌లో అడ్డుకుంటామని టీఆర్‌ఎస్ నేత మోచి కిషన్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు.
మెదక్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారి సినిమాలను తెలంగాణలో ఆడనీయబోమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి, దాన్ని నడిపే శక్తిలేక కాంగ్రెస్‌లో విలీనం చేశాడని ఎద్దేవా చేశారు. తెలంగాణను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదనీ, వ్యతిరేకించే వారేవరైనా సరే.. తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు.