TRSV
-
Rahul Gandhi OU Visit: ఓయూలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ(మంగళవారం) ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓయూ సందర్శనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ నాయకులు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఎన్ఎస్యూఐ నేతలు కొందరు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడంతో.. కౌంటర్‌గా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈపర్యటనలో భాగంగా.. ఈ నెల 7న హైదరాబాద్, తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థులతో ఆయన ముఖాముఖి చేపట్టాలనుకున్నారు. అయితే ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అందుకు అనుమతులు నిరాకరించింది. మరోవైపు అక్కడ విద్యార్థి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓయూలోకి రాహుల్ గాంధీని అడుగుపెట్టనివ్వబోమని టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ కూడా పోటీగా ఆందోళనలకు దిగుతోంది. ఇక హైకోర్టు సైతం రాహుల్ సభ నిర్వాహణ నిర్ణయాన్ని దాదాపుగా ఓయూకే వదిలేసింది. సంబంధిత వార్త: ఓయూ రగడ.. ఆగని అరెస్టులు -
‘బీజేపీ వాళ్లకు తెలివి లేదు మన్నులేదు.. తిట్టుడే తిట్టుడు’
సాక్షి, హైదరాబాద్ : ఏప్రిల్ నెల వస్తేటీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతం మరోసారి నెమరువేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అంశం తెరమరుగు అయ్యే పరిస్థితిలో కేసీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్ ఒక మెదక్ జిల్లా ప్రజలకు మాత్రమే తెలిసిన వ్యక్తి మాత్రమేనని, ఆయన ప్రయాణం మొదలు పెట్టిన రోజు మీడియా, కుల, ధన బలం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఏర్పాటు టీఆర్ఎస్పీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఆనాడు ఒక్కడిలా ప్రయాణం మొదలు పెట్టి.. ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారని కొనియాడారు. రాష్ర్టం తెచ్చే వరకు ఎత్తిన జెండా దించితే రాళ్లతో కొట్టండి అంటూ కేసీఆర్ ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగించారన్నారు. కేసీఆర్ 20 ఏళ్ళ త్యాగాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ కాళ్ళు అరిగేలా ఢిల్లీకి తిరిగారని కేటీఆర్ తెలిపారు. ఉద్యమంలో పాల్గొనని వారు, అసలు తెలంగాణను వ్యతిరేకించిన వారు ఇప్పుడు కేసీఆర్‌ను విరమ్శిస్తున్నారని, ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్వీదని పేర్కొన్నారు. ఉద్యమంలో మాటలతోనే కేసీఆర్ చీల్చి చెండాడారన్నారు. గోడకు వేలాడేటప్పుడు తుపాకీ కూడా సైలెంట్‌గానే ఉంటుందని, కానీ కాల్చడం మొదలు పెడితే దాని సౌండ్ ఓ రేంజ్లో ఉంటుందన్నారు. మరోవైపు బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మనమంతా కేయూ, ఓయూలో చదివితే బీజేపీ నాయకులు వాట్సప్ యూనివర్సిటీలో చదువుకుంటారని ఎద్దేవా చేశారు. గట్టిగా ఊరిమిచూస్తే బీజేపీ నేతలకు నోట్లో మాటరాదని మండిపడ్డారు. చదవండి: తెలంగాణ భారత్‌లో భాగం కాదా? కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాల లెక్క ను మీ ముందు పెడుతున్నా. ఈ సమాచారాన్ని మీరు కింది స్థాయిలో ఓటర్లకు అవగతం చేయాలి. వెనకబడిన కులాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. రాష్ట్రం ఏర్పడ్డాక 260 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. బీసీలకు గొర్రెలు, బర్రెలు అనేవారికి ఇవి కనబడటం లేవా. కొత్తగా కేంద్రం 5 ఐఐఎంలు మంజూరు చేస్తే మన రాష్ర్టానికి ఇచ్చింది సున్నా. దేశంలో 84 నవోదయ పాఠశాలలు కేంద్రం ఏర్పాటు చేస్తే. మనకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం మరిచిపోయింది. ఓక్కటంటే ఓక్క ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ని ఇవ్వని బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి. లాయర్లు, జర్నలిస్ట్‌లకు వంద కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాం. ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ర్టాలలో ఈ పని చేశారా. ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు. మనకు అన్నిట్లో మొండి చేయి చూపిస్తున్నందుకా. చదవండి: 14వ సారి.. 6 గంటలు కలియదిరిగిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో కూడా కేంద్రం వాట ఉందని బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తుంది. మనం లెక్క లతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 132799 ఉద్యోగాలు మేము భర్తీ చేశాం. లెక్కలతో మనం తెలియజేస్తున్నాం. ఎన్నికల కోడ్ అయిపోగానే 50 వేల ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ రాబోతుంది. మనం లెక్కలతో సహా ఏం చేసినమో చూపాలి. బీజేపీ వాళ్లకు తెలివి లేదు మన్నులేదు. తిట్టుడే తిట్టుడు. మళ్ళేదైనా అంటే దేశం కోసం ధర్మం కోసం అంటరు. మోడీ కూడా చాలా హామీలు ఇచ్చిండు. వాటి లెక్క లు కూడా మీరు అడగండి. ఉద్యోగాలు ఏవీ అని బీజేపీ నేతలను అడిగితే పకోడీలు, బజ్జీల షాపుల లెక్కలు చెప్తారు. మన్మోహన్ సింగ్ అసమర్థత వల్లే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిందని విమర్శించిన మోడీ.. ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ రేట్లకు ఏం సమాధానం చెప్తరు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చర్చ పెట్టాలి. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చర్చ పెట్టాలి. 20లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ ఎవరి అకౌంట్లో వేశారు. చదవండి: పాపం పసివాళ్లు: ఆస్పత్రి సిబ్బందే అమ్మనాన్న అయ్యారు బీజేపీ నేతలు మోచేతిలో బెల్లం పెట్టి నాకమంటుంన్నారు. ఏమన్నాఅంటే దేశం కోసం ధర్మం కోసమంటరు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏందుకు పెట్టారు, ఐఐఎం ఏంఉకు ఇవ్వరు. గిరిజన యూనివర్సిటీల గురించి బీజేపీ నేతలను ప్రశ్నించండి. ఓక పేపర్, ఛానెల్ కోసం బీజేపీ నేతలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ పై మొరిగిన ఓ నేత ఓటుకు నోటు తో మొరుగుడు బందైంది. వీళ్ళకు గదే గతి పడుతుంది. రెండు గ్రాడ్యుయేట్ స్థానాలలో మన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి’’ అని పేర్కొన్నారు. చదవండి: కేటీఆర్ పీఏనంటూ టోకరా -
టీఆర్ఎస్ విద్యాభివృద్ధికి పాటుపడింది
సాక్షి, కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పాటుపడిందని, టీఆర్ఎస్ను మళ్లీ గెలిపించాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌యాదవ్ అన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలో బాబాగౌడ్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన విద్యార్థుల కృతజ్ఞత సభ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా విద్యాభివృద్ధికి పాటు పడింది కేసీఆర్ అన్నారు. నియోజకవర్గానికో గురుకుల విద్యాలయాలు, రెడిడెన్షియల్ పాఠశాలలు, సం క్షేమ హస్ట ళ్లు, ఆదర్శ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేద విద్యార్థులకు ఉన్నత చదువులకోసం పాటు పడుతున్నారన్నారు. అంతేకాక అంగన్వాడీలు, హస్టల్లలో సన్నబియ్యంతో పౌష్టికాహారం అందుతుందన్నారు. ఆసరా పింఛన్లు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వి జిల్లా కో ఆర్టినేటర్ చందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్, నాయకులు వెంకటేశ్, విజయ్, రాజేశ్, అఖిల్, అంజు, ప్రసాద్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
చంద్రబాబు ‘ఫాదర్ ఆఫ్ యూటర్న్’
హుస్నాబాద్: ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే చంద్రబాబుకు ‘ఫాదర్ ఆఫ్ యూటర్న్’ అవార్డు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ది పేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో బుధవారం టీఆర్ఎస్వీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి హరీశ్ మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. బాబు వచ్చి ప్రచారం చేస్తే గెలుస్తామని వారు కలలు కంటున్నా రని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తలుపు దగ్గర నిలుచుని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా ఆస్తుల పంపకం కాలేదని, హైకోర్టు విభజన జరగలేదని, ప్రభుత్వరంగ సంస్థల విభజన పూర్తికాలేదన్నారు. ఐదేళ్లు గడిచినా ఏ ఒక్కటీ విభజన పూర్తి కాలేదన్నారు. బాబుపై ఆధారపడి కాంగ్రెస్ అ«ధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తికానిస్తాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతారని హరీశ్ అన్నారు. దేశంలోనే అవకాశవాద నాయకుడాయన.. 1983లో ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని చెప్పారని హరీశ్ అన్నారు. 1985లో టీడీపీలో చేరిన బాబు.. ఎన్టీఆర్‌ను దేవుడని పొగడ్తల వర్షం కురిపించారని తెలిపారు. 1999లో బీజేపీతో జత కలిసి.. దేశం బీజేపీతోనే అభివృద్ధి చెందుతుందని మాట మార్చారని, 2004లో చంద్రబాబు ఓడిపోయినప్పు డు బీజేపీ పొత్తు వల్లే ఓడిపోయానని చెప్పాడన్నారు. దేశంలోనే అవకాశవాద నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మె ల్యే సతీశ్‌కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
మహాకూటమి కాదు.. జఫ్పా కూటమి
-
సూపర్ ఛాన్స్.. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు
సాక్షి, హైదరాబాద్ : ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే మంచి అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓటుతో మహాకూటమిగా జతకట్టిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఎం పార్టీలకు బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం విస్తృత సమావేశానికి కేటీఆర్, ఎంపీ బాల్కసుమన్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు వీర సైనికుల్లా పనిచేశారన్నారు. ఆ సమయంలో ఇంట్లో పడుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఇంట్లో పడుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడేమో సైనికుడునని మాట్లాడుతున్నారు. ఇది రాహుల్ గాంధీకి తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరగుతున్న పోటీ అని తెలిపారు. తెలంగాణకు జై అన్నారు కాబట్టే గతంలో టీఆర్ఎస్ టీడీపీ, కాంగ్రెస్‌లతో పొత్తుపెట్టుకుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను హతమార్చిన కాంగ్రెస్, టీడీపీలతో కోదండరాం పొత్తుపెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెట్టడానికి కాంగ్రెసోళ్లు సిద్దమయ్యారన్నారు. కాంగ్రెసోళ్లు పెళ్లి కాని యువకులకు పెళ్లి కూడా చేస్తామని, అవసరమైతే వారికి తిండి కూడా తినిపిస్తామని, వారి పిల్లల డైపర్స్ కూడా మారుస్తామని హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పెట్టిన మ్యానిఫేస్టోలో ఏం అమలు చేశారో చెప్పాలన్నారు. రాజధాని పేరిట వేల కోట్ల స్కామ్స్.. తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి విద్యార్థులే ఉన్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఓటుకు కోట్లలో దొరికిన నేతలు, కార్లలో కరెన్సీ కట్టలు దొరికిన నేతలు కూడా కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణ మీద దోపిడీ కోసం దండయాత్రకు దిగుతున్నారు. ఏపీలో ఐటీ సోదాలు జరిగితే టీడీపీ నేతలు భయపడుతున్నారని, రాజధాని పేరిట వేల కోట్లు స్కామ్స్ చేశారని అందుకే భయపడుతున్నారని తెలిపారు. అలాంటి వాళ్లు మళ్లీ తెలంగాణను దోచుకోవడానికి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్, టీడీపీకి ఒకే ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. -
కేసీఆర్ మాట.. 80 సీట్లు మనవే..!!
సాక్షి, హైదరాబాద్: ‘‘విద్యార్థి రాజకీయాల్లో ఇష్టంగా పనిచేయండి. కష్టంగా వద్దు. ఏదో చేయాలి కాబట్టి చేయొద్దు. సాధించాలన్న పట్టుదల ఉండాలి. జిద్దుగా తీసుకుని పనిచేయాలి. ఈ తెలంగాణ మీదే. భవిష్యత్ ప్రజాప్రతినిధులు మీరే..’’అని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ విద్యార్థి విభాగం(టీఆర్ఎస్వీ) నేతలకు దిశానిర్దేశం చేశా రు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగి న టీఆర్ఎస్వీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు రెండు గంటల పాటు ఎమ్మెల్యేగా తన పనితీరు, తన అనుభవాలను వివరించారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఏపీ వరకు జరిగిన పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పాలనను వారికి తెలియజేశారు. 10 లక్షల సభ్యత్వాలు నిర్దేశిస్తే 11 లక్షలు పూర్తి చేసిన బాధ్యులను ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు. సమావేశంలో విద్యార్థి విభాగం భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. విద్యార్థి విభాగం ఒక సైన్యంలా పని చేయాలని, వారం రోజుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. శిక్షణ తరగతులు పూర్తయ్యాక హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహిస్తామని చెప్పారు. 80 సీట్ల దాకా గెలుస్తాం.. తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతుందని, భవిష్యత్ విద్యార్థులదే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విద్యార్థి విభాగానికి ఒక ఎమ్మెల్సీతో పాటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 3 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో శిక్షణ పూర్తయ్యాక కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని విద్యార్థి నేతలకు సూచించారు. ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించుకుని ప్రజలకు వివరించాలన్నారు. మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌ల ఆధ్వర్యంలో విద్యార్థుల కార్యక్రమాలు చేపడతామన్నారు. సాగునీటి ప్రాజెక్టులతోపాటు మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ పనులనూ పరిశీలించాలని సూచించారు. ‘‘ముందు మీరు అవగాహన పెంచుకోండి. గత పాలనకు, మన పాలన మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరించండి. ప్రతిపక్షాలు మన ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఎక్కడికక్కడ తిప్పి కొట్టండి. ఆ స్థాయిలో విషయ పరిజ్ఞానం పెంచుకోండి. ప్రభుత్వం పేదలు, వివిధ రంగాల వారి కోసం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకుని ప్రజలకు వివరించండి. ఏమైనా అంశాలు మీకు తెలిస్తే.. ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. పాత పది జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి ఎన్నికల్లో జిల్లాకు కనీసం 8 స్థానాల చొప్పున 80 సీట్ల దాకా గెలుస్తాం. కష్టపడితే మిగిలిన సీట్లూ మనవే..’’అని అన్నారు. టీఆర్ఎస్వీ సభ్యత్వ రుసుము రూపంలో రూ.30 లక్షలు సమకూరాయి. దీనికి మరో రూ.కోటి కలిపి నిధిని ఏర్పా టు చేస్తామని సీఎం ప్రకటించారు. భవిష్యత్‌లో విద్యార్థి విభాగం నుంచి వచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. విద్యార్థి విభాగంలో పనిచేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పదవులు పొందారని, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, మేయర్ బొంతు రామ్మోహన్, చైర్మన్ పదవులు పొందిన వాసుదేవరెడ్డి, రాకేశ్ తదితరులను ఇందుకు ఉదాహరణగా చూపారు. ఈ సమావేశంలో మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో కొత్తగా నియమితులైన పలువురు నాయకులు పాల్గొన్నారు. -
'ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిపేయండి'
-
ఆల్ ద బెస్ట్
పరీక్ష పేరు : పంచాయతీ కార్యదర్శి పరీక్ష కేంద్రాలు : 185 అభ్యర్థులు : 45,862 అధికారులు, సిబ్బంది : 2,360 పోలీస్ సిబ్బంది : 370 పేపర్-1 సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ -2 సమయం : మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగనుండగా, పేపర్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కొనసాగనుంది. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 185 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 45,862 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు చెప్పారు. డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి పరీక్షల నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. 185 కేంద్రాలకు 185 మంది అసిస్టెంట్ సైజన్ అధికారులను, 37 మంది రూట్ అధికారులను, 38 మంది లైజన్ అధికారులను నియమించారు. 2,100 మంది ఇన్విజిలెటర్లను నియమించారు. కాగా, శనివారం డివిజన్ స్థాయి కేంద్రాల అధికారులకు, ఇన్విజిలెటర్లతో ఆర్డీవోలు సమావేశం నిర్వహించారు. పరీక్ష కు నిమిషం ఆలస్యమైనా అనుమతించవద్దని ఇన్విజిలేటర్లకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అవాంతరాలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఇద్దరు పోలీసుల చొప్పున 370 మంది పోలీసు అధికారులను నియమించారు. ఇదిలా ఉండగా, ఇది వరకే 46 వేలు కార్యదర్శుల ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్ 08732 -223652, 231300లో సంప్రదించాలని అధికారులు సూచించారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ ఆదిలాబాద్ కల్చరల్ : అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ఆదిలాబాద్‌లోని బస్టాండ్ ఎదుట హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు టీఆర్ఎస్ వీ నియోజకవర్గ అధ్యక్షుడు బండశ్రీను, పట్టణ అధ్యక్షుడు కన్నెవార్ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. -
‘ఎవడు’ సినిమాను అడ్డుకుంటాం
మెదక్: సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు రాంచరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా విడుదలను మెదక్‌లో అడ్డుకుంటామని టీఆర్ఎస్ నేత మోచి కిషన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. మెదక్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారి సినిమాలను తెలంగాణలో ఆడనీయబోమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి, దాన్ని నడిపే శక్తిలేక కాంగ్రెస్‌లో విలీనం చేశాడని ఎద్దేవా చేశారు. తెలంగాణను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదనీ, వ్యతిరేకించే వారేవరైనా సరే.. తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. -
భద్రాచలం మాదే
కామారెడ్డి, న్యూస్‌లైన్ : రాజ్యాన్నే ధిక్కరించి కంచర్ల గోపన్న (రామదాసు) రాములోరి గుడి నిర్మించిన భద్రాచలం ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమంటున్నారు తెలంగాణ విద్యార్థులు. భద్రాచలాన్ని తెలంగాణ ప్రాంతం నుంచి వేరుచేసే కుట్రలను నిరసిస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న సీడబ్ల్యూసీ, యూపీఏ తీర్మానాలను విస్మరిస్తూ కేంద్రమంత్రి జైరాం రమేశ్ భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని సూచించడం గర్హనీయమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నేతలు సంతోష్, సుమన్, రాజు, నిరం జన్, ప్రవీన్, మహేశ్, ప్రభాకర్, విఠల్, అశోక్ పాల్గొన్నారు.