
హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
హుస్నాబాద్: ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే చంద్రబాబుకు ‘ఫాదర్ ఆఫ్ యూటర్న్’ అవార్డు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ది పేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో బుధవారం టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి హరీశ్ మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. బాబు వచ్చి ప్రచారం చేస్తే గెలుస్తామని వారు కలలు కంటున్నా రని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తలుపు దగ్గర నిలుచుని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా ఆస్తుల పంపకం కాలేదని, హైకోర్టు విభజన జరగలేదని, ప్రభుత్వరంగ సంస్థల విభజన పూర్తికాలేదన్నారు. ఐదేళ్లు గడిచినా ఏ ఒక్కటీ విభజన పూర్తి కాలేదన్నారు. బాబుపై ఆధారపడి కాంగ్రెస్ అ«ధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తికానిస్తాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతారని హరీశ్ అన్నారు.
దేశంలోనే అవకాశవాద నాయకుడాయన..
1983లో ఎన్‌టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు.. ఎన్‌టీఆర్‌పై పోటీ చేస్తానని చెప్పారని హరీశ్ అన్నారు. 1985లో టీడీపీలో చేరిన బాబు.. ఎన్‌టీఆర్‌ను దేవుడని పొగడ్తల వర్షం కురిపించారని తెలిపారు. 1999లో బీజేపీతో జత కలిసి.. దేశం బీజేపీతోనే అభివృద్ధి చెందుతుందని మాట మార్చారని, 2004లో చంద్రబాబు ఓడిపోయినప్పు డు బీజేపీ పొత్తు వల్లే ఓడిపోయానని చెప్పాడన్నారు. దేశంలోనే అవకాశవాద నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మె ల్యే సతీశ్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment