సాక్షి, హైదరాబాద్ : ఏప్రిల్ నెల వస్తేటీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతం మరోసారి నెమరువేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అంశం తెరమరుగు అయ్యే పరిస్థితిలో కేసీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్ ఒక మెదక్ జిల్లా ప్రజలకు మాత్రమే తెలిసిన వ్యక్తి మాత్రమేనని, ఆయన ప్రయాణం మొదలు పెట్టిన రోజు మీడియా, కుల, ధన బలం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు టీఆర్‌ఎస్పీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఆనాడు ఒక్కడిలా ప్రయాణం మొదలు పెట్టి.. ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారని కొనియాడారు. రాష్ర్టం తెచ్చే వరకు ఎత్తిన జెండా దించితే రాళ్లతో కొట్టండి అంటూ కేసీఆర్ ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగించారన్నారు. కేసీఆర్ 20 ఏళ్ళ త్యాగాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ కాళ్ళు అరిగేలా ఢిల్లీకి తిరిగారని కేటీఆర్ తెలిపారు. ఉద్యమంలో పాల్గొనని వారు, అసలు తెలంగాణను వ్యతిరేకించిన వారు ఇప్పుడు కేసీఆర్‌ను విరమ్శిస్తున్నారని, ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్వీదని పేర్కొన్నారు. ఉద్యమంలో మాటలతోనే కేసీఆర్ చీల్చి చెండాడారన్నారు. గోడకు వేలాడేటప్పుడు తుపాకీ కూడా సైలెంట్‌గానే ఉంటుందని, కానీ కాల్చడం మొదలు పెడితే దాని సౌండ్ ఓ రేంజ్‌లో ఉంటుందన్నారు. మరోవైపు బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మనమంతా కేయూ, ఓయూలో చదివితే బీజేపీ నాయకులు వాట్సప్ యూనివర్సిటీలో చదువుకుంటారని ఎద్దేవా చేశారు. గట్టిగా ఊరిమిచూస్తే బీజేపీ నేతలకు నోట్లో మాటరాదని మండిపడ్డారు.
చదవండి: తెలంగాణ భారత్‌లో భాగం కాదా? కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం
‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాల లెక్క ను మీ ముందు పెడుతున్నా. ఈ సమాచారాన్ని మీరు కింది స్థాయిలో ఓటర్లకు అవగతం చేయాలి. వెనకబడిన కులాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. రాష్ట్రం ఏర్పడ్డాక 260 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. బీసీలకు గొర్రెలు, బర్రెలు అనేవారికి ఇవి కనబడటం లేవా. కొత్తగా కేంద్రం 5 ఐఐఎంలు మంజూరు చేస్తే మన రాష్ర్టానికి ఇచ్చింది సున్నా. దేశంలో 84 నవోదయ పాఠశాలలు కేంద్రం ఏర్పాటు చేస్తే. మనకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం మరిచిపోయింది. ఓక్కటంటే ఓక్క ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ని ఇవ్వని బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి. లాయర్లు, జర్నలిస్ట్‌లకు వంద కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాం. ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ర్టాలలో ఈ పని చేశారా. ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు. మనకు అన్నిట్లో మొండి చేయి చూపిస్తున్నందుకా.
చదవండి: 14వ సారి.. 6 గంటలు కలియదిరిగిన సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో కూడా కేంద్రం వాట ఉందని బీజేపీ వాట్సప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తుంది. మనం లెక్క లతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 132799 ఉద్యోగాలు మేము భర్తీ చేశాం. లెక్కలతో మనం తెలియజేస్తున్నాం. ఎన్నికల కోడ్ అయిపోగానే 50 వేల ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ రాబోతుంది. మనం లెక్కలతో సహా ఏం చేసినమో చూపాలి. బీజేపీ వాళ్లకు తెలివి లేదు మన్నులేదు. తిట్టుడే తిట్టుడు. మళ్ళేదైనా అంటే దేశం కోసం ధర్మం కోసం అంటరు. మోడీ కూడా చాలా హామీలు ఇచ్చిండు. వాటి లెక్క లు కూడా మీరు అడగండి. ఉద్యోగాలు ఏవీ అని బీజేపీ నేతలను అడిగితే పకోడీలు, బజ్జీల షాపుల లెక్కలు చెప్తారు. మన్మోహన్ సింగ్ అసమర్థత వల్లే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిందని విమర్శించిన మోడీ.. ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ రేట్లకు ఏం సమాధానం చెప్తరు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చర్చ పెట్టాలి. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చర్చ పెట్టాలి. 20లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ ఎవరి అకౌంట్‌లో వేశారు.
చదవండి: పాపం పసివాళ్లు: ఆస్పత్రి సిబ్బందే అమ్మనాన్న అయ్యారు
బీజేపీ నేతలు మోచేతిలో బెల్లం పెట్టి నాకమంటుంన్నారు. ఏమన్నాఅంటే దేశం కోసం ధర్మం కోసమంటరు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏందుకు పెట్టారు, ఐఐఎం ఏంఉకు ఇవ్వరు. గిరిజన యూనివర్సిటీల గురించి బీజేపీ నేతలను ప్రశ్నించండి. ఓక పేపర్, ఛానెల్ కోసం బీజేపీ నేతలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ పై మొరిగిన ఓ నేత ఓటుకు నోటు తో మొరుగుడు బందైంది. వీళ్ళకు గదే గతి పడుతుంది. రెండు గ్రాడ్యుయేట్ స్థానాలలో మన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి’’ అని పేర్కొన్నారు.
చదవండి: కేటీఆర్ పీఏనంటూ టోకరా
Comments
Please login to add a commentAdd a comment