యాభై రోజుల పూర్తి చేసుకున్న 'ఎవడు'
రాంచరణ్, శృతి హసన్ నటించిన 'ఎవడు' చిత్రం యాభై రోజులు పూర్తి చేసుకుంది. వంశీ పైడిపెళ్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో అనేక వాయిదాల పడిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈచిత్రం దిగ్విజయంగా యాభై రోజులు పూర్తి చేసుకుంది.
'ఎవడు' యాభై రోజులు పూర్తి చేసుకోవడం ఆనందాన్ని కలిగిస్తోంది అంటూ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో శృతి హసన్ ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. 'ఎవడు' చిత్ర విజయంలో కీలకమైన వంశీ పైడిపల్లి, రామ్ చరణ్, ప్రేక్షకులకు, చిత్రానికి పనిచేసిన ప్రతిఒక్కరి కృతజ్క్షతలు తెలిపింది. జనవరి 11 తేదిన విడుదలైన ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించగా, కాజల్ అగర్వాల్, అమీ జాక్సన్ అతిధి పాత్రలో కనిపించారు.