'ఎవడు' వస్తున్నాడు
ఎట్టకేలకూ ‘ఎవడు’ సినిమా విడుదల తేదీ ఖరారయ్యింది. ఆగస్టు నెలలో విడుదల కావాల్సిన ఈ చిత్రం రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడింది. చివరకు డిసెంబర్ 19న విడుదల చేయాలని నిర్మాత ‘దిల్’ రాజు నిర్ణయించారు.
రామ్ చరణ్, శ్రుతిహాసన్, అమీజాక్సన్ కాంబినేషన్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్నో భారీ హంగులతో ఈ చిత్రం తయారైంది. ఇందులో అల్లు అర్జున్ గెస్ట్‌గా పది నిమిషాల పాత్ర చేయడం విశేషం. ఇప్పటికే పాటలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ‘దిల్’రాజు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి.
తెలుగుతో పాటు మలయాళంలో కూడా డిసెంబర్ 19న విడుదల చేయబోతున్నాం. మా సంస్థలో పక్కా కమర్షియల్ సినిమా ఇది. రామ్‌చరణ్ కెరీర్‌లో ది బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది. తెలుగు సినిమాని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లే స్థాయిలో రూపొందింది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.