విడుదలకు ముందే ఉత్కంఠ
టైటిల్ ‘ఎవడు’. రామ్‌చరణ్ హీరో. అల్లు అర్జున్ స్పెషల్ రోల్. ప్రోమోస్‌లో చరణ్ పగతో రగిలిపోతూ అగ్నిపర్వతంలా కనిపిస్తున్నాడు. ఏదో ఊహించని ట్విస్ట్‌లు కథలో ఉన్నాయేమో అనిపిస్తోంది. విడుదలకు ముందే సినిమా ఉత్కంఠకు లోను చేస్తోంది. కొన్ని సినిమాలకు మాత్రమే... ఇలాంటి మ్యాజిక్కులు జరుగుతాయి. సినిమా పూర్తయి ఇన్నిరోజులవుతున్నా... ఇంకా ‘ఎవడు’ సినిమాపై అంచనాలు తగ్గకపోవడానికి కారణం ఇదే. ఈ నెల 12న ‘ఎవడు’ విడుదల కానుంది.
అభిమానుల ఆకలి తీర్చే సినిమా అవుతుందని నిర్మాత ‘దిల్’రాజు నమ్మకంగా చెబుతున్నారు. హాలీవుడ్ తరహా స్క్రీన్‌ప్లేతో దర్శకుడు పైడిపల్లి వంశీ ఈ చిత్రాన్ని మలిచినట్లు సమాచారం. నటునిగా చరణ్‌ని మరో స్టేజ్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ పాటలు ఇప్పటికే శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయి. గత ఏడాది సంక్రాంతికి చరణ్ ‘నాయక్’ మాస్‌ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సంక్రాంతికి రాబోతున్న ‘ఎవడు’ అదే ఫీట్‌ని రిపీట్ చేస్తుందని అభిమానుల ఆశాభావం.