‘ఎవడు’లో చరణ్ విశ్వరూపం | Ram Charan 'Yevadu' Release on 10th October | Sakshi
Sakshi News home page

‘ఎవడు’లో చరణ్ విశ్వరూపం

Published Tue, Aug 13 2013 11:18 PM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

‘ఎవడు’లో చరణ్ విశ్వరూపం

‘ఎవడు’లో చరణ్ విశ్వరూపం

మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎవడు’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇందులో రామ్ చరణ్ నటవిశ్వరూపం చూస్తారని, తెలుగు సినిమాను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లే సినిమా ఇదని దిల్రాజు నమ్మకం వ్యక్తం చేశారు. 
 
‘‘పైడిపల్లి వంశీ ‘ఎవడు’ రూపంలో ఓ అద్భుతాన్నే ఆవిష్కరించాడని చెప్పాలి. అల్లు అర్జున్ ఇందులో పది నిమిషాలే కనిపిస్తారు. కానీ ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం కనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తున్నాయి. మా సంస్థ నుంచి రాబోతున్న బ్లాక్బస్టర్ ఇది. అక్టోబర్ 10న అత్యధిక థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
 
శుతిహాసన్, అమీజాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో కాజల్ అతిథి పాత్ర పోషించారు. జయసుధ, కోట శ్రీనివాసరావు, సాయికుమార్, రాహుల్దేవ్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: ఆనంద్ సాయి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement