
తమిళంలో ఎవడు మగధీర
రామ్‌చరణ్, అల్లు అర్జున్ కథానాయకులుగా నటించిన టాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రం ఎవడు. కోలీవుడ్‌లో మగధీరగా రానుంది. ముగ్గురు ముద్దుగుమ్మలు కాజల్, శ్రుతిహాసన్, ఎమిజాక్సన్ కథానాయికలుగా అభినయంతో పాటు అందాలు తెరపై ఆరబోసిన కలర్‌ఫుల్ చిత్రం ఎవడు. ఇంతవరకు భారతీయ సినిమాలో రానటువంటి ఒక కొత్త పాయింట్‌తో భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, ప్రతీకారం, యాక్షన్ సన్నివేశాలకు ప్రాముఖ్యత నిస్తూ పక్కా కమర్షియల్ చిత్రంగా ఉంటుంది.
ప్రస్తుతం నాగార్జున, కార్తీతో హీరోలుగా ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వంశీ పైడిపల్లి ఈ ఎవడు చిత్రానికి దర్శకుడు. ఒక యువకుడు రెండు రూపాలు. అదెలా, ఎందుకు మారాల్సి వచ్చింది అన్న ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఎవడు చిత్రాన్ని తమిళంలో మగధీరగా ఏవీవీఎస్‌నాయుడు సమర్పణలో భద్ర కాళీ ఫిలిం పతాకంపై భద్రకాళి ప్రసాద్ అనువదిస్తున్నారు. ఈయన ఇంతకుముందు తమిళంలో వంబు, భద్రత, గాయత్రి ఐపీఎస్, హిందీలో భాష, తదితర చిత్రాలను అనువదించారన్నది గమనార్హం. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటున్న మగధీర చిత్రాన్ని వచ్చే నెలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చిత్రానికి ఏఆర్‌కే రాజా మాటలను, వివేకా, స్నేహన్, అరుణ్ భారతి, మీనాక్షి సుందరం పాటలు రాస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.