టార్చర్ అనుభవించాను! | working charan is a memorable incident : shruthi haasan | Sakshi
Sakshi News home page

టార్చర్ అనుభవించాను!

Published Wed, Jan 22 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

టార్చర్ అనుభవించాను!

టార్చర్ అనుభవించాను!

 ‘‘ ‘గబ్బర్‌సింగ్’ కథ విన్నప్పుడు... ‘ఒక హిట్ సినిమా కథ విన్నాను’ అనిపించింది.  అనుకున్నట్లే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. ‘ఎవడు’ కథ విన్నప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. ఆ సినిమా కూడా పెద్ద హిట్. అయితే... ఈ ఇద్దరు హీరోలూ ఒకే కుటుంబానికి చెందిన వారవ్వడం యాదృచ్ఛికం. మెగా హీరోలు నాకు కలిసొచ్చిన మాట నిజమే. కానీ.. ఆ సెంటిమెంట్లను మాత్రం నేను నమ్మను. సక్సెస్ అనేది కథ, దర్శకత్వం మీదే ఆధారపడి ఉంటుందని నమ్ముతాను’’ అని శ్రుతిహాసన్ అన్నారు. రామ్‌చరణ్ సరసన ఆమె నటించిన చిత్రం ‘ఎవడు’. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ‘దిల్’రాజు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు, అందులోని తన పాత్రకు వస్తున్న స్పందనపై శ్రుతి సంతోషం వెలిబుచ్చారు. ‘‘ఈ ఏడాది ప్రారంభంలో ‘ఎవడు’ రూపంలో మంచి విజయం దక్కడం ఆనందంగా ఉంది.
 
  చరణ్‌తో పనిచేయడం నిజంగా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. తన డాన్సులు నిజంగా సూపర్బ్. ఈ సినిమాలో నేను తనతో అడుగు కదిపాను. ‘నీ జతగా నేనుండాలి’, ‘నిన్ను చూడకుంటే చాలు’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో డాన్సులు, ఛేజ్‌లు ఎక్కువ ఉండడంతో టార్చర్ అనుభవించాను. సినిమా హిట్ అవ్వడంతో పడ్డ కష్టం మొత్తం దూదిపింజలా ఎగిరిపోయింది’’ అని ఆనందం వ్యక్తం చేశారు శ్రుతిహాసన్. దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఇప్పటికి మూడు సినిమాల్లో నటించానని, ఓ హీరోలా అనిపిస్తారని ఈ సందర్భంగా శ్రుతి కొనియాడారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement