ఎవడు రెడీ | Ram Charan's Yevadu to release on Dec 19 | Sakshi
Sakshi News home page

ఎవడు రెడీ

Published Tue, Nov 19 2013 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

ఎవడు రెడీ

ఎవడు రెడీ

ఇంతకూ ఇతను ‘ఎవడు’? కథ రీత్యా ఇందులో ప్రతినాయకునికి ఈ ప్రశ్నే అడుగడుగునా వెంటాడుతుందట. చూస్తున్న ప్రేక్షకుణ్ణి కూడా ఈ ప్రశ్నే కలవరపెడతుందట. అంతటి పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. రామ్‌చరణ్  కథానాయకునిగా నటించిన ఈ చిత్రంలో బన్నీ ఓ ప్రత్యేక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో బన్నీ, చరణ్‌ల పాత్రల మధ్య ఉండే అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. హాలీవుడ్ సినిమాను తలపించేలా దర్శకుడు పైడిపల్లి వంశీ ఈ చిత్రాన్ని మలిచారని తెలిసింది. డిసెంబర్ 19న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత ‘దిల్’రాజు మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
 
 ‘‘మెగా అభిమానులకు ఈ సినిమా విందుభోజనం లాంటిది. రామ్‌చరణ్ నటన, శ్రుతిహాసన్, అమీజాక్సన్ అందచందాలు, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. పైడిపల్లి వంశీ విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని మలిచాడు. మా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. మరో ప్రత్యేక పాత్రలో కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, సాయికుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ: పైడిపల్లి వంశీ, వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్ : ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, సమర్పణ: శ్రీమతి అనిత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement