ఇది ఆనంద సంక్రాంతి...
‘ఎవడు’ చిత్రంలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందని, ‘సంక్రాంతి’కి విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని
‘ఎవడు’ చిత్రంలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందని, ‘సంక్రాంతి’కి విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని శ్రుతిహాసన్ నమ్మకం వ్యక్తం చేశారు. రామ్‌చరణ్ కథానాయకునిగా పైడిపల్లి వంశీ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘ఎవడు’ చిత్రం ఈ నెల 12న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘ఎవడు మొబైల్ యాప్’ని చిత్ర కథానాయిక శ్రుతిహాసన్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
‘‘ఒక సినిమా విడుదలకు సిద్ధమైతే.. రెండో సినిమా సెట్స్‌పై ఉండటం మా సంస్థలో రివాజు. కానీ... మూడు స్క్రిప్టులు రెడీగా ఉన్నా మేం సెట్స్‌కి వెళ్లలేదు. కారణం ‘ఎవడు’. ఆ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేసిన తర్వాతే మా కథలను సెట్స్‌కి తీసుకెళ్తాం. ‘ఎవడు’పై మాకున్న నమ్మకానికి ఇదో మచ్చుతునక. చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అని అభినందించారు. అందరి అభిప్రాయాలనూ ఈ సినిమా నిజం చేస్తుంది’’ అని దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేశారు. ‘ఎవడు’ మా టీమ్ మొత్తానికి ఓ పరీక్ష లాంటిదని, రామ్‌చరణ్, అల్లు అర్జున్ తొలిసారి కలిసి నటించిన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని పైడిపల్లి వంశీ చెప్పారు.