
బాహుబలి పైరసీ సీడీలు స్వాధీనం
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి సినిమా పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్లో చార్మినార్ సమీపంలో పోలీసులు సీడీ షాపులపై దాడులు చేశారు. 115 పైరసీ సీడీలు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు.
ప్రభాస్,రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించిన బాహుబలి శుక్రవారం విడుదలయిన సంగతి తెలిసిందే. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసింది. పైరసీ భూతం అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అయినా బాహుబలి విడులయిన రెండు రోజుల్లోనే పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చాయి. పోలీసుల దాడులు చేసి పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు.